Virat Kohli | కోహ్లీ ఖాతాలో మరో రికార్డు.. 31 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన గుర్నూర్
Virat Kohli | న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. భారత పేసర్ల ధాటికి ఆతిథ్య జట్టు 41 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. గుర్నూర్ బ్రార్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. షార్ట్ బాల్స్‌తో భారత బౌలర్లు కివీస్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. మరోవైపు విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో ఏడు పరుగులే చేసినా అరుదైన రికార్డు సాధించాడు.
Virat Kohli | న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. భారత పేసర్ల ధాటికి ఆతిథ్య జట్టు 41 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. గుర్నూర్ బ్రార్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. షార్ట్ బాల్స్‌తో భారత బౌలర్లు కివీస్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. మరోవైపు విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో ఏడు పరుగులే చేసినా అరుదైన రికార్డు సాధించాడు. న్యూజిలాండ్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్‌ను అధిగమించాడు. న్యూజిలాండ్‌పై వన్డేల్లో కోహ్లీ పరుగుల సంఖ్య 1,978కి చేరింది. గతంలో ఈ రికార్డు 1,971 పరుగులతో రికీ పాంటింగ్ పేరిట ఉండేది. సచిన్ టెండూల్కర్ 1,750 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. కుమార సంగక్కర (1,568), సనత్ జయసూర్య (1,519) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఏడు పరుగులకే జాకబ్ డఫీ బౌలింగ్‌లో విల్ యంగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
31 ఏళ్ల రికార్డును అధిగమించిన గుర్నూర్
భారత యువ పేసర్ గుర్నూర్ బ్రార్ నాలుగు వికెట్లతో ప్రత్యేక ఘనత సాధించాడు. 10 ఓవర్లలో 30 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్ గడ్డపై వన్డేల్లో భారత ఫాస్ట్ బౌలర్ల అత్యుత్తమ ప్రదర్శనల్లో ఇది రెండోది. 2003లో ఆక్లాండ్‌లో జవగళ్ శ్రీనాథ్ 23 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉన్నాడు. 1995లో నేపియర్‌లో శ్రీనాథ్ నమోదు చేసిన 4/52 ప్రదర్శనను గుర్నూర్ అధిగమించాడు. మరోవైపు ఈ సిరీస్‌లో ఇప్పటివరకు భారత పేసర్లు షార్ట్ బాల్స్‌తో తొమ్మిది వికెట్లు తీయడం విశేషం. ఇందులో ఐదు గుర్నూర్ ఖాతాలోనే ఉన్నాయి.
కివీస్ పేరిట చెత్త రికార్డు
స్వదేశంలో భారత్‌పై న్యూజిలాండ్ నమోదు చేసిన అత్యల్ప వన్డే స్కోరు ఇదే. గతంలో 1994లో ఆక్లాండ్‌లో 142 పరుగులకే ఆలౌటైంది. ఇప్పుడు ఆ రికార్డును అధిగమిస్తూ 134 పరుగులకే చాపచుట్టేసింది. ఈ సిరీస్‌లో వరుసగా రెండు వన్డేల్లోనూ కివీస్ 200 పరుగుల లోపే ఆలౌట్ కావడం గమనార్హం. చివరిసారిగా 2001లో శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో న్యూజిలాండ్ ఇలా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 200లోపు పరుగులకే ఆలౌటైంది.
జేమీసన్ బౌలింగ్‌లో రోహిత్ తడబాటు
భారత బ్యాటర్ రోహిత్ శర్మకు కివీస్ పేసర్ కైల్ జేమీసన్ కొరకరాని కొయ్యగా మారాడు. వన్డేల్లో జేమీసన్ ఎదుర్కొన్న ఏడు ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ నాలుగుసార్లు వికెట్ సమర్పించుకున్నాడు. అతడి బౌలింగ్‌లో 96 బంతులాడి 69 పరుగులే చేశాడు. ఈ నాలుగు వికెట్లూ ఇన్నింగ్స్ తొలి పది ఓవర్లలోనే రావడం విశేషం. రోహిత్‌ను వన్డేల్లో తొలి పది ఓవర్లలో ఎక్కువసార్లు ఔట్ చేసిన బౌలర్లలో రబాడ, టిమ్ సౌథీ (ఐదేసి వికెట్లు) తర్వాత జేమీసన్ నిలిచాడు.
వర్షంతో భారత్‌కు విజయం
ఈ మ్యాచ్‌లో తొలుత న్యూజిలాండ్‌ను 134 పరుగులకే కట్టడి చేసిన భారత్.. లక్ష్య ఛేదనలో తడబడింది. 135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 26 ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులు చేసింది. విజయానికి మరో 22 పరుగులు అవసరమైన సమయంలో వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. డీఎల్ఎస్ పద్ధతిలో భారత్ నాలుగు పరుగుల ఆధిక్యంలో ఉండటంతో విజేతగా ప్రకటించారు. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యం సాధించింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Mother Dies by Suicide with Children | అయ్యో! పిల్లలను నడుముకు కట్టుకుని పాకాలలో దూకిన తల్లి.. అసలేమైందంటే..
- ●Ramayana | "రామాయణ"లో సాయిపల్లవి పాత్రకు డబ్బింగ్ చెప్పిన సీరియల్ నటి ఎవరంటే?
- ●IND VS NZ | వన్డే సిరీస్ భారత్ వశం.. రెండో వన్డేలోనూ కివీస్‌పై గెలుపు..
- ●Muhurat Trading | దీపావళి నాడు ప్రత్యేక స్టాక్ మార్కెట్ సెషన్.. ముహూరత్ ట్రేడింగ్‌లో స్టాక్స్‌ను కొనాలా..?
- ●Rajnath Singh | ప్రజలతో సత్సంబంధాలే దేశ రక్షణకు కొండంత బలం.. వాయుసేన సిబ్బందితో రాజ్‌నాథ్ సింగ్
- ●Laptops Scheme | విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన విజయ్ సర్కారు.. రూ.2వేలకోట్లతో ల్యాప్‌టాప్‌లు..!

Mother Dies by Suicide with Children | అయ్యో! పిల్లలను నడుముకు కట్టుకుని పాకాలలో దూకిన తల్లి.. అసలేమైందంటే..

Ramayana | "రామాయణ"లో సాయిపల్లవి పాత్రకు డబ్బింగ్ చెప్పిన సీరియల్ నటి ఎవరంటే?

IND VS NZ | వన్డే సిరీస్ భారత్ వశం.. రెండో వన్డేలోనూ కివీస్‌పై గెలుపు..

Muhurat Trading | దీపావళి నాడు ప్రత్యేక స్టాక్ మార్కెట్ సెషన్.. ముహూరత్ ట్రేడింగ్‌లో స్టాక్స్‌ను కొనాలా..?





