త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | తుమ్మిడిహెట్టి బ్యారేజీపై మ‌హారాష్ట్ర‌తో సంప్ర‌దింపులు జ‌ర‌పండి..

CM Revanth Reddy | తుమ్మిడిహెట్టి బ్యారేజీపైన‌ మహారాష్ట్రతో నిరంతరం సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ముంపునకు సంబంధించిన పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని వారికి సూచించారు.

S

Telangana | Published On Nov 3, 2026, 5.06 pm IST

CM Revanth Reddy | తుమ్మిడిహెట్టి బ్యారేజీపై మ‌హారాష్ట్ర‌తో సంప్ర‌దింపులు జ‌ర‌పండి..
Advertisement

ఇరిగేష‌న్ అధికారుల‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

CM Revanth Reddy | త్రినేత్ర న్యూస్ : తుమ్మిడిహెట్టి బ్యారేజీపైన‌ మహారాష్ట్రతో నిరంతరం సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ముంపునకు సంబంధించిన పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని వారికి సూచించారు. ఇప్పటికే చేసుకున్న ఒప్పందాలు, ఇతర అంశాలకు సంబంధించిన పత్రాలను మహారాష్ట్రకు అందజేయాలని సీఎం స్పష్టం చేశారు.

జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మిడిహెట్టి పైన అధికారులతో సమీక్ష జరిపారు. మహారాష్ట్రతో ఇటీవల జరిపిన చర్చలు, ఇతర అంశాలపైన అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.

మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు తగిన పరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. ఇందుకోసం అవసరమైన నిధులను జాయింట్ అకౌంట్‌లో ఉంచుతామన్నారు. భూముల ముంపుపైన మహారాష్ట్ర ఎలాంటి సర్వే చేయించుకున్నా తమకు అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర అధికారులకు కావాల్సిన సమాచారం ఎప్పటికప్పుడు అందించాలని సూచించారు.

ఈ సమీక్షలో ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఇరిగేషన్ సెక్రటరీ శ్రీధర్, ఇరిగేషన్ ఈఎన్‌సీ (జనరల్) రమేష్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్:

CM Revanth ReddyGodavariIrrigationMaharashtraTelanganaTummidihatti Barrage
Advertisement
Advertisement