త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Prof. Ghanta Chakrapani | అధ్యాపకులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలి

Prof. Ghanta Chakrapani | ఉన్నత విద్యలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా అధ్యాపకులు తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని డాక‌ర్ట్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సెల‌ర్ ప్రొఫెస‌ర్ ఘంటా చక్రపాణి అన్నారు. విద్యార్థులు స్వీయ అధ్యయనం ద్వారా కూడా సులభంగా అంశాలను అర్థం చేసుకునేలా కోర్సు మెటీరియల్‌ను రూపొందించాలని సూచించారు.

P

Telangana | Published On Jul 20, 2026, 5.32 pm IST

Prof. Ghanta Chakrapani | అధ్యాపకులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
Advertisement
  • ఉప‌కుల‌ప‌తి ప్రొఫెస‌ర్ ఘంటా చక్రపాణి
  • అంబేద్కర్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం ప్రారంభం

Prof. Ghanta Chakrapani | ఉన్నత విద్యలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా అధ్యాపకులు తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని డాక‌ర్ట్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సెల‌ర్ ప్రొఫెస‌ర్ ఘంటా చక్రపాణి అన్నారు. విద్యార్థులు స్వీయ అధ్యయనం ద్వారా కూడా సులభంగా అంశాలను అర్థం చేసుకునేలా కోర్సు మెటీరియల్‌ను రూపొందించాలని సూచించారు. యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ స్టాఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్ (CSTD), సెంటర్ ఫర్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ (COEL) సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల కోసం నిర్వహిస్తున్న వారం రోజుల "మైక్రో క్రెడెన్షియల్ డెవలప్‌మెంట్" ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (ఎఫ్‌డీపీ) సోమవారం ప్రారంభమైంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, శిక్షణా కార్యక్రమాన్ని ఆయ‌న ప్రారంభించి మాట్లాడారు. మైక్రో క్రెడెన్షియల్ విధానాన్ని దృష్టిలో పెట్టుకుని విశ్వవిద్యాలయం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించిందని ఆయన తెలిపారు. ఈ శిక్షణ పొందిన అధ్యాపకులు రూపొందించే మైక్రో క్రెడెన్షియల్స్ ద్వారా విద్యార్థులు మార్కెట్ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను పెంపొందించుకుని ఉపాధి, ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. అధ్యాపకుల వృత్తిపరమైన అభివృద్ధికి తోడ్పడేలా అత్యాధునిక డిజిటల్ సాంకేతికతతో ఐసీటీ ల్యాబ్‌లను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రయోగశాలలు సాంకేతికత ఆధారిత బోధన, ఆన్‌లైన్ మరియు బ్లెండెడ్ లెర్నింగ్ కార్యక్రమాలకు కేంద్రంగా పనిచేస్తాయని వివరించారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సెంటర్ ఫర్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ (COEL) డైరెక్టర్ ప్రొఫెస‌ర్ పుష్ప చక్రపాణి మాట్లాడుతూ డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు మైక్రో క్రెడెన్షియల్ డెవలప్‌మెంట్‌పై శిక్షణతో పాటు, త్వరలో పాఠశాల ఉపాధ్యాయులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సెంటర్ ఫర్ స్టాఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్ (CSTD) డైరెక్టర్ ప్రొఫెస‌ర్ కే శ్రీదేవి మాట్లాడుతూ ఏడు రోజుల శిక్షణా కార్యక్రమం లక్ష్యాలు, అవసరాన్ని వివరించారు. కార్యక్రమంలో ప్రొఫెస‌ర్లు పల్లవి కాబ్డే, రవీంద్రనాథ్ సోలమన్, సుధారాణి, ఆనంద్ పవార్, ఓఈఆర్ నిపుణురాలు సుషుమ్న రావు, పలు విభాగాల డీన్లు, వివిధ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement