Swiggy | స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో 340 మంది ఉద్యోగుల తొలగింపు..? కారణాలేమిటి..?
Swiggy | స్విగ్గీకి చెందిన క్విక్ కామర్స్ విభాగం ఇన్‌స్టామార్ట్ సుమారు 340 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. సంస్థాగత పునర్వ్యవస్థీకరణ, కృత్రిమ మేధ వినియోగం, నిర్వహణ ఖర్చుల తగ్గింపు లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే
Swiggy | స్విగ్గీకి చెందిన క్విక్ కామర్స్ విభాగం ఇన్‌స్టామార్ట్ సుమారు 340 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. సంస్థాగత పునర్వ్యవస్థీకరణ, కృత్రిమ మేధ వినియోగం, నిర్వహణ ఖర్చుల తగ్గింపు లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే వినియోగదారులు, ఆర్డర్ల విలువ, డార్క్ స్టోర్ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, క్యూ2 ఎఫ్‌వై27లో ఇన్‌స్టామార్ట్ నిర్వహణ నష్టాలు రూ.895 కోట్లకు చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఉద్యోగుల తొలగింపుతోపాటు వ్యాపార విధానంలో మార్పులు, సొంత బ్రాండ్ల విస్తరణ ద్వారా లాభదాయకత సాధించాలని స్విగ్గీ ప్రయత్నిస్తోంది.
ఉద్యోగులను ఎందుకు తొలగిస్తోంది..?
ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీకి చెందిన ఇన్‌స్టామార్ట్ తన కార్పొరేట్, సపోర్ట్ విభాగాల్లో సుమారు 340 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. వివిధ విభాగాల్లో ఒకే రకమైన పనులను తగ్గించడం, ఉద్యోగుల ఉత్పాదకత పెంచడం, నిర్ణయాలు వేగంగా తీసుకునేలా సంస్థాగత మార్పులు చేయడం ఈ చర్యల ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. అయితే డార్క్ స్టోర్లు, సరఫరా వ్యవస్థ, డెలివరీ కార్యకలాపాల విస్తరణ మాత్రం కొనసాగుతోంది. క్యూ1 ఎఫ్‌వై27లో రూ.7,907 కోట్లుగా ఉన్న స్థూల ఆర్డర్ విలువ క్యూ2లో రూ.9,230 కోట్లకు చేరి 16.7 శాతం పెరిగింది.
నెలవారీ లావాదేవీలు నిర్వహించే వినియోగదారుల సంఖ్య 1.35 కోట్ల నుంచి 1.48 కోట్లకు పెరిగింది. డార్క్ స్టోర్ల సంఖ్య 1,171 నుంచి 1,240కి చేరింది. అయినప్పటికీ సర్దుబాటు చేసిన ఈబీఐటీడీఏ నష్టాలు రూ.778 కోట్ల నుంచి రూ.895 కోట్లకు పెరిగాయి. అంటే ఒక్క త్రైమాసికంలోనే నష్టాలు రూ.117 కోట్లు అధికమయ్యాయి. బ్లింకిట్, జెప్టో వంటి సంస్థలతో పోటీపడేందుకు విస్తరణ కొనసాగిస్తూనే ఖర్చులను నియంత్రించాల్సిన పరిస్థితి ఇన్‌స్టామార్ట్‌కు ఎదురవుతోంది.
ఎంత ఆదా అవుతుంది..?
ఒక్కో ఉద్యోగికి ఏడాదికి సగటున రూ.15 లక్షల ఖర్చు ఉంటుందని అంచనా వేస్తే, 340 మంది ఉద్యోగుల తొలగింపు ద్వారా రూ.51 కోట్లు, రూ.20 లక్షలైతే రూ.68 కోట్లు, రూ.25 లక్షలైతే రూ.85 కోట్లు, రూ.30 లక్షలైతే రూ.102 కోట్లు ఆదా అవుతాయి. ఈ లెక్కల ప్రకారం ఒక్కో ఉద్యోగికి ఏడాదికి రూ.25 లక్షలు ఖర్చవుతుందని భావిస్తే త్రైమాసికానికి సుమారు రూ.21.25 కోట్లు ఆదా అవుతాయి. అయితే ఇది ఇన్‌స్టామార్ట్ త్రైమాసిక నష్టం రూ.895 కోట్లలో కేవలం 2.4 శాతం మాత్రమే. ఉద్యోగుల ఖర్చులను తగ్గించడం ఒక్కటే సంస్థను లాభాల బాట పట్టించలేదని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
తాజావార్తలు
- ●Musi Riverfront Development Project | మూసీ ప్రాజెక్టు: హరిత ప్రాంతాలు సగానికి తగ్గింపు.. రహదారులు 261 శాతం పెంపు!
- ●Idupu Kayitham | ఇడుపుకాయితం సీరియస్ సినిమా కాదు - ఆ గ్యారెంటీ మాది - నిర్మాత కామెంట్స్
- ●Devi Prasad | డీలిమిటేషన్ బిల్లుకు వాళ్లెందుకు మద్దతిస్తున్నారో అద్దంకి చెప్పాలి
- ●Invest Telangana Global Summit | సమ్మిట్ సన్నాహాల్లో ప్రజాప్రతినిధులకూ ప్రాధాన్యం
- ●Mallikarjun Kharge | ఆ బిల్లు ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం : ఖర్గే
- ●Bitcoin | బిట్‌కాయిన్‌కు భారీ షాక్.. 60 వేల డాలర్ల దిగువకు ధర..

Musi Riverfront Development Project | మూసీ ప్రాజెక్టు: హరిత ప్రాంతాలు సగానికి తగ్గింపు.. రహదారులు 261 శాతం పెంపు!

Idupu Kayitham | ఇడుపుకాయితం సీరియస్ సినిమా కాదు - ఆ గ్యారెంటీ మాది - నిర్మాత కామెంట్స్

Devi Prasad | డీలిమిటేషన్ బిల్లుకు వాళ్లెందుకు మద్దతిస్తున్నారో అద్దంకి చెప్పాలి

Invest Telangana Global Summit | సమ్మిట్ సన్నాహాల్లో ప్రజాప్రతినిధులకూ ప్రాధాన్యం






