త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | మతం మారితే ఎస్సీ హోదా వ‌ర్తించ‌దు.. సుప్రీంకోర్టు స్ప‌ష్టీక‌ర‌ణ‌

Supreme Court | మతం మారిన వ్యక్తులకు సంబంధించి రాజ్యాంగబద్ధంగా లభించే షెడ్యూల్డ్ కులాల (Scheduled Caste) హోదాపై సుప్రీంకోర్టు (Supreme Court) కీల‌క తీర్పు వెలువ‌రించింది. మతం మారితే SC హోదా వర్తించదని అత్యున్న‌త న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది.

D

National | Published On Jul 27, 2026, 3.10 pm IST

Supreme Court | మతం మారితే ఎస్సీ హోదా వ‌ర్తించ‌దు.. సుప్రీంకోర్టు స్ప‌ష్టీక‌ర‌ణ‌
Advertisement

Supreme Court | మతం మారిన వ్యక్తులకు సంబంధించి రాజ్యాంగబద్ధంగా లభించే షెడ్యూల్డ్ కులాల (Scheduled Caste) హోదాపై సుప్రీంకోర్టు (Supreme Court) కీల‌క తీర్పు వెలువ‌రించింది. మతం మారితే SC హోదా వర్తించదని అత్యున్న‌త న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది. ఈ అంశంపై గ‌తంలో ఏపీ హైకోర్టు (AP High Court) ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

ఒక వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత కూడా ఎస్సీ రిజర్వేషన్ ప్రయోజనాలను లేదా సర్టిఫికేట్‌ను పొందడం చెల్లదని, మత మార్పిడితో ఎస్సీ హోదా స్వయంచాలకంగా రద్దవుతుందని మార్చి 2026లో ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ బాధితులు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన సుప్రీం ధ‌ర్మాస‌నం.. హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ నిబంధనలకు కట్టుబడి ఉంద‌ని తెలిపింది.

అయితే, క్రైస్తవం లేదా ఇతర మతాల్లోకి మారిన వ్యక్తి తిరిగి హిందూ, సిక్కు, బౌద్ధ మతాన్ని స్వీకరిస్తే.. కొన్ని నిర్దిష్ట షరతుల మేరకు ఎస్సీ హోదా పునరుద్ధరణకు అవకాశం ఉంటుందని ధ‌ర్మాస‌నం తెలిపింది. వ్యక్తి జన్మతః షెడ్యూల్డ్ కులానికి చెందినవారై ఉండాల‌ని, తిరిగి హిందూ, సిక్కు, బౌద్ధ మతాన్ని నిజమైన ఉద్దేశంతో స్వీకరించి ఉండాల‌ని, సంబంధిత అసలు కులం ఆ వ్యక్తిని తిరిగి తమ సభ్యుడిగా అంగీకరించి ఉండాల‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మూడు ష‌ర‌తుల్లో ఏ ఒక్క‌టి నెర‌వేర‌క‌పోయినా ఎస్సీ హోదాను పున‌రుద్ధ‌రించ‌డం సాధ్యం కాద‌ని జ‌స్టిస్ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రా, జ‌స్టిస్ మ‌న్మోహ‌న్ తో కూడిన ధ‌ర్మాసనం స్ప‌ష్టం చేసింది.

Also Read..

కేవ‌లం వ‌డ్డీ ద్వారానే రూ.50 ల‌క్ష‌లు పొంద‌వ‌చ్చు.. పోస్టాఫీస్‌లో అద్భుత‌మైన ప‌థ‌కం..

జూరాల‌కు వ‌ర‌దొస్తోంది.. అయినా నెట్టెంపాడు, భీమాకోయిల్ సాగ‌ర్ మోటార్లు ఎందుకు ఆన్ చేస్త‌లేరు?

ఫ్యామిలీ మ్యాన్‌గా వెంక‌టేష్ - ఆద‌ర్శ‌కుటుంబం నుంచి చిట్టిబాబు గ్లింప్స్ రిలీజ్‌

Advertisement

తాజావార్తలు

Advertisement