ITR | స్టాక్ మార్కెట్ ట్రేడర్లు ఐటీఆర్‌లో వివరాలను నమోదు చేయాలా.. తెలుసుకోవాల్సిన విషయాలు..
ITR | అసెస్‌మెంట్ ఇయర్ (ఏవై) 2026-27 కోసం ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఇంట్రాడే ట్రేడింగ్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) ట్రేడింగ్ చేసే వారు తాజా రిపోర్టింగ్ నిబంధనలను తప్పనిసరిగా తెలుసుకోవాలి.
ITR | అసెస్‌మెంట్ ఇయర్ (ఏవై) 2026-27 కోసం ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఇంట్రాడే ట్రేడింగ్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) ట్రేడింగ్ చేసే వారు తాజా రిపోర్టింగ్ నిబంధనలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. మార్చిన ఐటీఆర్ ఫామ్‌లో అదనపు వివరాలను వెల్లడించడం తప్పనిసరి కావడంతో, సరైన ఐటీఆర్ ఫామ్‌ను ఎంపిక చేసుకుని ట్రేడింగ్ ఆదాయాన్ని సక్రమంగా నమోదు చేయడం అత్యంత కీలకంగా మారింది. ట్రేడర్లు తమకు వర్తించే సరైన ఐటీఆర్ ఫామ్‌ను ముందుగా ఎంపిక చేసుకోవాలి. సాధారణంగా ఇంట్రాడే ట్రేడింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని స్పెక్యులేటివ్ బిజినెస్ ఆదాయంగా పరిగణిస్తారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) ట్రేడింగ్ ద్వారా వచ్చే ఆదాయం మాత్రం నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ ఆదాయంగా వర్గీకరిస్తారు. ఈ కారణంగా ఎక్కువ మంది ట్రేడర్లు ఐటీఆర్ 3 ఫామ్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఏ ట్రేడర్లు ఏ ఫామ్ వాడాలి..
ఐటీఆర్ 2 అంటే పెట్టుబడుల ద్వారా వచ్చే క్యాపిటల్ గెయిన్స్‌ను ప్రకటించే పన్ను చెల్లింపుదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఇక ఐటీఆర్ 1 మాత్రం నిర్దిష్ట అర్హత ప్రమాణాలు ఉన్నవారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి తమ ఆదాయ స్వరూపాన్ని బట్టి సరైన ఐటీఆర్ ఫామ్‌ను ఎంపిక చేసుకోవాలని, అవసరమైతే సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఐటీఆర్3 దాఖలు చేసే వారు తమ వ్యాపార స్వరూపాన్ని ప్రభుత్వం నిర్దేశించిన బిజినెస్ కోడ్‌ల ద్వారా వెల్లడించాలి. ఇంట్రాడే ట్రేడింగ్ (స్పెక్యులేటివ్ ట్రేడింగ్) కోసం 21009 కోడ్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (నాన్-స్పెక్యులేటివ్ ట్రేడింగ్) కోసం 21010 కోడ్, షేర్ ట్రేడింగ్‌ను వ్యాపారంగా నిర్వహించే వారికి 21011 కోడ్‌ను ఉపయోగించాలి. రిటర్నులో నమోదు చేసే వ్యాపార వివరాలు తమ ఆర్థిక రికార్డులకు పూర్తిగా సరిపోవాలి. అప్‌డేట్ చేసిన ఐటీఆర్ 3 ఫామ్‌లో ఇంట్రాడే ట్రేడింగ్, ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్‌కు సంబంధించిన టర్నోవర్, ఆదాయాన్ని విడివిడిగా ప్రకటించడం తప్పనిసరిగా మారింది. అకౌంట్ పుస్తకాలు నిర్వహించే ట్రేడర్లు రిటర్నులో చూపించే టర్నోవర్, ఆదాయం తమ అకౌంటింగ్ రికార్డులతో పూర్తిగా సరిపోతున్నాయో లేదో నిర్ధారించుకోవాలి. లేదంటే భవిష్యత్తులో పన్ను శాఖ నుంచి వివరణలు కోరే అవకాశం ఉంటుంది.
అకౌంట్ పుస్తకాలను నిర్వహించాలా..
వ్యాపార టర్నోవర్ రూ.25 లక్షలు దాటినా లేదా గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఏదైనా ఒక సంవత్సరంలో నికర లాభం రూ.2.5 లక్షలు మించినా అకౌంట్ పుస్తకాలు నిర్వహించడం సాధారణంగా తప్పనిసరి అవుతుంది. అలాగే టర్నోవర్ పరిమితులు, నగదు లావాదేవీలకు సంబంధించిన నిబంధనలను బట్టి కొన్ని సందర్భాల్లో ట్యాక్స్ ఆడిట్ కూడా వర్తించే అవకాశం ఉంటుంది. ఆడిట్ అవసరం లేని కేసుల్లో ఏవై 2026-27 కోసం ఐటీఆర్ 3ని దాఖలు చేసే చివరి తేదీ ఆగస్టు 31 కాగా ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ విధానాన్ని ఎంచుకునే విషయంలో కూడా ట్రేడర్లు జాగ్రత్తగా ఉండాలి. కేవలం ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ వర్తిస్తుందని భావించి ఐటీఆర్ 4 దాఖలు చేయడం ఇంట్రాడే లేదా ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ ఆదాయం ఉన్న వారికి సరైన ఎంపిక కాదు. తప్పు ఐటీఆర్ ఫామ్ ను దాఖలు చేస్తే నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
నష్టం వచ్చినా చెప్పాలి..
ఏదైనా ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్లలో షేర్లు, మ్యుచువల్ ఫండ్స్ లేదా ఎఫ్ అండ్ వో ట్రేడింగ్ ద్వారా నష్టం వస్తే దాన్ని కూడా తప్పనిసరిగా ఐటీఆర్ లో తెలియజేయాలి. సాధారణంగా చాలా మంది నష్టం వేస్తే ఐటీఆర్‌లో వివరాలను వెల్లడించరు. దీని వల్ల తరువాతి ఆర్థిక సంవత్సరాలకు ఆ నష్టాలను క్యారీ ఫార్వర్డ్ చేసే అవకాశం ఉండదు. నష్టాలను ముందుగా వెల్లడిస్తే తరువాతి ఆర్థిక సంవత్సరాల్లో లాభాలు వచ్చినా ముందుగా తెలిపి ఉంటారు కనుక పన్ను మినహాయింపులు పొందే అవకాశాలు ఉంటాయి. అందువల్ల నష్టాలు వచ్చినా ఐటీఆర్‌లో వెల్లడించడం తప్పనిసరి. ఇక ఏవై 2026-27 కోసం ఐటీఆర్ దాఖలులో ఇంట్రాడే, ఎఫ్ అండ్ ఓ ట్రేడర్లు గతంతో పోలిస్తే మరిన్ని వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. సరైన ఐటీఆర్ ఫామ్‌ను ఎంపిక చేయడం, ట్రేడింగ్ ఆదాయాన్ని కచ్చితంగా నమోదు చేయడం, సరైన బిజినెస్ కోడ్‌లను ఉపయోగించడం, అవసరమైన ఆర్థిక రికార్డులను నిర్వహించడం ద్వారా ఐటీఆర్ దాఖలు ప్రక్రియను సులభంగా పూర్తి చేయడంతోపాటు నిబంధనల ఉల్లంఘన సమస్యలను నివారించవచ్చు.
తాజావార్తలు
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?

Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు






