Constitution Amendment Bill | డీలిమిటేషన్‌పై డివిజన్ కోరిన ప్రతిపక్షాలు
Constitution Amendment Bill | మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియను సులభతరం చేయడం లక్ష్యంగా రూపొందించిన రాజ్యాంగ సవరణ బిల్లును (Constitution Amendment Bill) సభలో ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్షాలు డివిజన్ (Division) కోరాయి. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందని, ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని విపక్షాలు వాదించాయి.
Constitution Amendment Bill | పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో కీలక బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా లోక్‌సభలో (Lok Sabha) అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఇక మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియను సులభతరం చేయడం లక్ష్యంగా రూపొందించిన రాజ్యాంగ సవరణ బిల్లును (Constitution Amendment Bill) సభలో ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్షాలు డివిజన్ (Division) కోరాయి.
డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందని, ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని విపక్షాలు వాదించాయి. దీనిపై ఓటింగ్ జరగాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో స్పీకర్ ఓం బిర్లా దీనిపై ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్‌లో బిల్లు ప్రవేశపెట్టడానికి అనుకూలంగా మెజారిటీ సభ్యులు ఓటు వేశారు. ఓటింగ్‌లో మొత్తం 436 మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ బిల్లుకు అనుకూలంగా 251 మంది ఓటు వేశారు. 185 మంది వ్యతిరేకించారు.
ఓటింగ్ అనంతరం లోక్‌సభలో మూడు బిల్లులను ప్రవేశపెట్టారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చకు స్పీకర్ ఓం బిర్లా ఆమోదం తెలిపారు. మూడు బిల్లులపై సుదీర్ఘ చర్చల అనంతరం రేపు సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ జరుగుతుందని స్పీకర్ తెలిపారు. బిల్లులపై సభ్యులు ఎన్ని గంటలు కోరినా చర్చ జరపవచ్చని చెప్పారు. సభలో సభ్యులందరికీ సమయం ఇస్తామని అన్నారు.
కీలక బిల్లులపై 12-18 గంటల పాటు చర్చ..
ఇక ఈ కీలక బిల్లులపై సభలో 12 గంటల పాటు చర్చ జరుగుతుందని, సభ్యులు అంగీకరిస్తే దీనిని 18 గంటల వరకు కూడా పొడిగించే అవకాశం ఉందని తెలిపారు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు తెలిపారు. సుదీర్ఘ చర్చలో భాగంగా పార్లమెంట్ అర్ధరాత్రి వరకూ కొనసాగుతుందని చెప్పారు. రేపు సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ ఉంటుందన్నారు.
Also Read..
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికను ప్రతిపక్షం బహిష్కరిస్తుంది : జైరాం రమేష్
సంబంధిత వార్తలు

Justice Yashwant Verma Case | న్యాయమూర్తి యశ్వంత్ వర్మ కేసు.. లోక్‌సభ స్పీకర్‌కు నివేదిక..
మే 19, 2026

Kanimozhi | కాంగ్రెస్‌తో పొత్తు ముగిసింది.. సభలో వారిపక్కన కూర్చోం.. ఓంబిర్లాకు డీఎంకే లేఖ
మే 8, 2026

Women Reservation | మహిళా రిజర్వేషన్ బిల్లు.. ప్రధాని మోదీకి లేఖ రాయనున్న ప్రతిపక్షాలు..!
ఏప్రిల్ 18, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



