KTR | పదేండ్ల జిల్లాలు.. ప్రజలందరికీ శుభాకాంక్షలు: కేటీఆర్
KTR | కొత్త జిల్లాలు పురుడోసుకొని శనివారంతో పదేండ్లు అవుతోందని.. గడపగడపకు సంక్షేమం చేరిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
KTR | త్రినేత్ర న్యూస్: కొత్త జిల్లాలు పురుడోసుకొని శనివారంతో పదేండ్లు అవుతోందని.. గడపగడపకు సంక్షేమం చేరిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఆయన ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి స్వపరిపాలనను అందించిన కేసీఆర్, జిల్లాలను పునర్వ్యవస్థీకరించి సుపరిపాలను కూడా మన ముంగిట ఉంచారని కొనియాడారు.
10 జిల్లాలను 33 జిల్లాలు చేయడం ద్వారా అధికార వికేంద్రీకరణ జరిపి, ప్రజల ముంగిటికే పాలన తీసుకొచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. కొన్ని దశాబ్దాలుగా ఆయా ప్రాంతాల ప్రజలకు ఉన్న ఆకాంక్షలను నెరవేరుస్తూ.. కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడమే కాదు, ఆ ప్రాంత విశిష్ఠత ఉట్టిపడేలా జిల్లాలకు నామకరణం చేశాడు.
జిల్లా కేంద్రాలకు వెళ్లేందుకు గతంలో 100-150 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి మారి, నేడు జిల్లా కేంద్రాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణలోని నలుమూలల ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. వైద్య, విద్యా సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం వచ్చింది. గడపగడపకు సంక్షేమం అందింది. నూతన జిల్లాలు ఏర్పడి పదేళ్లు నిండిన సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు.. జై తెలంగాణ! అని కేటీఆర్ నినదించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●India | భారత్ నుంచి సింగపూర్‌కు 3,000 కి.మీ. విద్యుత్ కారిడార్..
- ●Little Child Dead | అయ్యే పాపం.. బంగారం షాప్‌లో సైనైడ్ తిని చిన్నారి మృతి
- ●Moringa Farming | మహారాష్ట్ర రైతు మాస్టర్ ప్లాన్.. మునగ ఆకులతో నెలకు రూ.12 లక్షల ఆదాయం..
- ●Ponnam Prabhakar | బీజేపీకి మూడింది.. దాని మెడలు వంచుడే ఇగ
- ●Supreme Court lawyers | సీఈసీకి వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టిన న్యాయవాదులు అరెస్ట్.. ఖండించిన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్
- ●Tummala Nageswara Rao | ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

India | భారత్ నుంచి సింగపూర్‌కు 3,000 కి.మీ. విద్యుత్ కారిడార్..

Little Child Dead | అయ్యే పాపం.. బంగారం షాప్‌లో సైనైడ్ తిని చిన్నారి మృతి

Moringa Farming | మహారాష్ట్ర రైతు మాస్టర్ ప్లాన్.. మునగ ఆకులతో నెలకు రూ.12 లక్షల ఆదాయం..

Ponnam Prabhakar | బీజేపీకి మూడింది.. దాని మెడలు వంచుడే ఇగ




