Omar Abdullah | 14 రోజుల్లో తేల్చకుంటే కూల్చుడే.. ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వానికి 25 మంది ఎమ్మెల్యేల అల్టిమేటం
Omar Abdullah | త్రినేత్ర న్యూస్: జమ్ముకశ్మీర్‌లో సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) ప్రభుత్వం తీవ్ర అంతర్గత సంక్షోభంలో కూరుకుపోయింది. అధికార నేషనల్ కాన్ఫరెన్స్ (NC) పార్టీకి చెందిన 25 మంది అసంతృప్త ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరేశారు. తమ డిమాండ్లను 14 రోజుల్లోగా పరిష్కరించకపోతే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని పార్టీ అధిష్టానాన్ని (Ultimatum) హెచ్చరించారు. రెండు వారోల్లోగా డిమాండ్లను నెరవేర్చనట్లయితే రాజ్‌భవన్‌కు వెళ్లి ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకుంటామని (Withdraw Support) ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.
మంత్రివర్గాన్ని (Cabinet Overhaul) మొత్తం రద్దు చేయాలని, సీఎం సలహాదారును వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. పారదర్శకమైన, అర్హత ఆధారిత విధానం ద్వారా కొత్త మంత్రిమండలిని ఏర్పాటు చేయాలని, కొద్దిమంది చేతుల్లోనే నిర్ణయాధికారాలు ఉంచకుండా, మంత్రుల నియామకాల్లో శాసనసభ పక్షం మొత్తాన్ని సంప్రదించాలని స్పష్టం చేశారు. వీటితో పాటు పార్టీ సిద్ధాంతపరమైన నిబద్ధతలు, ఎన్నికల మ్యానిఫెస్టో అమలుపైనా అసంతృప్త ఎమ్మెల్యేలు ప్రశ్నలు లేవనెత్తారు. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35Aతో పాటు ఇతర రాజ్యాంగ రక్షణల పునరుద్ధరణ కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో రాజీలేని పోరాటం చేయాలని డిమాండ్ చేశారు.
అసంతృప్తికి కారణం ఇదే..
అక్టోబర్ 27న సీఎం అబ్దుల్లా కేబినేట్‌ను విస్తరించారు. కొత్తగా నలుగురికి మంత్రులుగా అవకాశం కల్పించారు. అయితే సీనియర్లుగా ఉన్నప్పటికీ తమకు అవకాశం దక్కకపోవడంతో పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో మంత్రివర్గ ప్రక్షాళన డిమాండ్ తెరపైకి వచ్చింది. మరోవైపు సీనియర్ నేత ముబారక్ గుల్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించడం, ఆయనకు కేబినెట్ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో పార్టీ సంస్థాగత పదవిని చేపట్టేందుకు కూడా ఆయన నిరాకరించినట్లు సమాచారం.
జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 46. ప్రస్తుతం నేషనల్ కాన్ఫరెన్స్‌కు 41 మంది, కాంగ్రెస్‌కు (Congress) ఆరుగురు ఎమ్మెల్యేలు కలిపి అధికార కూటమి బలం 47గా ఉంది. అంటే మెజార్టీకి అవసరమైన సంఖ్య కంటే కేవలం ఒక్క సీటు మాత్రమే అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు అసమ్మతి గళం వినిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవేళ వారంతా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటే, కాంగ్రెస్ మద్దతు కొనసాగినప్పటికీ కూటమి బలం 22కు పడిపోతుంది. ప్రస్తుతం ఈ వ్యవహారం నేషనల్ కాన్ఫరెన్స్ నాయకత్వానికి సవాలుగా మారింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Omar Abdullah Nidhi Razdan Marriage | మూడుముళ్ల బంధంతో ఒక్కటైన జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, జర్నలిస్ట్ నిధి రజ్దాన్
అక్టోబర్ 31, 2026

Terrorists Killed | ఎల్ఓసీ దాటే యత్నం.. ల్యాండ్‌మైన్ పేలి నలుగురు ఉగ్రవాదులు హతం!
అక్టోబర్ 12, 2026

Fauzi Musa | బుద్గాంలో ఎన్కౌంటర్.. లష్కరే టాప్ కమాండర్ హతం
సెప్టెంబర్ 30, 2026
తాజావార్తలు
- ●TVS | సంగిశెట్టి శ్రీనివాస్‌కు మల్లావఝల సదాశివుడు స్మారక పురస్కారం
- ●Horoscope | నవంబర్ 2 రాశిఫలాలు.. తోబుట్టువులతో అపార్థాలు రావచ్చు!
- ●KTR Rythu Garjana Adilabad | ఎకరానికి రూ.60 వేలు రైతుల ఖాతాల్లో వెంటనే జమ చేయ్
- ●INDIA Bloc Delhi Rally | ఓట్ల దొంగలను వదిలిపెట్టం.. జ్ఞానేశ్ జైలుకెళ్లడం ఖాయం
- ●KTR Adilabad Rythu Garjana | ఇది అచ్చ కాంగ్రెస్ కాదు.. పచ్చ కాంగ్రెస్ కాదు.. లుచ్చా కాంగ్రెస్
- ●Namasthe Telangana First Batch Reunion | 16 ఏళ్ల తర్వాత నమస్తే తెలంగాణ తొలి బ్యాచ్ ఆత్మీయ కలయిక: అవమానాలు దాటి చరిత్ర సృష్టించాం

TVS | సంగిశెట్టి శ్రీనివాస్‌కు మల్లావఝల సదాశివుడు స్మారక పురస్కారం

Horoscope | నవంబర్ 2 రాశిఫలాలు.. తోబుట్టువులతో అపార్థాలు రావచ్చు!

KTR Rythu Garjana Adilabad | ఎకరానికి రూ.60 వేలు రైతుల ఖాతాల్లో వెంటనే జమ చేయ్

INDIA Bloc Delhi Rally | ఓట్ల దొంగలను వదిలిపెట్టం.. జ్ఞానేశ్ జైలుకెళ్లడం ఖాయం



