Boat Capsizes | గంగానదిలో పడవ బోల్తా.. మహిళలు, చిన్నారులు సహా 14 మంది మృతి
Boat Capsizes | బీహార్లోని (Bihar) వైశాలి జిల్లా రాంపూర్ శ్యామ్చంద్ సమీపంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న పడవ గంగానదిలో (Ganga River) ఒక్కసారిగా బోల్తా పడింది (Boat Capsizes). దీంతో మహిళలు, చిన్నారులు సహా 14 మంది మృతిచెందారు.
Boat Capsizes | త్రినేత్ర న్యూస్: బీహార్లోని (Bihar) వైశాలి జిల్లా రాంపూర్ శ్యామ్చంద్ సమీపంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న పడవ గంగానదిలో (Ganga River) ఒక్కసారిగా బోల్తా పడింది (Boat Capsizes). దీంతో మహిళలు, చిన్నారులు సహా 14 మంది మృతిచెందారు. ప్రమాదంలో మరికొంత మంది గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న అధికారులు, సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. దీంతో గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
వారంతా మంగళవారం రాత్రి ఓ విందు కార్యక్రమం ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో రాఘోపూర్ (Raghopur) పోలీస్ స్టేషన్ పరిధిలో పడవ బోల్తాపడింది. ఇప్పటివరకు 14 మృతదేహాలను వెలికితీశారు. నదిలో కొట్టుకుపోతున్న ముగ్గురిని స్థానికులు కాపాడారు. తీవ్రంగా గాయపడిన మరో ఆరుగురిని దవాఖానకు తరలించారు.
కాగా, మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేదు. 11 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. అయితే 14 మృతదేహాలను వెలికి తీసినట్లు స్థానిక ఎమ్మెల్యే తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) వెల్లడించారు. వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలిపారు.
ఈ ఘటనపై సీఎం సామ్రాట్ చౌదరి (Samrat Choudhary) దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
పడవ బోల్తాపడి 13 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ప్రధాని మోదీ (PM Modi) విచారం వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేవారు. గాయపడినవారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. బాధిత కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు.
సంబంధిత వార్తలు

L Murugan resigns Union Minister | కూలీల కొడుకును కేంద్ర మంత్రిని చేశారు.. ఇక చాలు : నన్ను మంత్రి పదవి నుంచి తప్పించండి
అక్టోబర్ 13, 2026

PM Modi Bloomberg Forum | ఎవరి నష్టంతోనో మనం ఎదగడం లేదు.. ప్రపంచంతో పాటే భారత్ ప్రగతి
అక్టోబర్ 13, 2026

Ramachander Rao | క్యాన్సర్ రోగులకు ఏటా రూ. 2,500 కోట్ల ఆదా..!
అక్టోబర్ 11, 2026
తాజావార్తలు
- ●Cabinet Secretariat | క్యాబినెట్ సెక్రటేరియట్లో డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక
- ●Horoscope | అక్టోబర్ 14 బుధవారం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?
- ●CP VC Sajjanar | సైబర్ వలలో చిక్కొద్దు.. హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కీలక సూచనలు
- ●V Srinivas Goud | రైతులను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
- ●Strategic MoU | తెలంగాణ–లివర్పూల్ మధ్య కీలక ఒప్పందం
- ●Kalva Sujatha | ఈవీ రేసు కేసుపై ఎందుకంత గుబులు?.. కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల ఫైర్

Cabinet Secretariat | క్యాబినెట్ సెక్రటేరియట్లో డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక

Horoscope | అక్టోబర్ 14 బుధవారం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?

CP VC Sajjanar | సైబర్ వలలో చిక్కొద్దు.. హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కీలక సూచనలు

V Srinivas Goud | రైతులను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం



