త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mother Dies by Suicide with Children | అయ్యో! పిల్ల‌ల‌ను న‌డుముకు క‌ట్టుకుని పాకాలలో దూకిన తల్లి.. అస‌లేమైందంటే..

Mother Dies by Suicide with Children | తెల్లారితే దీపావ‌ళి పండ‌గ‌.. ఏంచ‌క్కా దీపాల కాంతుల్లో ఆనందోత్సాహాల‌తో గ‌డ‌పాల్సిన వ‌య‌సు వారిది. కాక‌ర పుల్ల‌లు కాలుస్తూ చిరున‌వ్వులు చిందించాల్సిన చిన్నారులు.. క‌న్న‌పేగు తీసుకున్న క‌ఠిన నిర్ణ‌యానికి బ‌ల‌య్యారు.

S

Telangana | Published On Nov 7, 2026, 4.27 pm IST

Mother Dies by Suicide with Children | అయ్యో! పిల్ల‌ల‌ను న‌డుముకు క‌ట్టుకుని పాకాలలో దూకిన తల్లి.. అస‌లేమైందంటే..
Advertisement

Mother Dies by Suicide with Children | త్రినేత్ర న్యూస్‌: తెల్లారితే దీపావ‌ళి పండ‌గ‌.. ఏంచ‌క్కా దీపాల కాంతుల్లో ఆనందోత్సాహాల‌తో గ‌డ‌పాల్సిన వ‌య‌సు వారిది. కాక‌ర పుల్ల‌లు కాలుస్తూ చిరున‌వ్వులు చిందించాల్సిన చిన్నారులు.. క‌న్న‌పేగు తీసుకున్న క‌ఠిన నిర్ణ‌యానికి బ‌ల‌య్యారు. దీపావ‌ళి పండ‌గ వేళ వరంగ‌ల్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌నతో తీవ్ర విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. అస‌లేం జ‌రిగిందంటే..

హ‌నుమ‌కొండ జిల్లా హ‌స‌న్‌ప‌ర్తి మండ‌లం బైరాన్‌పల్లికి చెందిన మ‌మ‌త (30) త‌న అమ్మ‌మ్మ ఊరైన‌ వరంగల్ (Warangal) జిల్లా గీసుకొండ మండ‌లం ఎల్క‌తుర్తి హ‌వేలిలో పెరిగింది. అదే గ్రామానికి చెందిన ఈరెల్లి సుమ‌న్‌ను ఆరేండ్ల క్రితం కులాంత‌ర వివాహం (ప్రేమ పెళ్లి) చేసుకుంది. సుమ‌న్ ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తుండ‌గా మ‌మ‌త న‌ర్సంపేట ప‌ట్ట‌ణంలోని ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌లో న‌ర్సుగా విధులు నిర్వ‌హిస్తోంది. వీరికి ఇద్ద‌రు కుమార్తెలు హ‌ర్షిణి (4), కావ్య (3) సంతానం.

హాయిగా సాగిపోతున్న సంసార జీవితం.. భ‌ర్త పెట్టుకున్న వివాహేత‌ర సంబంధంతో చిన్నాభిన్న‌మైంది. సుమ‌న్ మ‌రో మ‌హిళ‌తో ఇంటి నుంచి వెళ్లిపోగా స‌ద‌రు మ‌హిళ కుటుంబ స‌భ్యులు సుమ‌న్ ఇంటికొచ్చి గొడ‌వ చేశారు. దీంతో తీవ్ర మ‌న‌స్థాపానికి గురైన మ‌మ‌త త‌న ఇద్ద‌రు కుమార్తెల‌తో క‌లిసి శ‌నివారం ఖానాపురం మండలంలోని పాకాల సరస్సుకు వెళ్లింది. అనంతరం అందులో దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. త‌మ కుమార్తె, మ‌న‌వ‌రాళ్ల మ‌ర‌ణ‌వార్త విన్న‌ మ‌మ‌త కుటుంబ స‌భ్యులు గుండ‌ల‌విసేలా రోదిస్తున్నారు.

ఈ ఘ‌ట‌నపై స‌మాచారం అందుకున్న‌ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, దుగ్గొండి సీఐ శంకరయ్య, ఖానాపురం ఎస్‌ఐ రామ్మోహన్ ఘటనాస్థలానికి చేరుకుని బోటింగ్ సిబ్బంది సాయంతో ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement