PPF | బ్యాంకులో ఈ స్పెషల్ ఖాతాను తెరవండి.. 15 ఏళ్లలో రూ.32 లక్షలు పొందవచ్చు..
PPF | ప్రైవేట్ ఉద్యోగాలు చేసే చాలా మంది 10-15 సంవత్సరాలు పనిచేసినా పెద్దగా పొదుపు చేయలేకపోయామని చెబుతుంటారు. ఇల్లు కొనుగోలు చేయడానికి కూడా తగినంత డబ్బు సమకూరడం లేదని చాలామంది వాపోతుంటారు. దీనికి ప్రధాన కారణం ఆదాయం వచ్చినప్పటికీ క్రమబద్ధమైన పొదుపు లేకపోవడమే.
PPF | ప్రైవేట్ ఉద్యోగాలు చేసే చాలా మంది 10-15 సంవత్సరాలు పనిచేసినా పెద్దగా పొదుపు చేయలేకపోయామని చెబుతుంటారు. ఇల్లు కొనుగోలు చేయడానికి కూడా తగినంత డబ్బు సమకూరడం లేదని చాలామంది వాపోతుంటారు. దీనికి ప్రధాన కారణం ఆదాయం వచ్చినప్పటికీ క్రమబద్ధమైన పొదుపు లేకపోవడమే. ప్రస్తుతం యువత ఎక్కువగా షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ల వైపు ఆకర్షితులవుతున్నారు. అయితే ప్రతి మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని చెప్పలేం. సరైన అవగాహనతో పెట్టుబడి పెట్టినప్పుడే మంచి రాబడులు సాధ్యమవుతాయి. కానీ చాలా మందికి ఏ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలో స్పష్టమైన సమాచారం ఉండదు. కొత్తగా ఉద్యోగంలో చేరిన యువతకు పెట్టుబడులపై సరైన అవగాహన లేకపోవడం సాధారణం. అలాంటి సమయంలో సురక్షితమైన పెట్టుబడి మార్గాలను ఎంచుకుంటే భవిష్యత్తులో మంచి ఆర్థిక భద్రతను పొందవచ్చు. మ్యూచువల్ ఫండ్లు మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి. అందులో స్థిరమైన వడ్డీకి హామీ ఉండదు. అయితే ప్రైవేట్ ఉద్యోగులు తమ తొలి జీతంతోనే ఒక సురక్షిత పెట్టుబడిని ప్రారంభిస్తే, దీర్ఘకాలంలో భారీ కార్పస్‌ను నిర్మించుకోవచ్చు.
15 ఏళ్లకు రూ.32 లక్షలు..
ఉద్యోగంలో చేరిన వెంటనే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఖాతాను ప్రారంభించడం మంచి నిర్ణయంగా చెప్పవచ్చు. ఇప్పటికీ చాలా మందికి పీపీఎఫ్ గురించి పూర్తి అవగాహన లేదు. ఉద్యోగంలో చేరినప్పుడు సాధారణంగా శాలరీ అకౌంట్‌తోపాటు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతా కూడా తెరుస్తారు. అయితే పీఎఫ్ ఖాతాలోని డబ్బు ఉద్యోగానికి అనుసంధానంగా ఉంటుంది. పీపీఎఫ్ మాత్రం పూర్తిగా వేరు. ఇందులో క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే 15 సంవత్సరాల్లో లక్షల రూపాయల కార్పస్‌ను సృష్టించుకోవచ్చు. దీని ద్వారా భవిష్యత్తులో ఇల్లు కొనుగోలు చేయడం లేదా ఇతర పెద్ద ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడం సులభమవుతుంది. ఉదాహరణకు, 25 ఏళ్ల వయసులో తొలి ఉద్యోగంలో నెలకు రూ.30వేల జీతంతో చేరిన వ్యక్తి తన బాధ్యతలు తక్కువగా ఉన్న సమయంలోనే ప్రతి నెలా రూ.10వేలను పీపీఎఫ్ ఖాతాలో జమ చేస్తే, ఏడాదికి రూ.1.20 లక్షలు పెట్టుబడి అవుతుంది. 15 సంవత్సరాల్లో మొత్తం రూ.18 లక్షలు జమ చేసినట్లవుతుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న వడ్డీ రేటు ప్రకారం దీనిపై సుమారు రూ.14,54,567 వడ్డీ లభిస్తుంది. దీంతో మెచ్యూరిటీ సమయానికి మొత్తం సుమారు రూ.32,54,567 అందుతుంది.
