Sreeleela | నైట్ షూటింగ్ – పగలు ప్రమోషన్స్ – శ్రీలీల డెడికేషన్‌కు ఫ్యాన్స్ ఫిదా
సినీ కెరీర్ పరంగా ప్రస్తుతం శ్రీలీల గుడ్‌టైమ్ నడుస్తోంది. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ధనుష్ , శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన "ఓం" మూవీ నవంబర్ 20న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉంటూనే మరోవైపు అజిత్ "డేర్‌డెవిల్" షూటింగ్‌లో పాల్గొంటుంది. నైట్ షూటింగ్...పగలు ప్రమోషన్స్‌తో బ్రేక్ లేకుండా కష్టపడుతోంది శ్రీలీల.
Entertainment | Published On Nov 16, 2026, 4.35 pm IST
Sreeleela | ఓ వైపు షూటింగ్...మరోవైపు ప్రమోషన్స్‌తో విరామం లేకుండా తెగ కష్టపడుతోంది శ్రీలీల. ఆమె డెడికేషన్‌కు సినీ వర్గాలతో పాటు ఫ్యాన్స్ ఫిదా అవుతోన్నారు. ధనుష్, సాయిపల్లవి, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన "ఓం" మూవీ నవంబర్ 20న రిలీజ్ కాబోతుంది. ఈ పాన్ ఇండియన్ మూవీకి సంబంధించి వివిధ భాషల్లో మేకర్స్ ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేశారు. ధనుష్, సాయిపల్లవిలతో కలిసి శ్రీలీల ఈ ఈవెంట్స్‌కు అటెండ్ అవుతోంది. ఇటీవల చెన్నైలో జరిగిన ఓం ఆడియో లాంఛ్ వేడుకకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
డేర్‌డెవిల్...
"ఓం" ప్రమోషన్స్‌తో బిజీగా ఉంటూనే "డేర్‌డెవిల్" షూటింగ్‌లోనూ పాల్గొంటుంది. అజిత్ కథానాయకుడిగా కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శ్రీలీల ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది.
శివరాజ్‌కుమార్...
ప్రస్తుతం హైదరాబాద్ డేర్‌డెవిల్ షూటింగ్ జరుగుతోంది. అజిత్, శ్రీలీలతో పాటు ఉన్నిముకుందన్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. డేర్‌డెవిల్ మూవీలో కన్నడ సీనియర్ హీరో శివరాజ్‌కుమార్ విలన్‌గా నటించబోతున్నాడు. అతడు కూడా ఈ షెడ్యూల్‌లో జాయిన్ అయినట్లు చెబుతోన్నారు. నైట్ షూట్ జరుగుతోంది.
ప్రమోషనల్ ఈవెంట్స్...
డేర్‌డెవిల్ నైట్ షూట్స్‌లో పాల్గొంటూనే మరోవైపు పగలు మొత్తం ఓం సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలు, ప్రమోషనల్ ఈవెంట్లకు అటెండ్ అవుతోంది. బిజీ షెడ్యూల్స్ కారణంగా నిద్రకు టైమ్ దొరకడం లేదంటూ శ్రీలీల చెప్పింది.
డీ గ్లామర్ పాత్రలో...
ఓం సినిమాలో ధనుష్ భార్యగా యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్రలో పాత్రలో కనిపించబోతుంది. కంప్లీట్ డీ గ్లామరస్‌గా ఆమె క్యారెక్టర్ సాగనున్నట్లు సమాచారం. ఓం, డేర్‌డెవిల్‌తో పాటు రజనీకాంత్ ధర్మన్‌లో ఓ స్పెషల్ సాంగ్‌లో శ్రీలీల కనిపించబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Governor's Awards for Excellence-2026 | గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డ్స్‌కు దరఖాస్తు చేసుకోండి.. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన లోక్‌భవన్
- ●Sabarimala Temple | మకరవిళక్కు పూజల కోసం తెరుచుకున్న శబరిమల ఆలయం
- ●Stock Markets | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారులపై అమ్మకాల ఒత్తిడి..
- ●MLA Anirudh Reddy | వైఎస్సార్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊకోను: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వార్నింగ్
- ●Green India Challenge | కార్తీకమాసంలో హరిత సంకల్పం: ప్రతి ఇంటా ఉసిరి – ప్రతి గుడిలో బిల్వం
- ●J&K Encounter | జమ్ము కశ్మీర్లో ఎన్కౌంటర్.. లష్కరే తొయిబా ఉగ్రవాది హతం

Governor's Awards for Excellence-2026 | గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డ్స్‌కు దరఖాస్తు చేసుకోండి.. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన లోక్‌భవన్

Sabarimala Temple | మకరవిళక్కు పూజల కోసం తెరుచుకున్న శబరిమల ఆలయం

Stock Markets | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారులపై అమ్మకాల ఒత్తిడి..

MLA Anirudh Reddy | వైఎస్సార్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊకోను: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వార్నింగ్






