Ponguleti Srinivas Reddy | పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ సంకల్పం
Ponguleti Srinivas Reddy | రాష్ట్రంలో ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయాలనే గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు.
- పేదల ఇళ్లలో వెలుగులు నింపేందుకు ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’
- లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి పండుగ సంబరాల్లో పాల్గొననున్న మంత్రి పొంగులేటి
Ponguleti Srinivas Reddy | త్రినేత్ర న్యూస్ : రాష్ట్రంలో ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయాలనే గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. ఇల్లు అనేది కేవలం నాలుగు గోడల నిర్మాణం మాత్రమే కాదని.. ప్రతి పేద కుటుంబానికి ఆత్మగౌరవం, భద్రత, భరోసా కల్పించే చిరునామా అని మంత్రి పేర్కొన్నారు. పేదల కష్టాలను అర్థం చేసుకుని, వారి సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రూపొందించిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన వెంటనే కార్యాచరణలో పెట్టి, అర్హులైన పేదలకు ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమంపై శనివారం సచివాలయంలో హౌసింగ్ అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, రెండో విడతలో మరో 2.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసిందని వివరించారు. విడతలవారీగా ఆర్థిక సహాయం అందిస్తూ పేద కుటుంబాలపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
గత ప్రభుత్వ హయాంలో పేదల సొంతింటి కల కలగానే మిగిలిపోయిందని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ లక్షలాది కుటుంబాల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణాల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు కేవలం నివాసాన్ని కల్పించడమే కాకుండా వారి కుటుంబాల్లో ఆనందం, ఆత్మవిశ్వాసం, భవిష్యత్తుపై భరోసా నింపడమే ప్రభుత్వ అసలైన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. అందులో భాగంగానే ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమానికి రూపకల్పన చేశామని తెలిపారు. పేదల ఇళ్లలో వెలుగులు నింపుతూ, వారి కుటుంబాలతో కలిసి పండుగ సంతోషాలను పంచుకోవాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం కామంచికల్, నేలకొండపల్లి మండలం కోరట్లగూడెం, కూసుమంచి మండలం పాలేరులో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీపావళి వేడుకల్లో పాల్గొననున్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారితో మమేకమై పండుగ సంబరాలను పంచుకోనున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Mother Dies by Suicide with Children | అయ్యో! పిల్లలను నడుముకు కట్టుకుని పాకాలలో దూకిన తల్లి.. అసలేమైందంటే..
నవంబర్ 7, 2026

MLC Dasoju Sravan | రేవంత్! గురుకుల బెడ్‌షీట్స్‌ను కోటు కుట్టించుకో.. తెలుస్తది
నవంబర్ 7, 2026

CID Rides | ధరణి పోర్టల్ అక్రమాల్లో కీలక సమాచారం లభ్యం.. కేసు నమోదు చేసిన సీఐడీ
నవంబర్ 7, 2026
తాజావార్తలు
- ●Virat Kohli | కోహ్లీ ఖాతాలో మరో రికార్డు.. 31 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన గుర్నూర్
- ●Mother Dies by Suicide with Children | అయ్యో! పిల్లలను నడుముకు కట్టుకుని పాకాలలో దూకిన తల్లి.. అసలేమైందంటే..
- ●Ramayana | "రామాయణ"లో సాయిపల్లవి పాత్రకు డబ్బింగ్ చెప్పిన సీరియల్ నటి ఎవరంటే?
- ●IND VS NZ | వన్డే సిరీస్ భారత్ వశం.. రెండో వన్డేలోనూ కివీస్‌పై గెలుపు..
- ●Muhurat Trading | దీపావళి నాడు ప్రత్యేక స్టాక్ మార్కెట్ సెషన్.. ముహూరత్ ట్రేడింగ్‌లో స్టాక్స్‌ను కొనాలా..?
- ●Rajnath Singh | ప్రజలతో సత్సంబంధాలే దేశ రక్షణకు కొండంత బలం.. వాయుసేన సిబ్బందితో రాజ్‌నాథ్ సింగ్

Virat Kohli | కోహ్లీ ఖాతాలో మరో రికార్డు.. 31 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన గుర్నూర్

Mother Dies by Suicide with Children | అయ్యో! పిల్లలను నడుముకు కట్టుకుని పాకాలలో దూకిన తల్లి.. అసలేమైందంటే..

Ramayana | "రామాయణ"లో సాయిపల్లవి పాత్రకు డబ్బింగ్ చెప్పిన సీరియల్ నటి ఎవరంటే?

IND VS NZ | వన్డే సిరీస్ భారత్ వశం.. రెండో వన్డేలోనూ కివీస్‌పై గెలుపు..



