Sonia Gandhi | ఈ విషయంలో మా వైఖరిని స్పష్టం చేశాం.. డీలిమిటేషన్‌పై సోనియా గాంధీ
Sonia Gandhi | మహిళా రిజర్వేషన్ల అమలు, నియోజకవర్గ పునర్విభజన బిల్లులపై (Delimitation Bill) కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) తాజాగా స్పందించారు. ఈ బిల్లుల విషయంలో ఇప్పటికే తమ పార్టీ వైఖరిని స్పష్టం చేసిందని చెప్పారు.
Sonia Gandhi | మహిళా రిజర్వేషన్ల అమలు, నియోజకవర్గ పునర్విభజన బిల్లులపై (Delimitation Bill) కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) తాజాగా స్పందించారు. ఈ బిల్లుల విషయంలో ఇప్పటికే తమ పార్టీ వైఖరిని స్పష్టం చేసిందని చెప్పారు. ఈ విషయంలో అదనంగా తాను చెప్పాల్సిందేమీ లేదని పేర్కొన్నారు. ఈ బిల్లులపై స్పందించాలని మీడియా ప్రతినిధులు కోరగా ఈ మేరకు స్పందించారు. "పార్టీ తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేసింది. నేను అదనంగా చెప్పాల్సింది ఏమీ లేదు" అని సోనియా స్పష్టం చేశారు.
కాగా, ఈ బిల్లులను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ బిల్లుల వెనుక ప్రభుత్వ ఉద్దేశం వేరే ఉందని ఆరోపిస్తున్నాయి. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియను సులభతరం చేయడం లక్ష్యంగా రూపొందించిన రాజ్యాంగ సవరణ బిల్లును (Constitution Amendment Bill) సభలో ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్షాలు డివిజన్ (Division) కోరాయి. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందని, ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని విపక్షాలు వాదించాయి.
దీనిపై ఓటింగ్ జరగాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో స్పీకర్ ఓం బిర్లా దీనిపై ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్‌లో బిల్లు ప్రవేశపెట్టడానికి అనుకూలంగా మెజారిటీ సభ్యులు ఓటు వేశారు. ఓటింగ్‌లో మొత్తం 436 మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ బిల్లుకు అనుకూలంగా 251 మంది ఓటు వేశారు. 185 మంది వ్యతిరేకించారు. ఓటింగ్ అనంతరం లోక్‌సభలో మూడు బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టింది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చకు స్పీకర్ ఓం బిర్లా ఆమోదం తెలిపారు. ఈ కీలక బిల్లులపై 15 గంటల పాటూ చర్చ ఉంటుందని స్పీకర్ తెలిపారు. అవసరమైతే మరింత సమయం కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఇక రేపు సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ ఉంటుందని చెప్పారు.
Also Read..
డీలిమిటేషన్‌పై డివిజన్ కోరిన ప్రతిపక్షాలు
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికను ప్రతిపక్షం బహిష్కరిస్తుంది : జైరాం రమేష్
సంబంధిత వార్తలు

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026

Mahesh Kumar Goud | జనగణనలో కులగణన.. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: పీసీసీ చీఫ్
మే 20, 2026

Justice Yashwant Verma Case | న్యాయమూర్తి యశ్వంత్ వర్మ కేసు.. లోక్‌సభ స్పీకర్‌కు నివేదిక..
మే 19, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



