Supreme Court | అయోధ్య రామమందిరం విరాళాల కేసును రాజకీయం చేయొద్దు : సుప్రీంకోర్టు
Supreme Court | అయోధ్యలోని రామ మందిరంలో విరాళాల (Ayodhya temple donations) చోరీ అంశాన్ని రాజకీయం చేయొద్దని సుప్రీంకోర్టు (Supreme Court) హితవు పలికింది. కోర్టులు రాజకీయాలకు వేదిక కాదని పిటిషనర్లకు స్పష్టం చేసింది.
Supreme Court | దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్యలోని రామ మందిరంలో విరాళాల (Ayodhya temple donations) చోరీ అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)లో ఇవాళ విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని హితవు పలికింది. కోర్టులు రాజకీయాలకు వేదిక కాదని పిటిషనర్లకు స్పష్టం చేసింది. సరైన దర్యాప్తు జరిగేలా చూస్తామని హామీ ఇచ్చింది.
అయోధ్య రామ మందిరంలో విరాళాల చోరీపై దాఖలైన పిటిషన్లను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (CJI Justice Surya Kant), జస్టిస్ బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కేసు విచారణకు సిట్‌ను ఏర్పాటు చేశారా..? అని యూపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి ఆయన బదులిస్తూ.. ఈ కేసు దర్యాప్తునకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిందని కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర పోలీసులు విచారణ చేస్తున్నారని వెల్లడించారు. ఈ మేరకు దర్యాప్తు పురోగతిపై స్టేటస్ రిపోర్టును ధర్మాసనానికి సమర్పించారు. అనంతరం తదుపరి విచారణను కోర్టు ఈనెల 27కు వాయిదా వేసింది.
Also Read..
బిగ్‌బాస్ బ్యూటీతో ఎన్నారై కుర్రాడి రొమాన్స్.. టాలీవుడ్‌కి కొత్త హీరో దొరికాడన్న దిల్ రాజు!
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Supreme Court | రామ మందిర విరాళాల కేసు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని సిట్‌కు సుప్రీంకోర్టు ఆదేశం..
జులై 27, 2026

Supreme Court | మతం మారితే ఎస్సీ హోదా వర్తించదు.. సుప్రీంకోర్టు స్పష్టీకరణ
జులై 27, 2026

Supreme Court | ఆందోళన చేస్తున్నంతమాత్రాన లాఠీఛార్జ్ చేయకూడదు : సుప్రీంకోర్టు
జులై 27, 2026
తాజావార్తలు
- ●PM Modi | ప్రధాని మోదీ సెల్ఫీ వీడియో తొలగింపు.. క్షమాపణలు చెప్పిన మెటా
- ●Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
- ●Amarnath Yatra | అమర్నాథ్ యాత్రికుల బస్సు బోల్తా.. 39 మందికి గాయాలు
- ●Stock Markets | ఫ్లాట్‌గా కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఐటీ షేర్లలో కొనుగోళ్లు..
- ●RGV on NEET | విద్యావ్యవస్థను చంపేయండి.. అసలు నీట్‌కు ఎందుకు ప్రిపేర్ అవుతున్నారు?: ఆర్జీవీ సంచలన పోస్ట్
- ●Cockroach Janta Party | "ఏ ఒక్కరినీ వదిలిపెట్టం": అర్ధరాత్రి ప్రభుత్వంతో CJP చర్చలు సఫలం.. కేసుల మాఫీకి హామీ!

PM Modi | ప్రధాని మోదీ సెల్ఫీ వీడియో తొలగింపు.. క్షమాపణలు చెప్పిన మెటా

Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

Amarnath Yatra | అమర్నాథ్ యాత్రికుల బస్సు బోల్తా.. 39 మందికి గాయాలు

Stock Markets | ఫ్లాట్‌గా కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఐటీ షేర్లలో కొనుగోళ్లు..