రూ.500తో ప్రారంభించవచ్చు..
ప్రస్తుతం పీపీఎఫ్ ఖాతాలపై ప్రభుత్వం సంవత్సరానికి 7.1 శాతం వడ్డీ అందిస్తోంది. ఈ వడ్డీని ప్రతి సంవత్సరం చక్రవడ్డీ (కాంపౌండింగ్) పద్ధతిలో లెక్కిస్తారు. భవిష్యత్తులో ప్రభుత్వం వడ్డీ రేట్లను పెంచితే, పెట్టుబడిదారులకు లభించే మొత్తం వడ్డీ కూడా మరింత పెరిగే అవకాశం ఉంటుంది. పీపీఎఫ్ ఖాతాను దేశంలోని ఏ బ్యాంకులోనైనా లేదా పోస్టాఫీస్‌లోనైనా ప్రారంభించవచ్చు. ఇది పూర్తిగా ప్రభుత్వ మద్దతుతో ఉండే సురక్షిత పెట్టుబడి పథకం. దీనికి షేర్ మార్కెట్‌తో ఎలాంటి సంబంధం ఉండదు. కాబట్టి మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావం ఉండదు. ఖాతా మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు. ఈ ఖాతాను కనీసం రూ.500తో ప్రారంభించవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు జమ చేసే అవకాశం ఉంటుంది. ప్రతి నెల తప్పనిసరిగా డబ్బు జమ చేయాల్సిన అవసరం లేదు. సంవత్సరంలో ఒకేసారి లేదా విడతల వారీగా కూడా డబ్బు జమ చేయవచ్చు. అలాగే ఖాతా ప్రారంభమైన ఏడో సంవత్సరం నుంచి అవసరమైన నిబంధనల ప్రకారం కొంత మొత్తాన్ని రుణంగా లేదా పాక్షిక ఉపసంహరణ రూపంలో పొందే అవకాశం కూడా ఉంటుంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Beneficiaries Removed | ఆ పథకం నుంచి 92 లక్షల మంది లబ్దిదారుల తొలగింపు..
- ●Road Accident | ఎదురెదురుగా ఢీకొన్న బస్సులు.. ఆరుగురు మృతి
- ●IRCTC | నూతన హంగులతో వస్తున్న ఐఆర్సీటీసీ వెబ్సైట్.. టికెట్ బుకింగ్‌లో భారీ మార్పులు, కావల్సిన సీటును ఎంచుకోవచ్చు..
- ●Indian Railways | వీటిని కూడా వదలట్లేదు.. రైల్వేల్లో 1.27 కోట్ల టవళ్లు, దుప్పట్లు చోరీ.. వాటి విలువ తెలుస్తే షాకే..
- ●NPCIL | న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్లో టెక్నీషియన్ పోస్టులు.. 15 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు షురూ..
- ●Stock Markets | అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు..

Beneficiaries Removed | ఆ పథకం నుంచి 92 లక్షల మంది లబ్దిదారుల తొలగింపు..

Road Accident | ఎదురెదురుగా ఢీకొన్న బస్సులు.. ఆరుగురు మృతి

IRCTC | నూతన హంగులతో వస్తున్న ఐఆర్సీటీసీ వెబ్సైట్.. టికెట్ బుకింగ్‌లో భారీ మార్పులు, కావల్సిన సీటును ఎంచుకోవచ్చు..

Indian Railways | వీటిని కూడా వదలట్లేదు.. రైల్వేల్లో 1.27 కోట్ల టవళ్లు, దుప్పట్లు చోరీ.. వాటి విలువ తెలుస్తే షాకే..






