IRCTC | నూతన హంగులతో వస్తున్న ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్.. టికెట్ బుకింగ్‌లో భారీ మార్పులు, కావల్సిన సీటును ఎంచుకోవచ్చు..
IRCTC | భారత రైల్వే మంత్రిత్వ శాఖ (Ministry of Railways) త్వరలో కొత్త వెర్షన్ ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రయాణికులకు మరింత వేగవంతమైన, సులభమైన టికెట్ బుకింగ్ అనుభవాన్ని అందించేలా ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌ను రూపొందిస్తున్నారు.
IRCTC | భారత రైల్వే మంత్రిత్వ శాఖ (Ministry of Railways) త్వరలో కొత్త వెర్షన్ ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రయాణికులకు మరింత వేగవంతమైన, సులభమైన టికెట్ బుకింగ్ అనుభవాన్ని అందించేలా ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌ను రూపొందిస్తున్నారు. ముఖ్యంగా తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను తగ్గించేలా వ్యవస్థను అప్‌గ్రేడ్ చేస్తున్నారు. కొత్త వెబ్‌సైట్‌లో నిమిషానికి టికెట్ బుకింగ్ సామర్థ్యాన్ని 32 వేల నుంచి 1.5 లక్షలకు పైగా పెంచనున్నారు. అలాగే పీఎన్ఆర్ (PNR) స్టేటస్, రైలు వివరాల విచారణ సామర్థ్యాన్ని 4 లక్షల నుంచి 40 లక్షలకు పైగా పెంచనున్నారు. దీంతో ఒకేసారి భారీ సంఖ్యలో వినియోగదారులు సేవలు పొందవచ్చు.
వెబ్ పేజీలు వేగంగా లోడింగ్..
వెబ్‌సైట్‌లో పేజీలు వేగంగా లోడ్ అయ్యేలా, నావిగేషన్ మరింత సులభంగా ఉండేలా మార్పులు చేస్తున్నారు. వినియోగదారులకు ఇబ్బంది కలిగించే అనవసర కాప్చా (CAPTCHA) లు, పాప్ అప్‌లు, ఫ్లాషింగ్ గ్రాఫిక్స్‌ను తొలగిస్తున్నారు. దీంతో టికెట్ బుకింగ్ ప్రక్రియ మరింత వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ప్రయాణికులు తమకు నచ్చిన సీటు లేదా బెర్త్‌ను ఎంపిక చేసుకునే అవకాశం కూడా కల్పించనున్నారు. అలాగే ఫేర్ క్యాలెండర్ (Fare Calendar) ద్వారా వేర్వేరు తేదీల్లో ప్రయాణ చార్జీలను పోల్చి చూసి అనుకూలమైన తేదీని ఎంచుకోవచ్చు. కొత్త వెబ్‌సైట్‌ను బహుభాషా (Multilingual) సదుపాయంతో రూపొందిస్తున్నారు. దివ్యాంగులు, విద్యార్థులు, రోగులకు సంబంధించిన ప్రత్యేక సేవలను కూడా ఒకే వేదికపై అందించనున్నారు.
రైల్ వన్ యాప్‌లోనూ..
భారీ ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని కొత్త రిజర్వేషన్ వ్యవస్థను ప్రస్తుతం ఉన్నదానికంటే 10 రెట్లు ఎక్కువ ట్రాఫిక్‌ను నిర్వహించేలా అభివృద్ధి చేస్తున్నారు. ఈ అన్ని కొత్త ఫీచర్లు రైల్వేలకు చెందిన రైల్ వన్ (RailOne) యాప్‌లో కూడా అందుబాటులోకి రానున్నాయి.
సంబంధిత వార్తలు

IRCTC | ఒక్క టూర్లో ఏడు జ్యోతిర్లింగాల దర్శనం.. హైదరాబాద్ నుంచి ప్రయాణం మొదలు.. టూర్ ప్యాకేజీ వివరాలు ఇవే..
ఆగస్టు 29, 2026

Vande Bharat Sleeper | వందే భారత్ స్లీపర్ అప్‌గ్రేడ్.. ఇక 24 బోగీలతో పరుగులు..!
ఆగస్టు 23, 2026

RRB Recruitment | 3993 పోస్టులతో ఆర్ఆర్బీ జేఈ నోటిఫికేషన్.. దరఖాస్తులు షురూ..
ఆగస్టు 14, 2026
తాజావార్తలు
- ●BC Reservations | ప్రతి కులానికి ‘యూనిక్ కోడ్’ కేటాయించాల్సిందే
- ●Nepal | మూడు రోజులుగా వరద బురదలోనే.. అయినా బతికింది..
- ●Gosula Srinivas Yadav | ఉద్యమకారులను బెదిరిస్తే తగిన బుద్ధి చెబుతాం : గోసుల శ్రీనివాస్ యాదవ్
- ●Uttam Kumar Reddy | ప్రజాస్వామ్యం, సంక్షేమం, అభివృద్ధికి వెయ్యి రోజులు
- ●CV Anand | డీజీపీ సీవీ ఆనంద్ సెంచరీ..
- ●NEET PG | నీట్-పీజీ ఆల్ ఇండియా కోటాను 50 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలి

BC Reservations | ప్రతి కులానికి ‘యూనిక్ కోడ్’ కేటాయించాల్సిందే

Nepal | మూడు రోజులుగా వరద బురదలోనే.. అయినా బతికింది..

Gosula Srinivas Yadav | ఉద్యమకారులను బెదిరిస్తే తగిన బుద్ధి చెబుతాం : గోసుల శ్రీనివాస్ యాదవ్

Uttam Kumar Reddy | ప్రజాస్వామ్యం, సంక్షేమం, అభివృద్ధికి వెయ్యి రోజులు



