Anthropic IPO | నేడే ఆంథ్రోపిక్ ఐపీఓ లిస్టింగ్.. భారతీయులు షేర్లను ఎలా కొనవచ్చు..?
Anthropic IPO | క్లాడ్ ఏఐని రూపొందించిన ఆంథ్రోపిక్ కంపెనీ గురువారం నాస్‌డాక్‌లో లిస్టింగ్ కానుంది. ఐపీఓ ధరను ఒక్కో షేరుకు 70 నుంచి 78 డాలర్లుగా నిర్ణయించారు. ప్రస్తుత సూచిక మారకం రేటు ప్రకారం భారతీయ ఇన్వెస్టర్లు ఒక్క షేరు కొనుగోలు చేయడానికి సుమారు రూ.6,542 నుంచి రూ.7,290 వరకు వెచ్చించాల్సి ఉంటుంది. కరెన్సీ మార్పిడి ఖర్చులు, బ్రోకరేజ్, ఇతర ఛార్జీలు అదనంగా ఉంటాయి.
Anthropic IPO | క్లాడ్ ఏఐని రూపొందించిన ఆంథ్రోపిక్ కంపెనీ గురువారం నాస్‌డాక్‌లో లిస్టింగ్ కానుంది. ఐపీఓ ధరను ఒక్కో షేరుకు 70 నుంచి 78 డాలర్లుగా నిర్ణయించారు. ప్రస్తుత సూచిక మారకం రేటు ప్రకారం భారతీయ ఇన్వెస్టర్లు ఒక్క షేరు కొనుగోలు చేయడానికి సుమారు రూ.6,542 నుంచి రూ.7,290 వరకు వెచ్చించాల్సి ఉంటుంది. కరెన్సీ మార్పిడి ఖర్చులు, బ్రోకరేజ్, ఇతర ఛార్జీలు అదనంగా ఉంటాయి.
షేర్లను ఎలా కొనాలి..?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ప్రముఖ సంస్థగా ఎదిగిన ఆంథ్రోపిక్ కంపెనీ స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధమైంది. గురువారం నాస్‌డాక్‌లో ఏఎన్‌టీ (ANT) టిక్కర్‌తో ట్రేడింగ్ ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో భారతీయ ఇన్వెస్టర్లు కూడా ఆ కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కంపెనీ ఐపీఓ ధరల శ్రేణిని 70 నుంచి 78 డాలర్లుగా నిర్ణయించింది. ఒక డాలర్‌కు రూ.93.47 మారకం రేటును పరిగణనలోకి తీసుకుంటే ఒక్క షేరు కనీస ధర సుమారు రూ.6,542 కాగా, గరిష్ఠ ధర రూ.7,290గా ఉంటుంది. అయితే భారత్‌లోని ఇన్వెస్టర్లు కంపెనీ ఏర్పాటు చేసిన అంతర్జాతీయ రిటైల్ ఐపీఓ సదుపాయం ద్వారా నేరుగా షేర్లకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు. భారత్ ఈ సదుపాయం వర్తించే మార్కెట్ల జాబితాలో లేదు. అందువల్ల నాస్‌డాక్‌లో ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత అంతర్జాతీయ షేర్లలో పెట్టుబడులకు అవకాశం కల్పించే బ్రోకరేజ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. భారత్‌లో ఇప్పటికే జెరోధా, ధన్ వంటి ప్లాట్‌ఫామ్‌లు విదేశీ స్టాక్స్‌లో పెట్టుబడులకు ప్రత్యేక సదుపాయం కల్పిస్తున్నాయి. అందువల్ల ఆంథ్రోపిక్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఆయా ప్లాట్‌ఫామ్‌లలో ఖాతాలను కలిగి ఉండాలి.
ఎంత వరకు పెట్టుబడులు పెట్టవచ్చు..?
భారతీయులు విదేశీ షేర్లలో పెట్టుబడులు పెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్)ను ఉపయోగించుకోవచ్చు. ఈ పథకం కింద ఒక్కొక్కరు ఆర్థిక సంవత్సరానికి గరిష్ఠంగా 2.5 లక్షల డాలర్ల వరకు అనుమతించిన విదేశీ పెట్టుబడుల కోసం పంపించుకోవచ్చు. అయితే లిస్టింగ్ అనంతరం మార్కెట్లో షేరు ధర ఐపీఓ ధర కంటే పెరిగే అవకాశం ఉంటుంది. డిమాండ్ అధికంగా ఉంటే ఒక్కో షేరుకు రూ.7,300 కంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. మరోవైపు ఈ ఐపీఓ ద్వారా 82.5 కోట్ల షేర్లను విక్రయించి గరిష్ఠంగా 64.4 బిలియన్ డాలర్లను సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల కంపెనీ విలువ 1.4 ట్రిలియన్ డాలర్ల వరకు చేరుతుందని అంచనా. దీనికి అదనంగా వ్యూహాత్మక పెట్టుబడిదారుల నుంచి 26 బిలియన్ డాలర్ల ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ద్వారా మొత్తం నిధుల సమీకరణ 90.4 బిలియన్ డాలర్లకు చేరుతుందని భావిస్తున్నారు. ఈ ఐపీఓకు దాదాపు ఏడు రెట్ల అధిక స్పందన లభించినట్లు నివేదికలు వెల్లడించాయి.
భారీగా పెరుగుతున్న ఆదాయం..
ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడెయి నేతృత్వంలో కంపెనీ రూపొందించిన క్లాడ్ ఏఐ మోడల్స్, ఎంటర్‌ప్రైజ్ ఏఐ ఉత్పత్తులకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. కంపెనీ తాజా ఎస్ఈసీ ఫైలింగ్ ప్రకారం.. అక్టోబర్ 31 నాటికి వార్షికీకరించిన ఆదాయం 81 బిలియన్ డాలర్లకు చేరింది. అంతకుముందు నెలలో ఇది 71 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే ఈ రన్‌రేట్ ఆదాయం ఇటీవలి వ్యాపార కార్యకలాపాలను వార్షిక ప్రాతిపదికన అంచనా వేసిన మొత్తం మాత్రమేనని, వాస్తవ వార్షిక ఆదాయంతో సమానం కాదని కంపెనీ స్పష్టం చేసింది. మరోవైపు ఏఐ కార్యకలాపాలకు అవసరమైన కంప్యూటింగ్ సామర్థ్యం, మౌలిక సదుపాయాల కోసం కంపెనీ మొత్తం 900.9 బిలియన్ డాలర్ల కట్టుబాట్లను వెల్లడించింది. భారీ పెట్టుబడులు, వేగంగా పెరుగుతున్న ఆదాయం నేపథ్యంలో ఆంథ్రోపిక్ ఐపీఓ అంతర్జాతీయ మార్కెట్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్
- ●Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్
- ●IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ
- ●MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
- ●Elderly couple death | వృద్ధాప్య సమస్యలతో భర్త మృతి.. తట్టుకోలేక గంటల వ్యవధిలోనే భార్య కన్నుమూత
- ●Indus Water | సింధూ జలాల ఒప్పందంపై మా వైఖరి స్పష్టంగా ఉంది : భారత్

Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్

Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్

IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ

MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు






