Jairam Ramesh | రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికను ప్రతిపక్షం బహిష్కరిస్తుంది : జైరాం రమేష్
Jairam Ramesh | ఏప్రిల్ 17న జరగనున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికను ప్రతిపక్షం బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ (Jairam Ramesh) ప్రకటించారు.
Jairam Ramesh | ఏప్రిల్ 17న జరగనున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికను ప్రతిపక్షం బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ (Jairam Ramesh) ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ ఎన్నికను బహిష్కరించాలని ప్రతిపక్షాలు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న మూడు కారణాలను ఆయన వివరించారు.
మోదీ ప్రభుత్వం గత ఏడేళ్లుగా లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్‌ను నియమించలేదనని జైరాం రమేష్ తెలిపారు. ఇలా గతంలో ఎన్నడూ జరగలేదని పేర్కొన్నారు. ఇక లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవికి సమానమైనది రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ పదవి అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. హరివంశ్ నారాయణ్ సింగ్ (Harivansh Narayan Singh) రెండో పదవీకాలం ఏప్రిల్ 9తో ముగియగా.. ఆ మరుసటి రోజే ఆయన్ను రాష్ట్రపతి రాజ్యసభ సభ్యునిగా నామినేట్ చేసినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన మూడోసారి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్డీయే అభ్యర్థిగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రపతి చేత రాజ్యసభకు నామినేట్ అయిన వ్యక్తిని డిప్యూటీ చైర్మన్ పదవిలో కూర్చోబెట్టడం గతంలో ఎన్నడూ జరగలేదన్నారు.
ఈ ప్రక్రియ అంతా ప్రతిపక్షాలతో ఎలాంటి అర్థవంతమైన సంప్రదింపులు జరపకుండానే జరుగుతోందని జైరాం రమేష్ తెలిపారు. ఈ మూడు కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. హరివంశ్ నారాయణ్ పట్ల తమకు ఎలాంటి అగౌరవం లేదని స్పష్టం చేశారు. ఏప్రిల్ 17న జరగనున్న డిప్యూటీ చైర్మన్ ఎన్నికను బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.
First, the Modi Govt has not appointed a Deputy Speaker in the Lok Sabha for 7 years. This has never happened before.
Second, the Deputy Speaker’s counterpart in the Rajya Sabha is the Deputy Chairman. Shri Harivansh’s second term ended on April 9th. A day later he was nominated…
— Jairam Ramesh (@Jairam_Ramesh) April 16, 2026
Also Read..
మహిళా బిల్లుకు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయడం పెద్ద కుట్ర: కల్వకుంట్ల కవిత
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Fuel Prices Hike | ఎన్నికలు ముగిశాయి.. మోదీ వసూళ్లు మొదలయ్యాయి.. ఇంధన ధరల పెంపుపై కాంగ్రెస్ విమర్శలు
మే 15, 2026

PM Modi | విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయి.. శిక్ష తప్పదు : మహిళా కోటా బిల్లుపై ప్రధాని మోదీ
ఏప్రిల్ 18, 2026

Parliament Session | పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఉభయసభలు నిరవధిక వాయిదా
ఏప్రిల్ 18, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



