త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramayana Song Controversy | రామాయ‌ణ సాంగ్‌పై వివాదం.. స్పందించిన అర్మాన్‌ మాలిక్‌

Ramayana Song Controversy | రణ్‌బీర్‌ కపూర్‌ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ‌’లోని ‘మంగళ రంగ్‌’ సాంగ్ చర్చనీయాంశంగా మారింది. ఈ పాటలో సూఫీ ఖవ్వాలి ఛాయలు కనిపిస్తున్నాయంటూ కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

P

Entertainment | Published On Nov 3, 2026, 4.47 pm IST

Ramayana Song Controversy | రామాయ‌ణ సాంగ్‌పై వివాదం.. స్పందించిన అర్మాన్‌ మాలిక్‌
Advertisement

Ramayana Song Controversy | రణ్‌బీర్‌ కపూర్‌ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ‌’లోని ‘మంగళ రంగ్‌’ సాంగ్ చర్చనీయాంశంగా మారింది. ఈ పాటలో సూఫీ ఖవ్వాలి ఛాయలు కనిపిస్తున్నాయంటూ కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హిందూ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో ఇలాంటి ప్రయోగం అవసరమా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ విమర్శలపై కన్నడ వెర్షన్‌ ‘మంగళ సంగమం’ పాడిన అర్మాన్‌ మాలిక్‌ స్పందించాడు. సంగీతాన్ని ఆస్వాదించే తీరు ఒక్కొక్కరిదీ ఒక్కోలా ఉంటుందని అర్మాన్‌ పేర్కొన్నాడు. తెరపై కనిపించే పవిత్ర ప్రేమ, దైవత్వాన్ని సంగీతం ద్వారా ప్రతిబింబించడమే తమ బృందం లక్ష్యమని తెలిపాడు. కళాకారుడిగా ఆ ఘట్టంలోని భక్తిభావాన్ని గౌరవంగా తన గానంలో పలికించేందుకు ప్రయత్నించానని వివరించాడు.

రణ్‌బీర్‌ కపూర్‌కు గాత్ర‌దానం అందించాలన్నది ఎప్పటినుంచో ఉన్న కల అని అర్మాన్‌ తెలిపాడు. రణ్‌బీర్‌, షారుఖ్‌ వంటి స్టార్‌ హీరోలకు పాడాలని గతంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పినట్లు గుర్తుచేశాడు. ‘మంగళ సంగమం’తో ఆ కోరిక నెరవేరడం వ్యక్తిగతంగా ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నాడు. ఇదిలా ఉండ‌గా.. నితేశ్‌ తివారీ దర్శకత్వంలో నమిత్‌ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌, సీతగా సాయిపల్లవి నటిస్తున్న‌ది. రావణుడిగా క‌న్న‌డ సూప‌ర్ స్టార్ యశ్‌, లక్ష్మణుడిగా రవిదూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్‌ కనిపించనున్నారు. నవంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలోని హిందీ పాటను అరిజిత్‌ సింగ్‌, శ్రేయా ఘోషల్‌ ఆలపించగా.. కన్నడ వెర్షన్‌ను అర్మాన్‌ మాలిక్‌, బేలా షిండే పాడారు.

ట్యాగ్స్:

Armaan MalikBollywoodEntertainment NewsMangal Rang SongMangala SangamNamit MalhotraNitesh TiwariRamayana MovieRamayana Song ControversyRanbir KapoorSai PallaviSufi QawwaliTelugu NewsYash
Advertisement
Advertisement