Supreme Court | భారత్ సమ్మిట్‌లో ఓట్ చోరీ నినాదంపై పిల్.. విచారణకు సుప్రీం ఓకే
Supreme Court | తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ‘భారత్ సమ్మిట్ 2026’లో (Bharat Summit 2026) ఇటలీ నేత జియాకోమో ఫిలిబెక్ (Giacomo Filibeck) కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా చేసిన ఓట్ చోరీ (Vote Chor-Gaddi Chhod) నినాదంపై దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. నవంబర్ 20 విచారణకు జాబితా చేయాలని సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం రిజిస్ట్రీని ఆదేశించింది.
Supreme Court | త్రినేత్ర న్యూస్ : హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం (Telangana government) నిర్వహించిన ‘భారత్ సమ్మిట్ 2026’లో (Bharat Summit 2026) ఇటలీ రాజకీయ నాయకుడు, యూరోపియన్ సోషలిస్ట్స్ పార్టీ సెక్రటరీ జనరల్ జియాకోమో ఫిలిబెక్ (Giacomo Filibeck) కాంగ్రెస్‌కు మద్దతుగా ‘‘ఓట్ చోర్.. గద్దీ చోడ్’’(ఓట్ల దొంగ అధికారం నుంచి దిగిపోవాలి) అంటూ నినాదం చేయడం వివాదానికి దారి తీసింది. దీనిపై జాహిద్ అలీ అనే వ్యక్తి సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి మోహనాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం అంగీకరించింది. ఈ పిటిషన్‌ను నవంబర్ 20 విచారణకు జాబితా చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.
పిటిషనర్ వాదనలు
కాన్ఫరెన్స్ వీసాపై భారత్‌కు వచ్చిన విదేశీయులు దేశ అంతర్గత రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాజకీయ నినాదాలు చేయడం హోం మంత్రిత్వ శాఖ వీసా నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ తరఫున న్యాయవాది సయ్యద్ రిజ్వాన్ అహ్మద్ వాదనలు వినిపించారు. ఫిలిబెక్ వాటిని ఉల్లంఘించారా..? లేదా..? అనే దానిపై న్యాయ పరిశీలన జరపాలని కోరారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ అవినీతిమయంగా మారిందని పేర్కొంటూ "భారత్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడే విషయంలో మేము రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తాం" అని ప్రకటించారని కోర్టుకు తెలిపారు.
భారత అంతర్గత రాజకీయ వ్యవహారాల్లో, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక విదేశీ రాజకీయ ప్రతినిధి ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం తీవ్రమైన విషయమని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు కాంగ్రెస్‌కు మద్దతుగా ఫిలిబెక్ మాట్లాడిన వీడియోని సోషల్ మీడియా నుంచి తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ సదస్సు నిర్వహణ, విదేశీ ప్రతినిధుల అనుమతులపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో (SIT) విచారణ జరిపించాలని కోరారు. అంతేకాదు, ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వ పాత్రను పరిశీలించి చర్యలు తీసుకోవాలని పిటిషనర్ తరఫున అభ్యర్థించారు.
ఇదీ వివాదం..
నవంబర్ 13, 14 తేదీల్లో తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో 'భారత్ సమిట్ 2026' జరిగిన విషయం తెలిసిందే. ఇందులో పార్టీ ఆఫ్ యూరోపియన్ సోషలిస్ట్స్ (PES) సెక్రటరీ జనరల్, ఇటలీ నేత గియాకోమో ఫిలిబెక్ పాల్గొన్నారు. సదస్సులో ఫిలిబెక్ మాట్లాడుతూ.. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టిన ప్రచారాన్ని సమర్థించారు. అంతేకాకుండా, భారత ఎన్నికల ప్రక్రియను, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ "ఓట్ చోర్.. గద్దీ ఛోడ్" (Vote Chor, Gaddi Chhod) అంటూ స్టేజ్‌పై నినదించారు. ఇతర విదేశీ ప్రతినిధుల కోసం దానిని ఆంగ్లంలోకి అనువదించి మరీ వివరించారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం చలరేగింది. కాన్ఫరెన్స్ వీసాపై భారత్‌కు వచ్చిన ఓ విదేశీ ప్రతినిధి.. దేశ రాజకీయ అంశాల్లో జోక్యం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
Also Read..
బంగ్లాదేశ్‌లో అల్లర్లు.. యూనస్ ఇంటికి నిప్పు
భారత్ ఇప్పుడు సరికొత్త గేమ్ ఆడుతోంది.. జీటీఏ 6 లాంఛ్ వేళ ప్రధాని ఆసక్తికర పోస్ట్
నేడే ఆంథ్రోపిక్ ఐపీఓ లిస్టింగ్.. భారతీయులు షేర్లను ఎలా కొనవచ్చు..?
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Cauvery water | కావేరీ జలాల వివాదం.. తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
నవంబర్ 20, 2026

CJI Surya Kant | సీజేఐపై అనుచిత వ్యాఖ్యలు.. న్యాయవాదికి ధిక్కార నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు
నవంబర్ 18, 2026

Supreme Court | సీజేఐపై అనుచిత వ్యాఖ్యలు.. న్యాయవాదిపై ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
నవంబర్ 17, 2026
తాజావార్తలు
- ●Rahul Gandhi | రాజీపడిన ప్రధాని ఎప్పటికీ అక్కడ కూర్చోలేరు.. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు
- ●Gold Prices | భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. కారణాలేమిటి..?
- ●Cheyutha Pensions | అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకోవాలి..
- ●Mahesh Goud | కోట నీలిమపై అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు అనైతికం...: మహేశ్ గౌడ్
- ●EPFO | పీఎఫ్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఇక 2 నెలల్లోనే నగదు..
- ●Cauvery water | కావేరీ జలాల వివాదం.. తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

Rahul Gandhi | రాజీపడిన ప్రధాని ఎప్పటికీ అక్కడ కూర్చోలేరు.. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు

Gold Prices | భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. కారణాలేమిటి..?

Cheyutha Pensions | అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకోవాలి..

Mahesh Goud | కోట నీలిమపై అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు అనైతికం...: మహేశ్ గౌడ్



