త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ASUS | ఏఐ చిప్‌తో అసుస్ కొత్త ల్యాప్‌టాప్‌లు.. ధరలు ఎంతంటే?

ASUS | ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ అసుస్ భారత మార్కెట్లో ప్రోఆర్ట్ పీ16, ప్రోఆర్ట్ పీ14 ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. ఎన్విడియా ఆర్టీఎక్స్ స్పార్క్ ఎన్1ఎక్స్ ప్రాసెసర్‌తో రూపొందించిన ఈ ల్యాప్‌టాప్‌లు స్థానికంగా కృత్రిమ మేధ ఆధారిత పనులు నిర్వహించేందుకు వీలుగా ఉన్నాయి. వీటితోపాటు ప్రోఆర్ట్ మౌస్ ఎండీ301, ప్రోఆర్ట్ కీబోర్డ్ కేడీ300లను కూడా సంస్థ పరిచయం చేసింది.

S

Technology | Published On Nov 3, 2026, 5.17 pm IST

ASUS | ఏఐ చిప్‌తో అసుస్ కొత్త ల్యాప్‌టాప్‌లు.. ధరలు ఎంతంటే?
Advertisement

ASUS | ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ అసుస్ భారత మార్కెట్లో ప్రోఆర్ట్ పీ16, ప్రోఆర్ట్ పీ14 ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. ఎన్విడియా ఆర్టీఎక్స్ స్పార్క్ ఎన్1ఎక్స్ ప్రాసెసర్‌తో రూపొందించిన ఈ ల్యాప్‌టాప్‌లు స్థానికంగా కృత్రిమ మేధ ఆధారిత పనులు నిర్వహించేందుకు వీలుగా ఉన్నాయి. వీటితోపాటు ప్రోఆర్ట్ మౌస్ ఎండీ301, ప్రోఆర్ట్ కీబోర్డ్ కేడీ300లను కూడా సంస్థ పరిచయం చేసింది.

కంటెంట్ క్రియేట‌ర్లు, డిజైన‌ర్లు, ఏఐ ప‌నుల‌కు..

కంటెంట్ క్రియేటర్లు, డిజైనర్లు, ఏఐ ఆధారిత పనులు నిర్వహించే నిపుణులను లక్ష్యంగా చేసుకుని అసుస్ కొత్త ప్రోఆర్ట్ ల్యాప్‌టాప్‌లను భార‌త్‌లో విడుదల చేసింది. ప్రోఆర్ట్ పీ16లో 20 కోర్ల సీపీయూ, 6,144 కోర్ల జీపీయూతో కూడిన ఎన్విడియా ఆర్టీఎక్స్ స్పార్క్ ఎన్1ఎక్స్ ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో 128 జీబీ యూనిఫైడ్ మెమరీ ఉంది. అడోబ్, బ్లెండర్, కామ్‌ఫ్యూయూఐ వంటి 1,000కి పైగా ఏఐ ఆధారిత అప్లికేషన్లకు మద్దతు ఇస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో 16 ఇంచుల 4కె అసుస్ లూమినా ప్రో ఓఎల్ఈడీ టచ్‌స్క్రీన్, 120 హెడ్జ్‌ రిఫ్రెష్ రేట్, పాంటోన్ వ్యాలిడేషన్ ఉన్నాయి. 99.9 వాట్ అవర్ బ్యాటరీతోపాటు అసుస్ హాప్టిక్‌ప్యాడ్‌ను అందించారు. దీని బరువు సుమారు 1.77 కిలోలు. మరోవైపు ప్రోఆర్ట్ పీ14లో 18 కోర్ల సీపీయూ, 5,120 కోర్ల జీపీయూతో కూడిన ఎన్విడియా ఆర్టీఎక్స్ స్పార్క్ ఎన్1ఎక్స్ ప్రాసెసర్, 14 ఇంచుల 3కె ఓఎల్ఈడీ టచ్‌స్క్రీన్ ఉన్నాయి. 120 హెడ్జ్‌ రిఫ్రెష్ రేట్, 90 వాట్ అవర్ బ్యాటరీతో వస్తున్న ఈ ల్యాప్‌టాప్ బరువు 1.48 కిలోలు. రెండు మోడళ్లలోనూ ప్రోఆర్ట్ క్రియేటర్ హబ్, ఏఐ అప్లికేషన్లకు సంబంధించిన ప్రత్యేక టూల్స్ అందుబాటులో ఉన్నాయి.

ధ‌ర‌లు ఎంతంటే..

కొత్త ల్యాప్‌టాప్‌లతోపాటు అసుస్ ప్రోఆర్ట్ మౌస్ ఎండీ301, ప్రోఆర్ట్ కీబోర్డ్ కేడీ300లను కూడా విడుదల చేసింది. మౌస్‌లో 8,000 డీపీఐ సెన్సార్, ఆరు ప్రోగ్రామబుల్ బటన్లు, స్మార్ట్‌షిఫ్ట్ వీల్, వైర్డ్, వైర్‌లెస్, బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్నాయి. దీని ధర రూ.8,499. కీబోర్డ్ ను 65 శాతం కాంపాక్ట్ లేఅవుట్‌తో, ఆర్‌జీబీ లైటింగ్, లో-ప్రొఫైల్ ఆప్టికల్ స్విచ్‌లు, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీతో రూపొందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 16 నెలల బ్యాటరీ బ్యాకప్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. దీని ధర రూ.14,999. కీబోర్డ్ నవంబర్ 14 నుంచి అందుబాటులోకి రానుంది. ప్రోఆర్ట్ పీ16 128 జీబీ, 1 టీబీ ఎస్ఎస్‌డీ వేరియంట్ ధర రూ.6,49,990 కాగా, 64 జీబీ వేరియంట్ ధర రూ.4,99,990గా ఉంది. ప్రోఆర్ట్ పీ14 24 జీబీ, 1 టీబీ ఎస్ఎస్‌డీ వేరియంట్ ధరను రూ.3,29,990గా నిర్ణయించారు. కొన్ని వేరియంట్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

ఈ ల్యాప్‌టాప్‌లు అసుస్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, క్రోమా, రిలయన్స్ డిజిటల్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియా, అసుస్ ఈ-షాప్‌లలో అందుబాటులో ఉంటాయి. మౌస్, కీబోర్డ్‌లను అసుస్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, ఆర్‌ఓజీ స్టోర్లు, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియా, అసుస్ ఈషాప్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. కొనుగోలుదారులకు నెలకు రూ.13,750 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కల్పిస్తున్నారు. అదనంగా రెండేళ్ల వారంటీ పొడ‌గింపు, రూ.99కే మూడేళ్ల డ్యామేజ్ ప్రొటెక్షన్ అందిస్తున్నారు. ఈ ఆఫర్ నవంబర్ 30 వ‌రకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ట్యాగ్స్:

Ai LaptopsAsusASUS ProArt P14ASUS ProArt P16NVIDIA RTX Spark N1XProArt Mouse MD301
Advertisement
Advertisement