CM Devendra Fadnavis | ఆమె ప్రముఖ నటే కావొచ్చు.. బీఎంసీకి ఆ హక్కు ఉంది.. దియా మీర్జా వీడియో వివాదంపై మౌనం వీడిన సీఎం ఫడ్నవీస్
CM Devendra Fadnavis | బాలీవుడ్ నటి దియా మీర్జా దీపావళి అవగాహన వీడియోని (Dia Mirzas Diwali firecracker awareness video) తొలగించడం పట్ల ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (CM Devendra Fadnavis) మౌనం వీడారు. ఇది చాలా చిన్న విషయమని, తమ స్థాయికి సంబంధించిన సమస్య కాదని పేర్కొన్నారు. వీడియోని తొలగించే పూర్తి హక్కు బీఎంసీకి (BMC) ఉందంటూ సంస్థ చర్యలను సమర్థించారు.
CM Devendra Fadnavis | త్రినేత్ర న్యూస్ : బాలీవుడ్ నటి దియా మీర్జా దీపావళి అవగాహన వీడియోపై (Dia Mirzas Diwali firecracker awareness video) వివాదం మరింత ముదిరింది. వీడియోని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) తొలగించడం పట్ల బాంబే హైకోర్టు (Bombay High Court) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియోని సోషల్ మీడియాలో రీపోస్ట్ చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (CM Devendra Fadnavis) స్పందించారు. ఇది చాలా చిన్న విషయమని, తమ స్థాయికి సంబంధించిన సమస్య కాదని పేర్కొన్నారు. వీడియోని తొలగించే పూర్తి హక్కు బీఎంసీకి ఉందంటూ సంస్థ చర్యలను సమర్థించారు.
ఇవాళ పూణెలో విలేకరులతో సీఎం మాట్లాడారు. "ఇది చాలా చిన్న విషయం. హైకోర్టు ఎవరినైనా మందలించిందా లేదా ఏదైనా అభిప్రాయం వ్యక్తం చేసిందా అనేది నాకు తెలియదు. ఎందుకంటే అసలు ఈ విషయం హైకోర్టుకే వెళ్లలేదు. ఇక వీడియోను తొలగించడం అనేది పూర్తిగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం. బీఎంసీ (BMC) తన విచక్షణతోనే ఆ వీడియోను తొలగించింది. ఏ కంటెంట్‌ను ఉంచాలి, దేన్ని తొలగించాలి అని నిర్ణయించే హక్కు సోషల్ మీడియా హ్యాండిల్‌ను నిర్వహించే అధికార సంస్థకు ఉంటుంది" అని ఆయన అన్నారు. అదేవిధంగా దియా మీర్జా ప్రముఖ నటే కావొచ్చని, కానీ ఆమె జాతీయ స్థాయి నాయకురాలు కాదని సీఎం వ్యాఖ్యానించారు. "దియా మీర్జా పేరుమోసిన నటే కావొచ్చు. కానీ ఆమె జాతీయ స్థాయి నాయకురాలు మాత్రం కాదు. ఇలాంటి చిన్న విషయాలు మా స్థాయికి సంబంధించినవి కావు" అని సీఎం వ్యాఖ్యానించారు.
అంతకుముందు వీడియోని BMC తొలగించడం పట్ల బాంబే హైకోర్టు (Bombay High Court) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు బీఎంసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ ఒత్తిళ్లు, విమర్శల కారణంగా ప్రజల్లో పర్యావరణ స్పృహను పెంపొందించే ఇలాంటి సామాజిక ప్రచార వీడియోలను తొలగించడం పట్ల జస్టిస్ గిరీష్ కుల్కర్ణి, జస్టిస్ నీలా గోఖలేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. మనది సెక్యులర్ దేశమని, కాలుష్యంపై అవగాహన కల్పించేందుకు చేసిన వీడియోకు అనవసర రంగులు పులమడం ఏంటని ప్రశ్నించింది. కాలుష్య రహిత దీపావళి జరుపుకోవాలని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బీఎంసీ చేపట్టిన చర్యలను సమర్థించిన ధర్మాసనం.. ఇంతటి బృహత్తరమైన కార్యక్రమం చేపట్టినప్పుడు అక్కడ వర్గపోరకు తావులేదని స్పష్టం చేసింది. వీడియోను మళ్లీ పునరుద్ధరించడం సరైన చర్య అని అభిప్రాయపడింది. అయితే, దీనిపై తుది నిర్ణయాన్ని మాత్రం బీఎంసీ విచక్షణకే వదిలేస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.
Also Read..
దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ కొనుగోళ్లు.. పెట్టుబడిదారులకు పండగే..
పతంజలి ఆవు నెయ్యిని వాడుతున్నారా? వెంటనే ఇది చదవండి
27 ఏళ్ల యువ ఇంజనీర్‌కు సిస్కో భారీ బాధ్యత.. రెండేళ్లలో 98 శాతం కోడ్ మార్పు..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bombay High Court | దియా మీర్జా దీపావళి వీడియోపై వివాదం.. బీఎంసీ చర్యలపై బాంబే హైకోర్టు ఆగ్రహం
నవంబర్ 3, 2026

Actor Imran Khan | భవిష్యత్తులో ఎలాంటి నిరసనల్లో పాల్గొనను.. బాంబే హైకోర్టుకు హీరో ఇమ్రాన్ క్షమాపణలు..!
నవంబర్ 2, 2026

Dia Mirza | దియా మీర్జా దీపావళి యాడ్‌పై బీజేపీ నేతల అభ్యంతరం – డిలీట్ చేసిన బీఎంసీ
నవంబర్ 2, 2026
తాజావార్తలు
- ●KTR | మస్కట్ నుంచి స్వదేశానికి.. మాట నిలబెట్టుకున్న కేటీఆర్
- ●Cisco | 27 ఏళ్ల యువ ఇంజనీర్‌కు సిస్కో భారీ బాధ్యత.. రెండేళ్లలో 98 శాతం కోడ్ మార్పు..
- ●Patanjali Cow Ghee Seized | పతంజలి ఆవు నెయ్యిని వాడుతున్నారా? వెంటనే ఇది చదవండి
- ●IPL 2027 | ముంబయి ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా గుడ్ బై?
- ●Pooja Hegde | ఉన్న ఒక్క ఛాన్స్ పాయే - సునీల్ శెట్టి కొడుకు మూవీ నుంచి పూజా హెగ్డే ఔట్!
- ●Dasoju Sravan | రేవంత్ ధర్నా, అమిత్ షా పాదయాత్రతో తెలంగాణకు ఏం ఒరిగింది?

KTR | మస్కట్ నుంచి స్వదేశానికి.. మాట నిలబెట్టుకున్న కేటీఆర్

Cisco | 27 ఏళ్ల యువ ఇంజనీర్‌కు సిస్కో భారీ బాధ్యత.. రెండేళ్లలో 98 శాతం కోడ్ మార్పు..

Patanjali Cow Ghee Seized | పతంజలి ఆవు నెయ్యిని వాడుతున్నారా? వెంటనే ఇది చదవండి

IPL 2027 | ముంబయి ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా గుడ్ బై?



