త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Canada | కాలిపోతున్న కారులో.. భార‌తీయుడి మృతదేహం ల‌భ్యం

Canada | కెన‌డా (Canada)లోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని లాంగ్లీ ప్రాంతంలో కాలిపోతున్న కారులో భార‌తీయ యువ‌కుడి మృత‌దేహం ల‌భ్య‌మైంది. మృతుడు సర్రే ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల తుషార్ శ‌ర్మగా పోలీసులు గుర్తించారు.

D

International | Published On Nov 19, 2026, 11.27 am IST

Canada | కాలిపోతున్న కారులో.. భార‌తీయుడి మృతదేహం ల‌భ్యం
Advertisement

Canada | త్రినేత్ర న్యూస్ : కెన‌డా (Canada)లో భార‌త యువ‌కుడు హ‌త్య‌కు గుర‌య్యాడు. బ్రిటిష్ కొలంబియా (British Columbia) ప్రావిన్స్‌లోని లాంగ్లీ ప్రాంతంలో (Langley area) కాలిపోతున్న కారులో మృత‌దేహం ల‌భ్య‌మైంది. మృతుడు సర్రే ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల తుషార్ శ‌ర్మ (Tushar Sharma)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌పై హత్య కేసు న‌మోదు చేసిన హోమిసైడ్ విభాగం దర్యాప్తు ప్రారంభించింది.

అధికారులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. అక్టోబర్ 29 రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో లాంగ్లీలోని రాన్లిన్సన్ క్రెసెంట్ ప్రాంతంలో (Rawlinson Crescent area) ఓ కారు కాలిపోతుందన్న సమాచారం పోలీసులకు అందింది. వెంటనే లాంగ్లీ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పుతున్న క్రమంలో కారు లోప‌ల భాగంలో మానవ అవశేషాలను సిబ్బంది గుర్తించారు. ఈ ఘటనను అనుమానాస్పద హత్యగా పరిగణిస్తూ పోలీసులు విచారణ చేపట్టారు. కేసు తీవ్రత దృష్ట్యా కెనడాలోని ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (IHIT) ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను చేప‌ట్టింది. వీరికి లాంగ్లీ ఆర్‌సీఎంపీ (RCMP), ఫోరెన్సిక్ బృందాలు, బీసీ కొరోనర్స్ సర్వీస్ సహకరిస్తున్నాయి.

శర్మ మృతికి దారితీసిన పరిస్థితులను, ఘటనకు ముందు జరిగిన పరిణామాలను దర్యాప్తు అధికారులు విశ్లేషిస్తున్నారు. మరణానికి ముందు అతను ఎక్కడ ఉన్నాడు, ఎవరెవరితో సంప్రదింపులు జరిపాడు అనే కోణంలో ఆరా తీస్తున్నారు. దర్యాప్తు అధికారుల సమాచారం ప్రకారం.. శర్మకు గ‌తంలో ఎలాంటి నేర చరిత్ర లేదు. కెనడాలో అతనికి పెద్దగా పరిచయాలు లేవ‌ని, స్నేహితులు కూడా ఎక్కువ‌గా లేర‌ని ద‌ర్యాప్తులో తేలింది. ఈ హత్యకు గల కారణాలు తెలియరాలేదు. శర్మను ఉద్దేశపూర్వకంగానే లక్ష్యంగా చేసుకుని హత్య చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.

Also Read..

దీక్షా దివస్ స్ఫూర్తి కొనసాగుతుంది : నాగరాజు గుర్రాల

యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. ఇప్ప‌ట్లో లేన‌ట్లే..?

దుల్క‌ర్ స‌ల్మాన్ హీరో - నాని ప్రొడ్యూస‌ర్ - కొత్త కాంబో ఫిక్స్‌

Advertisement
Advertisement