Shashi Tharoor | లాఠీలు కాదు.. సమాధానాలు కావాలి.. ఢిల్లీలో ఆంక్షలపై థరూర్ ఆగ్రహం
Shashi Tharoor | ఢిల్లీ (Delhi)లో విధించిన కఠిన ఆంక్షలను కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) తీవ్రంగా తప్పుబట్టారు. ఈ అప్రకటిత ఎమర్జెన్సీని మన జెన్‌జీ కోరుకోవట్లేదని వ్యాఖ్యానించారు. ప్రజలు అడిగిన ప్రశ్నలకు లాఠీలతో కాకుండా.. సమాధాలతో స్పందించాలని డిమాండ్ చేశారు.
- ఈ అప్రకటిత ఎమర్జెన్సీని మన జెన్‌జీ కోరుకోవట్లేదు
- నగరం మొత్తం యుద్ధ వాతావరణ్నా తలపిస్తోందంటూ వ్యాఖ్య
- మహిళలకు రక్షణ అవసరమైనప్పుడు..
- ఈ ప్రత్యేక బలగాలు, తక్షణ స్పందన వ్యవస్థలు ఎందుకు కనిపించవు..?
Shashi Tharoor | త్రినేత్ర న్యూస్ : కాక్రోచ్ జనతాపార్టీ నిరసనల (CJP Protest) నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో విధించిన కఠిన ఆంక్షలను కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) తీవ్రంగా తప్పుబట్టారు. ఢిల్లీ మొత్తం యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోందన్నారు. నగరంలో ఎక్కడ చూసినా బారికేడ్లు, పోలీసులే దర్శనమిస్తున్నారన్నారు. ప్రతీ వీధుల్లోనూ యువకులను అరెస్ట్ చేస్తున్నారంటూ వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కీలక పోస్టు పెట్టారు. ఈ అప్రకటిత ఎమర్జెన్సీని మన జెన్‌జీ కోరుకోవట్లేదని వ్యాఖ్యానించారు.
"నేను ఇవాళ తెల్లవారుజామున 2 గంటల తర్వాత ఢిల్లీ చేరుకున్నాను. నగరంలో ప్రతి వంద మీటర్లకు చెక్‌పోస్టులు, రోడ్లపై భారీగా బారికేడ్లు, స్పైక్ స్ట్రిప్సే దర్శనమిస్తున్నాయి. నగరం అంతటా యుద్ధవాతావరణాన్ని తలపించేలా 22,000 మంది పోలీసులను మోహరించారు. 250 రైళ్లు రద్దు.. 45 మెట్రో స్టేషన్లు మూసివేత.. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో యువకులను అదుపులోకి తసుకుంటున్న వార్తలు.. ఇవన్నీ మన ఎన్నికల సమగ్రత గురించి శాంతియుతంగా ప్రశ్నలు లేవనెత్తుతున్న ప్రజలను అడ్డుకోవడానికేనా..?" అంటూ ప్రశ్నించారు. అదేవిధంగా జాతీయ రాజధానిలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం అత్యంత వెనుకడుగు చర్య (retrograde step) అని దీన్ని ఒక అణచివేత చర్యగా ఆయన అభివర్ణించారు.
భావప్రకటనా స్వేచ్ఛను పూర్తిగా అణచివేస్తున్నారని థరూర్ మండిపడ్డారు. ఢిల్లీ నడిబొడ్డున ఉన్న జంతర్ మంతర్ ప్రాంతాన్ని ప్రజలు తమ నిరసనను తెలిపేందుకు ప్రత్యేకంగా కేటాయించారని గుర్తు చేశారు. కానీ నేడు అక్కడికి వెళ్లే దారులన్నింటినీ నిషేధిత ప్రాంతాలుగా ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో మహిళలపై నేరాలు జరిగినప్పుడు లేదా వారికి అత్యవసరంగా రక్షణ కావాల్సి వచ్చినప్పుడు ఈ ప్రత్యేక బలగాలు, తక్షణ స్పందన వ్యవస్థలు ఎందుకు కనిపించవని థరూర్ ప్రశ్నించారు.
