త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | ఆందోళన చేస్తున్నంత‌మాత్రాన లాఠీఛార్జ్ చేయకూడ‌దు : సుప్రీంకోర్టు

Supreme Court | శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు (peaceful protest) ప్ర‌తీఒక్క‌రికీ రాజ్యాంగం క‌ల్పించిన ప్రాథ‌మిక హ‌క్కు అని, కేవలం ఆందోళన చేస్తున్నంత మాత్రాన‌ లాఠీఛార్జ్ చేయ‌లేర‌ని సుప్రీంకోర్టు (Supreme Court) స్ప‌ష్టం చేసింది.

D

National | Published On Jul 27, 2026, 11.55 am IST

Supreme Court | ఆందోళన చేస్తున్నంత‌మాత్రాన లాఠీఛార్జ్ చేయకూడ‌దు : సుప్రీంకోర్టు
Advertisement

Supreme Court | శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు (peaceful protest) ప్ర‌తీఒక్క‌రికీ రాజ్యాంగం క‌ల్పించిన ప్రాథ‌మిక హ‌క్కు అని, కేవలం ఆందోళన చేస్తున్నంత మాత్రాన‌ లాఠీఛార్జ్ చేయ‌లేర‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. దేశవ్యాప్తంగా నీట్ యూజీ (NEET-UG) పేపర్ లీక్ వివాదంపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జరిగిన 'చలో సంసద్' మార్చ్ సందర్భంగా విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జ్‌ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను సీజేఐ జ‌స్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనాలతో కూడిన త్రిస‌భ్య‌ ధర్మాసనం సోమ‌వారం విచారించింది.

విచార‌ణ సంద‌ర్భంగా ఢిల్లీ ఘటనలపై స్వతంత్ర విచారణ జరపాలని, సీసీటీవీ ఫుటేజ్, బాడీ-కెమెరా రికార్డింగ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను భద్రపరచాలని, గాయపడినట్లు తేలిన నిరసనకారులకు నష్టపరిహారం చెల్లించాలని పిటిషనర్లు సుప్రీంకోర్టును కోరారు. స్పందించిన ధ‌ర్మాస‌నం.. ఆందోళనలు జరుగుతున్నాయనే కారణంతో పోలీసులు అతిగా బలప్రయోగం చేయడాన్ని సమర్థించలేమని వ్యాఖ్యానించింది. నిరసనల నియంత్రణలో చట్టబద్ధ విధానాలనే అనుసరించాలని.. ఆందోళనలను సాకుగా చూపి పోలీసుల మితిమీరిన బలప్రయోగం సమర్థించలేమని తెలిపింది.

అదే సమయంలో పోలీసుల భద్రతను కూడా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయరాదని తేల్చి చెప్పింది. పోలీసుల‌పై ఆక‌తాయిల దాడులపై ధ‌ర్మాస‌నం ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. పోలీసుల జీవితమూ విలువైనదేనని, పోలీసుల చర్యలతో పాటు, నిరసనకారుల హింసపై కూడా నిష్పక్షపాత దర్యాపు ఉండాలని స్పష్టం చేసింది. ఇది కేవలం ఢిల్లీకి సంబంధించిన సమస్య మాత్రమే కాద‌ని పేర్కొంది. అనేక ప్రాంతాల్లో ఆందోళ‌న‌లు జ‌రిగాయ‌ని తెలిపింది. శాంతియుత నిరసనలు, పోలీసుల చర్యలపై దేశమంతటా ఏకరూప మార్గదర్శకాలు అవసరమని ఈ సంద‌ర్భంగా పేర్కొంది. ఈ అంశానికి సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లు రేపు విచారిస్తామని తెలిపింది.

Also Read..

ప్ర‌ధాని మోదీపై అభ్యంత‌ర‌క‌ర‌మైన పోస్ట‌ర్‌.. బెంగాలీ న‌టిపై కేసు

బులియ‌న్ మార్కెట్ల‌లో జోష్‌.. భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌లు..

పాలమూరు ప్రజలను మరోసారి మోసం చేయొద్దు: మంత్రి వాకిటి శ్రీహరి

Advertisement
Advertisement