Sangishetti Jagadeeshwar Rao | అమిత్ షా సర్దుకునే టైమొచ్చింది: సంగిశెట్టి జగదీశ్వర్ రావు
Sangishetti Jagadeeshwar Rao | ప్రజాస్వామ్య పరిరక్షణ అంటే ఏంటో అమిత్ షా (Amith Sha) అర్థం చెప్పాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు సంగిశెట్టి జగదీశ్వర్ రావు (Sangishetti Jagadeeshwar Rao) డిమాండ్ చేశారు.
Sangishetti Jagadeeshwar Rao | త్రినేత్ర న్యూస్: ప్రజాస్వామ్య పరిరక్షణ అంటే ఏంటో అమిత్ షా (Amith Sha) అర్థం చెప్పాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు సంగిశెట్టి జగదీశ్వర్ రావు (Sangishetti Jagadeeshwar Rao) డిమాండ్ చేశారు. అవినీతి గురించి ఆయన మాట్లాడడం సిగ్గుచేటన్నారు. లోక్ తంత్ర్ బచావో అన్న అమిత్ షాకు మణీపూర్ మహిళలపై జరిగిన అఘాయిత్యాలు కనిపించలేదా అని మండిపడ్డారు. అమిత్ షా సర్దుకునే టైమొచ్చిందన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. విదేశీయుల ఓట్లు తొలగించండంలో తప్పు లేదని.. కానీ ఆ ముసుగులో దేశ ప్రజల ఓట్లు తొలగించడం సరైంది కాదన్నారు.
దోంగే దొంగ అన్నట్లుంది
దోంగే దొంగ అన్నట్లు ఉంది అమిత్ షా వ్యాఖ్యలు. నోట్ల రద్దుతో ఉగ్రవాదం అంతం అవుతుంది అన్నారు.. అంతం అయ్యారా? అదాని పోర్టులో హెరాయిన్ దొరికితే అమిత్ షా ఏం చేస్తున్నారు? అవినీతి గురించి అమిత్ షా మాట్లాడడం సిగ్గుచేటు. దేశంలో ఉన్న అవినీతి పరులు అంతా బీజేపీలోనే ఉన్నారు. జనగణనలో కుల గణన చేస్తామని అబద్దపు హామీ ఇచ్చి బీసీలను మోసం చేసారు. రాంలీలా మైదానంలో సమరశంఖం పూరించాం. వచ్చేది మా ప్రభుత్వమే. అమిత్ షా సర్దుకునే సమయం వచ్చింది.
బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడిచే బీజేపీ మనువాద సిద్ధాంతులకు మేం వ్యతిరేకం. రాహుల్ గాంధీ నేతృత్వంలో సేవ్ కాన్‌స్టిట్యూషన్ పోరాటం చేస్తున్నం. రాజ్యాంగ సంస్థలైన ఎన్నికల సంఘం, ఈడీ, సీబీఐ, ఇన్‌కమ్ ట్యాక్స్ వంటి సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం వీటన్నింటిని వాడుకొని లబ్ధి పొందడాన్ని మేం వ్యతిరేకిస్తున్నం అని జగదీశ్వర్‌రావు స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●MP Chamala | సర్ పేరుతో శాశ్వత అధికారానికి బీజేపీ కుట్ర
- ●CM Devendra Fadnavis | ఆమె ప్రముఖ నటే కావొచ్చు.. బీఎంసీకి ఆ హక్కు ఉంది.. దియా మీర్జా వీడియో వివాదంపై మౌనం వీడిన సీఎం ఫడ్నవీస్
- ●NYTTA | తెలంగాణ సంస్కృతిని అమెరికాలోని భావితరాలకు తెలియజేయడమే లక్ష్యం
- ●Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ కొనుగోళ్లు.. పెట్టుబడిదారులకు పండగే..
- ●KTR | మస్కట్ నుంచి స్వదేశానికి.. మాట నిలబెట్టుకున్న కేటీఆర్
- ●Cisco | 27 ఏళ్ల యువ ఇంజనీర్‌కు సిస్కో భారీ బాధ్యత.. రెండేళ్లలో 98 శాతం కోడ్ మార్పు..

MP Chamala | సర్ పేరుతో శాశ్వత అధికారానికి బీజేపీ కుట్ర

CM Devendra Fadnavis | ఆమె ప్రముఖ నటే కావొచ్చు.. బీఎంసీకి ఆ హక్కు ఉంది.. దియా మీర్జా వీడియో వివాదంపై మౌనం వీడిన సీఎం ఫడ్నవీస్

NYTTA | తెలంగాణ సంస్కృతిని అమెరికాలోని భావితరాలకు తెలియజేయడమే లక్ష్యం

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ కొనుగోళ్లు.. పెట్టుబడిదారులకు పండగే..



