Aga Syed Ruhullah Mehdi | ఒమర్ అబ్దుల్లాకి షాక్.. శ్రీనగర్ ఎంపీ రాజీనామా
Aga Syed Ruhullah Mehdi | నేషనల్ కాన్ఫరెన్స్ (National Conferenc) పార్టీకి గట్టి షాక్ తగిలింది. శ్రీనగర్ పార్లమెంట్ సభ్యుడు (Srinagar MP), పార్టీ సీనియర్ నేత ఆగా సయ్యద్ రుహుల్లా మెహదీ ఎంపీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Aga Syed Ruhullah Mehdi | త్రినేత్ర న్యూస్ : జమ్ముకశ్మీర్‌లో సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) ప్రభుత్వం తీవ్ర అంతర్గత సంక్షోభంలో కూరుకుపోయింది. అధికార నేషనల్ కాన్ఫరెన్స్ (National Conferenc) పార్టీకి చెందిన 25 మంది అసంతృప్త ఎమ్మెల్యేలు ఇప్పటికే తిరుగుబాటు జెండా ఎగరేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా శ్రీనగర్ పార్లమెంట్ సభ్యుడు (Srinagar MP), పార్టీ సీనియర్ నేత ఆగా సయ్యద్ రుహుల్లా మెహదీ (Aga Syed Ruhullah Mehdi) కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఎంపీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
బుద్గామ్‌లో (Budgam) జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. 24 ఏళ్ల పాటు నేషనల్ కాన్ఫరెన్స్‌తో ఉన్న అనుబంధాన్ని తెంచుకుంటున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు (Lok Sabha Speaker Om Birla) ఈమెయిల్ ద్వారా పంపినట్లు తెలిపారు. తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటిస్తూ రుహుల్లా.. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రిజర్వేషన్ల అంశం, ఆర్టికల్ 370, జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ వంటి ఎన్నికల హామీల విషయంలో పార్టీ నాయకత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాకు పంపుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

Also Read..
దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి?.. లక్ష్మీ పూజ శుభ ముహూర్తం, 5 రోజుల క్యాలెండర్, పూజా విధానం ఇదే..!
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Abdullah Family Kashmiri Pandit Roots | నిధి రజ్దాన్‌తో ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి: కశ్మీరీ పండిట్లతో అబ్దుల్లా కుటుంబానికి ఉన్న శతాబ్దాల బంధం ఏమిటి?
నవంబర్ 2, 2026

Omar Abdullah | 14 రోజుల్లో తేల్చకుంటే కూల్చుడే.. ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వానికి 25 మంది ఎమ్మెల్యేల అల్టిమేటం
నవంబర్ 2, 2026

Omar Abdullah Nidhi Razdan Marriage | మూడుముళ్ల బంధంతో ఒక్కటైన జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, జర్నలిస్ట్ నిధి రజ్దాన్
అక్టోబర్ 31, 2026
తాజావార్తలు
- ●ASUS | ఏఐ చిప్‌తో అసుస్ కొత్త ల్యాప్‌టాప్‌లు.. ధరలు ఎంతంటే?
- ●CM Revanth Reddy | తుమ్మిడిహెట్టి బ్యారేజీపై మహారాష్ట్రతో సంప్రదింపులు జరపండి..
- ●Darpalli Rajasekhar Reddy | ఒక్కో నీటి చుక్కను ఒడిసిపట్టాలన్నదే సీఎం ఆలోచన
- ●Tummala Nageshwar Rao | సమగ్ర సేద్యంతో రైతులకు నిత్యాదాయం సాధ్యమే
- ●Diwali 2026 | దీపావళి ముహూర్త ట్రేడింగ్.. ఈ 6 స్టాక్స్‌పై కన్నేయండి..
- ●Ramayana Song Controversy | రామాయణ సాంగ్‌పై వివాదం.. స్పందించిన అర్మాన్ మాలిక్

ASUS | ఏఐ చిప్‌తో అసుస్ కొత్త ల్యాప్‌టాప్‌లు.. ధరలు ఎంతంటే?

CM Revanth Reddy | తుమ్మిడిహెట్టి బ్యారేజీపై మహారాష్ట్రతో సంప్రదింపులు జరపండి..

Darpalli Rajasekhar Reddy | ఒక్కో నీటి చుక్కను ఒడిసిపట్టాలన్నదే సీఎం ఆలోచన

Tummala Nageshwar Rao | సమగ్ర సేద్యంతో రైతులకు నిత్యాదాయం సాధ్యమే



