త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Osmania Students Protest | E1, E2 హాస్టళ్లకు నీళ్లు, క‌రెంటు ఇచ్చేదాకా క‌ద‌లం: ఉస్మానియా స్టూడెంట్స్‌

Osmania Students Protest | ఉస్మానియా యూనివ‌ర్సిటీ (OU) లోని E1, E2 హాస్టళ్లకు ప‌ది రోజులుగా నీళ్లు (Water), క‌రెంటు (Electricity) ఇవ్వ‌డం లేద‌ని ఉస్మానియా విద్యార్థులు (Students) ఆరోపించారు.

S

Telangana | Published On Nov 16, 2026, 2.29 pm IST

Osmania Students Protest | E1, E2 హాస్టళ్లకు నీళ్లు, క‌రెంటు ఇచ్చేదాకా క‌ద‌లం: ఉస్మానియా స్టూడెంట్స్‌
Advertisement

Osmania Students Protest | త్రినేత్ర న్యూస్‌: ఉస్మానియా యూనివ‌ర్సిటీ (OU) లోని E1, E2 హాస్టళ్లకు ప‌ది రోజులుగా నీళ్లు (Water), క‌రెంటు (Electricity) ఇవ్వ‌డం లేద‌ని ఉస్మానియా విద్యార్థులు (Students) ఆరోపించారు. త‌మ‌ను యూనివ‌ర్సిటీ నుంచి వెళ్లగొట్టేందుకు వీసీ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని వాపోయారు. శాంతియుతంగా దీక్ష చేస్తున్న త‌మ‌ను పోలీసులు అరెస్టు చేయ‌డం స‌రికాద‌న్నారు. సోమ‌వారం వారు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ ఇస్తామ‌న్న వెయ్యి కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

నీళ్లు, క‌రెంటుతో పాటు మా హాస్ట‌ళ్లు మాకు ఉండాల‌ని అడ్మినిస్ట్రేష‌న్ బిల్డింగ్ ద‌గ్గ‌ర శాంతియుతంగా మౌన‌ దీక్ష చేస్తున్నాం. నోటిఫికేష‌న్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చి మూడు సంవ‌త్స‌రాలు అవుతుంది. వీసీగారు విద్యార్థుల‌ను వెళ్ల‌గొట్టాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

మా నీళ్లు మాకు ఇవ్వండి. మా హాస్ట‌ళ్లు మాకు ఉంచండి. గ‌త నాలుగైదు రోజుల నుంచి చీఫ్ వార్డెన్‌కు, రిజిస్ట్రార్‌కు విన‌తిప‌త్రాలు ఇచ్చాం. మొన్న వీసీకి కూడా విన‌తిప‌త్రం ఇచ్చాం. ఇక్క‌డ అంద‌రూ బ‌డుగు బ‌ల‌హీన విద్యార్థులే ఉన్నారు. పెద్ద దిక్కుగా ఉన్న వీసీ హాస్ట‌ళ్లకు క‌రెంటు, నీళ్లు ఇవ్వాలి.

సీఎం రేవంత్‌రెడ్డి ఉస్మానియాకొచ్చి వెయ్యి కోట్లు ఇస్తామ‌న్నాడు. చెప్పి సంవ‌త్స‌రం దాటింది. ఇంకా ఇయ్య‌లే. ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బ‌కాయిలు కూడా లేవ్‌. రూ.1000 కోట్ల‌తోని కొత్త కొత్త హాస్ట‌ళ్లు క‌ట్టండి. ల్యాబ్‌లు క‌ట్టండి. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ల నోటిఫికేష‌న్లు వేయండి అని విద్యార్థులు కోరారు. అంత‌కుముందు నిరసన తెలుపుతున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

Advertisement
Advertisement