త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Parliament Session | రాజ్యాంగాన్ని ప్ర‌భుత్వం హైజాక్ చేయాల‌ని చూస్తోంది.. లోక్‌స‌భ‌లో అధికార‌, విప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధం

Parliament Session | పార్ల‌మెంట్ ప్ర‌త్యేక స‌మావేశాల్లో (Parliament Session) మ‌హిళా రిజ‌ర్వేష‌న్‌, డీలిమిటేష‌న్ బిల్లుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశపెట్టింది. ఈ సంద‌ర్భంగా స‌భ‌లో అధికార‌, విప‌క్ష పార్టీల స‌భ్యుల మ‌ధ్య మాట‌ల యుద్ధం నెల‌కొంది.

D

National | Published On Apr 16, 2026, 12.03 pm IST

Parliament Session | రాజ్యాంగాన్ని ప్ర‌భుత్వం హైజాక్ చేయాల‌ని చూస్తోంది.. లోక్‌స‌భ‌లో అధికార‌, విప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధం
Advertisement

Parliament Session | పార్ల‌మెంట్ ప్ర‌త్యేక స‌మావేశాల్లో (Parliament Session) మ‌హిళా రిజ‌ర్వేష‌న్‌, డీలిమిటేష‌న్ బిల్లుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశపెట్టింది. ఈ సంద‌ర్భంగా స‌భ‌లో అధికార‌, విప‌క్ష పార్టీల స‌భ్యుల మ‌ధ్య మాట‌ల యుద్ధం నెల‌కొంది. ఈ బిల్లుల‌ను స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టిన తీరుపై కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ (KC Venugopal) తీవ్రంగా వ్య‌తిరేకించారు. 2024లో మ‌హిళా రిజ‌ర్వేష‌న్లను ఎందుకు అమ‌లు చేయ‌లేద‌ని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. 2023లో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుకు సంపూర్ణ మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్లు ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని ప్ర‌భుత్వం హైజాక్ చేస్తోంద‌ని ఆరోపించారు.

"మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుకు 2023లోనే మ‌ద్ద‌తిచ్చాం. 2024 నుంచే అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేశాం. కానీ ప్ర‌భుత్వం ఎందుకు అమ‌లు చేయ‌లేదు..? జ‌న‌గ‌ణ‌న త‌ర్వాతే డీలిమిటేష‌న్ చేస్తామ‌ని అప్పుడు చెప్పారు. ఇప్పుడు జ‌న‌గ‌ణ‌న కాక‌ముందే ఇప్పుడేమో రాజ్యాంగ విరుద్ధంగా ఈ బిల్లు తీసుకొచ్చారు. బిల్లుకు అసలు కారణం వేరే ఉంది. రాజ్యాంగాన్ని ప్ర‌భుత్వం హైజాక్ చేయాల‌ని చూస్తోంది. 131 రాజ్యాంగ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలి" అని కేసీ వేణుగోపాల్ తీవ్ర స్థాయిలో డిమాండ్‌ చేశారు.

కేసీ వేణుగోపాల్ వ్యాఖ్య‌ల‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టకుండా ఎలా చర్చ చేపడతారని ప్రశ్నించారు. బిల్లును సభలో పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టిన తర్వాత సభ్యులు అభిప్రాయాలు చెప్పొచ్చని అన్నారు. ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెడుతున్న బిల్లుల‌ను కేసీ వేణుగోపాల్ అవ‌మానిస్తున్నార‌ని విమ‌ర్శించారు.

ఎందుకింత తొంద‌రపాటు : అఖిలేష్ యాద‌వ్‌

మ‌రోవైపు మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును తీసుకురావ‌డంపై కేంద్రానికి ఎందుకు ఇంత తొంద‌రపాటు అని స‌మాజ్ వాదీ పార్టీ అధినేత‌, ఎంపీ అఖిలేష్ యాద‌వ్ (Akhilesh Yadav) ప్ర‌శ్నించారు. ఇంతవరకు జన‌గణన ఎందుకు నిర్వహించలేదని ఆయన నిలదీశారు. కులగణన చేపడితే రిజర్వేషన్లను పెంచాలనే డిమాండ్లు వస్తాయనే భయంతోనే కేంద్రం దానిని తప్పించుకుంటోందని ఆయన ఆరోపించారు. ఈ ఆందోళనలను పరిష్కరించకుండానే ప్రభుత్వం అత్యుత్సాహంతో ఈ బిల్లుల‌ను హ‌డావుడిగా ప్ర‌వేశ‌పెడుతోంద‌ని ఆరోపించారు.

ఇక తాము మ‌హిళా బిల్లుకు వ్య‌తిరేకం కాద‌ని ఈ సంద‌ర్భంగా అఖిలేష్ యాద‌వ్ స్ప‌ష్టం చేశారు. మహిళా రిజర్వేషన్లలో సబ్‌ కోటాను డిమాండ్ చేశారు. ఓబీసీ, ముస్లిం మహిళల కోటా లేకుండా ఉన్న ఈ బిల్లులకు మద్దతు ఇవ్వబోమని, వాటిని వ్యతిరేకిస్తున్నామని అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఈ మూడు బిల్లులు ద్వారా బీజేపీ రాజ్యాంగాన్ని వక్రీకరించడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. జనాభా లెక్కల నుంచి నియోజకవర్గాల పునర్విభజనను వేరు చేస్తుందని ఆరోపించారు. ఈ బిల్లులను ఉపసంహరించుకుని, దానికి బదులుగా 2023 చట్టాన్ని అమలు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

అఖిలేష్ యాద‌వ్ వ్యాఖ్య‌ల‌పై అమిత్ షా మండిప‌డ్డారు. ప్రజల్లో ఆందోళన కలిగించేలా విపక్షాల వ్యాఖ్యలున్నాయని మండిపడ్డారు. జనగణన ఎందుకు చేపట్టలేదని అఖిలేష్‌ ప్రశ్నిస్తున్నారని, జనగణన ప్రక్రియ చేపట్టాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయించిందని తెలిపారు. ప్రస్తుతం ఇళ్ల గణన జరుగుతోంద‌ని చెప్పారు. ఇళ్లకు ఎలాంటి జాతి ఉండద‌ని... సమాజ్‌వాదీ పార్టీ ఇళ్లకు కూడా జాతిని ఆపాదిస్తోంద‌ని మండిప‌డ్డారు. వ్యక్తుల జనగణన జరిగిన సమయంలోనే జాతి ప్రస్తావన ఉంటుంద‌ని ఈ సంద‌ర్భంగా షా స్ప‌ష్టం చేశారు. ఇక మ‌త‌ప‌ర‌మైన రిజ‌ర్వేష‌న్ల‌ను షా ఈ సంద‌ర్భంగా తిర‌స్క‌రించారు.

Advertisement
Advertisement