ఢిల్లీని మళ్లీ లాక్‌డౌన్ చేస్తారా..?
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఒకవేళ సోమవారం ఆందోళనకారులు మళ్లీ వెనక్కి తిరిగివస్తే అధికారులు ఢిల్లీని మళ్లీ లాక్‌డౌన్ చేస్తారా..? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. మన జెన్-జెడ్ (GenZ) యువత ఇలాంటి అప్రకటిత "ఎమర్-జెన్‌జీ" (Emer-GenZ)ని కోరుకోవట్లేదన్నారు. మెరుగైన వాతావరణాన్ని కోరుకుంటోందని స్పష్టం చేశారు.
ఢిల్లీని కోటలా మార్చేసి..
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై థరూర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించే ఏ ప్రభుత్వమైనా తన పారదర్శకతపై ప్రశ్నలను స్వాగతించాలని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ప్రశ్నలను ఎదుర్కోలేక తప్పించుకుంటోందని ఆరోపించారు. రాజధాని నగరాన్ని ఒక కోటలా మార్చి ప్రభుత్వం తనపై ఉన్న అనుమానాలను తానే మరింత పెంచుకుంటోందని విమర్శించారు. ప్రజల ప్రశ్నలకు, నిరసనలకు ప్రభుత్వం లాఠీలతో కాకుండా సమాధానాలతో స్పందించాలన్నారు. అణచివేతకు పాల్పడకుండా భావప్రకటనా స్వేచ్ఛను గౌరవించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘంపై విశ్వాసాన్ని పెంచడానికి బారికేడ్లు పనిచేయవని థరూర్ వ్యాఖ్యానించారు. ప్రజలు, ప్రతిపక్షాల ప్రశ్నలకు ఎంత త్వరగా, స్పష్టంగా సమాధానమిస్తే అంతగా వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుందన్నారు.
Also Read..
సీఈసీకి వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టిన న్యాయవాదులు అరెస్ట్.. ఖండించిన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్
జ్ఞానేశ్ కుమార్ వెళ్లిపోతారు.. మోదీ ప్రభుత్వం కూడా పోతుంది : రాహుల్ గాంధీ
తాజావార్తలు
- ●Elon Musk | అంబానీపై మస్క్ మరోసారి సంచలన ఆరోపణలు.. బీజేపీకి విరాళాలపై పోస్టులు
- ●Chirumilla Rakesh | నీకున్న రోగానికి అల్లోపతి వడ్తలేదట.. ఇగో కాయ కచోరి వటు
- ●BC Reservations | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. బీసీ రిజర్వేషన్లు ఖరారు
- ●Hero Aadi | యూట్యూబర్‌కు ఉన్న మార్కెట్ నీకు లేదు - ట్రోల్స్‌పై టాలీవుడ్ హీరో రియాక్షన్
- ●RBI | చమురు కంపెనీలకు ఆర్బీఐ బిగ్‌న్యూస్.. స్పెషల్‌గా డాలర్ విండో
- ●Janasena Ministers | ఏపీ కేబినెట్ భేటీ.. ముగ్గురు జనసేన మంత్రులు డుమ్మా..!

Elon Musk | అంబానీపై మస్క్ మరోసారి సంచలన ఆరోపణలు.. బీజేపీకి విరాళాలపై పోస్టులు

Chirumilla Rakesh | నీకున్న రోగానికి అల్లోపతి వడ్తలేదట.. ఇగో కాయ కచోరి వటు

BC Reservations | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. బీసీ రిజర్వేషన్లు ఖరారు

Hero Aadi | యూట్యూబర్‌కు ఉన్న మార్కెట్ నీకు లేదు - ట్రోల్స్‌పై టాలీవుడ్ హీరో రియాక్షన్






