త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kedarnath | దీపావ‌ళికి కేదార్‌నాథ్ ముస్తాబు.. 20 క్వింటాళ్ల పూల‌తో అలంక‌ర‌ణ‌!

Kedarnath | దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ శైవక్షేత్రం కేదార్‌నాథ్‌ ధామ్‌ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సుమారు 18 నుంచి 20 క్వింటాళ్ల రంగురంగుల పూలతో బాబా కేదార్‌ సన్నిధిని, ఆలయ ప్రాంగణాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. పూల అలంకరణలు, దీపకాంతులతో ఆలయ పరిసరాలు భక్తిభావాన్ని పంచుతున్నాయి. ఈ అపురూప దృశ్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

P

Devotional | Published On Nov 7, 2026, 5.05 pm IST

Kedarnath | దీపావ‌ళికి కేదార్‌నాథ్ ముస్తాబు.. 20 క్వింటాళ్ల పూల‌తో అలంక‌ర‌ణ‌!
Advertisement
  • ఈ నెల 11న ఆల‌యం మూసివేత‌
  • మ‌ళ్లీ 2027 మేలోనే ద‌ర్శ‌నాలు

Kedarnath | దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ శైవక్షేత్రం కేదార్‌నాథ్‌ ధామ్‌ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సుమారు 18 నుంచి 20 క్వింటాళ్ల రంగురంగుల పూలతో బాబా కేదార్‌ సన్నిధిని, ఆలయ ప్రాంగణాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. పూల అలంకరణలు, దీపకాంతులతో ఆలయ పరిసరాలు భక్తిభావాన్ని పంచుతున్నాయి. ఈ అపురూప దృశ్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

భైరవనాథుడి ఆలయ ద్వారాలు మూసివేత

కేదార్‌నాథ్‌ ధామ్‌ క్షేత్రపాలకుడు, రక్షకుడిగా పూజలందుకునే భగవాన్‌ భుకుండ్‌ భైరవనాథుడి ఆలయ ద్వారాలను దీపావళి సందర్భంగా సంప్రదాయబద్ధంగా శీతాకాలం కోసం మూసివేశారు. బద్రీనాథ్‌-కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ సభ్యుడు డాక్టర్‌ వినీత్‌ చంద్ర పోస్తి ఈ విషయాన్ని వెల్లడించారు. కార్యక్రమంలో స్థానిక హక్కుదారులు, తీర్థ పురోహితులు, ఆలయ కమిటీ సభ్యులు, పోలీసు, పరిపాలనా అధికారులు పాల్గొన్నారు.

నవంబర్‌ 11న బాబా కేదార్‌ ఆలయం మూసివేత

భైరవనాథుడి ఆలయ ద్వారాలు మూసివేయడంతో బాబా కేదార్‌నాథ్‌ ధామ్‌ ప్రధాన ఆలయ ద్వారాల మూసివేత ప్రక్రియ కూడా ప్రారంభమైంది. సంప్రదాయాలు, శాస్త్రోక్త ఆచారాల ప్రకారం నవంబర్‌ 11న శీతాకాలం సంద‌ర్భంగా కేదార్‌నాథ్‌ ఆలయ ద్వారాలను మూసివేయనున్నారు. దీంతో ఈ ఏడాది కేదార్‌నాథ్‌ యాత్ర ముగింపు దశకు చేరుకోనుంది.

భక్తితో దీపాలు వెలిగించాలి

దీపావళి సందర్భంగా క్షేత్రంలో దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకోవాలని డాక్టర్‌ పోస్తి భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఆలయ పవిత్రతను కాపాడాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా క్రమశిక్షణతో వ్యవహరించాలని సూచించారు. పూల సోయగాలు, దీపాల వెలుగుల మధ్య కొలువుదీరిన బాబా కేదార్‌ సన్నిధి దీపావళి వేడుకలకు ప్రత్యేక ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చింది.

Advertisement
Advertisement