Damodar Raja Narasimha | 96 లక్షల మంది చిన్నారుల రక్షణ కోసమే.. ఆల్బండజోల్ ట్యాబ్లెట్ల పంపిణీ: మంత్రి దామోదర
Damodar Raja Narasimha | ఆల్బండజోల్ ట్యాబ్లెట్ల (Albendazole Tablet) వల్ల నులిపురుగుల సమస్య తగ్గి, తిన్న ఆహారంలోని పోషకాలు శరీరానికి సమృద్ధిగా అందుతాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha) అన్నారు. రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు పిల్లల ఎదుగుదల, చదువుపై ఏకాగ్రత, నేర్చుకునే సామర్థ్యం కూడా మెరుగుపడుతుందని చెప్పారు.

పిల్లల్లో నులిపురుగుల (Intestinal Worms) సమస్య వల్ల రక్తహీనత, పోషకాహార లోపం, ఎదుగుదల మందగించడం, బరువు తగ్గడం వంటి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. ఇవి పిల్లల చదువుపై, ఏకాగ్రతపై కూడా ప్రభావం చూపుతాయి. నులిపురుగులు బయటకు కనిపించకపోయినా వారి ఆరోగ్యానికి హానికరమని చెప్పారు. అందుకే ప్రతి చిన్నారికి ఆల్బండజోల్ మాత్ర వేయించడం అత్యంత అవసరమని తెలిపారు. మాత్రలు పంపిణీ చేయడంతో ఈ కార్యక్రమం ముగిసిపోదని.. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత, చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, పరిశుభ్రమైన తాగునీరు వినియోగించడం, పండ్లు, కూరగాయలను శుభ్రంగా కడిగి తినడం వంటి మంచి అలవాట్లను ప్రతి చిన్నారిలో అలవర్చడం కూడా అంతే ముఖ్యమని చెప్పారు. ఈ అంశాలపై పిల్లలు, తల్లిదండ్రులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.
విద్యాశాఖ, మహిళా-శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. ఏ కారణంతోనైనా ఆల్బండజోల్ మాత్ర వేయించుకోలేకపోయిన పిల్లలకు జూలై 20న నిర్వహించే మాప్-అప్ కార్యక్రమంలో తప్పనిసరిగా మాత్ర అందజేస్తామని చెప్పారు. ప్రతి తల్లిదండ్రి ఈ కార్యక్రమానికి సహకరించి తమ పిల్లల ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు తోడ్పడాలని కోరారు.
సంబంధిత వార్తలు

National Deworming Day | రేపే జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం..
జులై 12, 2026

Damodar Raja Narasimha | దామోదర ఓ శాడిస్ట్ మంత్రి.. నిజాలు బయటపెడితే కేసులు పెట్టిస్తున్నడు
జూన్ 18, 2026

Ebola virus disease | ఎబోలా వైరస్ వ్యాప్తి.. రాష్ట్రంలో ముందస్తు జాగ్రత్తలపై ఆరోగ్య శాఖ మంత్రి సమీక్ష
జూన్ 8, 2026
తాజావార్తలు
- ●Supreme Court | గోవధ నిషేధ ఉత్తర్వులపై స్టే సాధించిన విజయ్ ప్రభుత్వం
- ●Bhagyashri Borse | సేమ్ సీన్ రిపీట్ - మలయాళ బ్యూటీ ప్లేస్‌లో భాగ్యశ్రీ బోర్సే - క్రేజీ ఛాన్స్ కొట్టేసిందిగా!
- ●Shankaramma | కొత్తపేట టిమ్స్‌కు శ్రీకాంతాచారి పేరు పెట్టాలి.. తల్లి శంకరమ్మ విజ్ఞప్తి
- ●Airtel | ఎయిర్టెల్ ఉచిత పర్ప్లెక్సిటీ ప్రో వాడుతున్నారా.. ఇలా చేయకపోతే రూ.17వేలు చెల్లించాల్సి వస్తుంది..
- ●Supreme Court | గోదావరి నీటి వినియోగం, బనకచర్ల అనుసంధానంపై సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్‌కు చుక్కెదురు..
- ●MLC Ravindar Rao | ఎవడ్రా నీ మాటలకు వెరిసేది.. ఎవన్నిరా నువ్ కోసేది?

Supreme Court | గోవధ నిషేధ ఉత్తర్వులపై స్టే సాధించిన విజయ్ ప్రభుత్వం

Bhagyashri Borse | సేమ్ సీన్ రిపీట్ - మలయాళ బ్యూటీ ప్లేస్‌లో భాగ్యశ్రీ బోర్సే - క్రేజీ ఛాన్స్ కొట్టేసిందిగా!

Shankaramma | కొత్తపేట టిమ్స్‌కు శ్రీకాంతాచారి పేరు పెట్టాలి.. తల్లి శంకరమ్మ విజ్ఞప్తి

Airtel | ఎయిర్టెల్ ఉచిత పర్ప్లెక్సిటీ ప్రో వాడుతున్నారా.. ఇలా చేయకపోతే రూ.17వేలు చెల్లించాల్సి వస్తుంది..



