త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Anirudh Reddy | వైఎస్సార్‌పై ఇష్ట‌మొచ్చినట్లు మాట్లాడితే ఊకోను: ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి వార్నింగ్

MLA Anirudh Reddy | దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజశేఖ‌ర్‌రెడ్డి (YS Rajashekar Reddy), వైస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడితే ఊకోన‌ని జ‌డ్చ‌ర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి (MLA Anirudh Reddy) హెచ్చ‌రించారు.

S

Telangana | Published On Nov 16, 2026, 4.16 pm IST

MLA Anirudh Reddy | వైఎస్సార్‌పై ఇష్ట‌మొచ్చినట్లు మాట్లాడితే ఊకోను: ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి వార్నింగ్
Advertisement

MLA Anirudh Reddy | త్రినేత్ర న్యూస్‌: దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజశేఖ‌ర్‌రెడ్డి (YS Rajashekar Reddy), వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడితే ఊకోన‌ని జ‌డ్చ‌ర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి (MLA Anirudh Reddy) హెచ్చ‌రించారు. త‌ప్పుడు వీడియోలు సృష్టిస్తూ, ట్రోలింగ్‌కు పాల్ప‌డితే స‌హించ‌న‌న్నారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా జ‌డ్చ‌ర్ల‌లో అనిరుధ్‌రెడ్డి సోమ‌వారం విలేక‌రుల‌తో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా వైఎస్ కుటుంబంపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.

తెలంగాణ‌ ప్ర‌జ‌ల గుండెల్లో ఉన్న‌రు

వైఎస్సార్‌ కుటుంబంపై దుష్ప్రచారం చేస్తే సహించా. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై చేస్తున్న‌ అసత్య ప్రచారాన్ని ఖండిస్తున్నా. తెలంగాణలోనైనా, ఆంధ్రప్రదేశ్‌లోనైనా ప్రతి పేదవాడి గుండెల్లో వైఎస్సార్‌ ఉన్నారు. వైఎస్సార్‌ గురించి తప్పుడు మాటలు మాట్లాడితే ఊరుకోం. సోషల్‌ మీడియాలో కావాలని ట్రోల్‌ చేస్తూ వైఎస్సార్‌, వైఎస్‌ జగన్‌ గురించి గ్రూపులలో రాస్తున్నారు. ఇలా చేస్తే ఊకుండం అని అనిరుధ్‌రెడ్డి హెచ్చరించారు.

Advertisement
Advertisement