Sharad Pawar | ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన శరద్ పవార్
Sharad Pawar | ఎన్సీపీ అధినేత (NCP-SP chief) శరద్ పవార్ (Sharad Pawar) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు అవసరమైన తదుపరి వైద్య పర్యవేక్షణ, చికిత్స ఇంటి వద్దే కొనసాగుతుందని వైద్యులు తెలిపారు.
Sharad Pawar | త్రినేత్ర న్యూస్ : ఎన్సీపీ అధినేత (NCP-SP chief) శరద్ పవార్ (Sharad Pawar) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఛాతీలో నొప్పితో రెండు రోజుల క్రితం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. పరీక్షించిన వైద్యులు ఛాతి, శ్వాసకోస ఇన్‌ఫెక్షన్‌కు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో ఆయన్ని డిశ్చార్జ్ చేశారు. ఆయనకు అవసరమైన తదుపరి వైద్య పర్యవేక్షణ, చికిత్స ఇంటి వద్దే కొనసాగుతుందని తెలిపారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం పవార్ నేరుగా ముంబైలోని తన నివాసానికి చేరుకున్నారు.
అంతకముందు నవంబర్ 2న ఛాతీ నొప్పితో ఇబ్బంది పడుతూ పుణెలోని రూబి హాల్ క్లినిక్‌లో ఆయన చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నవంబర్ 4న డిశ్చార్జ్ అయ్యారు. అదేరోజు రాత్రి మెరుగైన చికిత్స కోసం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరారు. మూడు రోజులుగా చికిత్స పొందిన పవార్.. తాజాగా డిశ్చార్జ్ అయ్యారు. శరద్ పవార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. పవార్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే సహా పలువురు ప్రముఖులు ఆసుపత్రికి వెళ్లి పవార్‌ను కలిసిన విషయం తెలిసిందే.
Also Read..
నాకు ఏ పార్టీ మద్దతూ లేదు.. నా వెనుక బలమైన అభిమాన గణం ఉంది : ధనుష్
రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సన్నిహితుడు హ్యారీ బాక్సర్ అరెస్ట్
పండుగ వేళ ఎఫ్‌డీఏ కొరడా.. బ్లింకిట్, జెప్టో లైసెన్సులు రద్దు.. డీమార్ట్‌పై చర్యలు
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●హైదరాబాద్‌లో రాహుల్ గ్లోబల్ స్కెచ్! భారత్ సమ్మిట్ వెనుక అసలు వ్యూహమేంటి?
- ●Foreign Investors | భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల వెల్లువ.. కారణాలేమిటి..?
- ●Diwali celebrations in Indiramma Houses | కోమల-సమ్మయ్య దంపతుల ఇందిరమ్మ ఇంట్లో దీపావళి జరుపుకున్నా.. చాలా సంతోషంగా ఉంది
- ●Actor Dhanush | నాకు ఏ పార్టీ మద్దతూ లేదు.. నా వెనుక బలమైన అభిమాన గణం ఉంది : ధనుష్
- ●Surekha Vani | సురేఖా వాణి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ - అడ్వాంటేజ్ తీసుకోవద్దంటూ వార్నింగ్
- ●Zomato | జొమాటో గుడ్ న్యూస్.. 40 కిలోమీటర్ల దూరం నుంచీ ఫుడ్ డెలివరీ..

హైదరాబాద్‌లో రాహుల్ గ్లోబల్ స్కెచ్! భారత్ సమ్మిట్ వెనుక అసలు వ్యూహమేంటి?

Foreign Investors | భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల వెల్లువ.. కారణాలేమిటి..?

Diwali celebrations in Indiramma Houses | కోమల-సమ్మయ్య దంపతుల ఇందిరమ్మ ఇంట్లో దీపావళి జరుపుకున్నా.. చాలా సంతోషంగా ఉంది

Actor Dhanush | నాకు ఏ పార్టీ మద్దతూ లేదు.. నా వెనుక బలమైన అభిమాన గణం ఉంది : ధనుష్






