Vidya Balan | బాలకృష్ణ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ హీరోయిన్
రజనీకాంత్ జైలర్ 2లో విలన్ పాత్రతో అదరగొట్టింది విద్యాబాలన్. నెల్సన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కాంత పాత్రలో ఈ బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ నటనకు ప్రశంసలు దక్కాయి. తాజాగా విద్యాబాలన్ ఓ తెలుగు సినిమాలోనూ నెగెటివ్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూవీలో లేడీ విలన్‌గా ఈ బాలీవుడ్ బ్యూటీ కనిపించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.
Entertainment | Published On Nov 16, 2026, 3.45 pm IST
Vidya Balan | సినిమాల పరంగా యంగ్ హీరోలతో పోటీపడుతోన్నారు నందమూరి హీరో బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న దాదా మూవీ డిసెంబర్ 24న థియేటర్లలోకి రాబోతుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. దాదా సెట్స్‌పై ఉండగానే కొరటాల శివతో సినిమాను అనౌన్స్‌చేశారు బాలకృష్ణ. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా సెట్స్‌పైకి రాబోతుంది.
ఎన్‌బీకే 112...
బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 112వ సినిమా ఇది. ఎన్‌బీకే 112 అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విద్యాబాలన్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
లేడీ విలన్...
కథానుగుణంగా ఈ సినిమాలో పవర్‌ఫుల్ లేడీ విలన్ క్యారెక్టర్‌ను కొరటాల శివ డిజైన్ చేసినట్లు సమాచారం. ఈ పాత్ర కోసం మేకర్స్ ఇటీవలే విద్యాబాలన్‌ను అప్రోచ్ అయినట్లు వార్తలొస్తున్నాయి. బాలకృష్ణ సినిమాకు ఈ బాలీవుడ్ బ్యూటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇటీవల రజనీకాంత్ జైలర్ 2లో విద్యాబాలన్ నెగెటివ్ రోల్‌లో కనిపించింది. కాంత అనే పాత్రలో ఆమె విలనిజాన్ని పండించిన తీరుకు ప్రశంసలు వచ్చాయి. జైలర్ 2 తర్వాత మరోసారి విద్యాబాలన్ ప్రతినాయిక పాత్రను చేయబోతుండటం ఆసక్తికరంగా మారింది.
పొలిటికల్ లీడర్...
పొలిటికల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఎన్‌బీకే 112 తెరకెక్కుతోన్నట్లు సమాచారం. ఇందులో రాజకీయ నాయకుడిగా, సామాన్యుడిగా రెండు పాత్రల్లో బాలకృష్ణ కనిపించబోతున్నట్లు చెబుతోన్నారు. ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ మిక్కిలినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గతంలో తన తండ్రి ఎన్టీఆర్ జీవితం ఆధారంగా బాలకృష్ణ చేసిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాల్లో విద్యాబాలన్ నటించింది. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో కనిపించింది. ఈ బయోపిక్ తర్వాత వీరిద్దరు మరోసారి కలిసి సినిమా చేయబోతుండటం టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Governor's Awards for Excellence-2026 | గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డ్స్‌కు దరఖాస్తు చేసుకోండి.. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన లోక్‌భవన్
- ●Sabarimala Temple | మకరవిళక్కు పూజల కోసం తెరుచుకున్న శబరిమల ఆలయం
- ●Sreeleela | నైట్ షూటింగ్ - పగలు ప్రమోషన్స్ - శ్రీలీల డెడికేషన్‌కు ఫ్యాన్స్ ఫిదా
- ●Stock Markets | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారులపై అమ్మకాల ఒత్తిడి..
- ●MLA Anirudh Reddy | వైఎస్సార్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊకోను: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వార్నింగ్
- ●Green India Challenge | కార్తీకమాసంలో హరిత సంకల్పం: ప్రతి ఇంటా ఉసిరి – ప్రతి గుడిలో బిల్వం

Governor's Awards for Excellence-2026 | గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డ్స్‌కు దరఖాస్తు చేసుకోండి.. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన లోక్‌భవన్

Sabarimala Temple | మకరవిళక్కు పూజల కోసం తెరుచుకున్న శబరిమల ఆలయం

Sreeleela | నైట్ షూటింగ్ - పగలు ప్రమోషన్స్ - శ్రీలీల డెడికేషన్‌కు ఫ్యాన్స్ ఫిదా

Stock Markets | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారులపై అమ్మకాల ఒత్తిడి..






