త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | అల్లం బుచ్చవ్వ మరణంపై కేసీఆర్ సంతాపం

KCR | ప్రెస్ అకాడ‌మీ మాజీ చైర్మ‌న్‌, సీనియ‌ర్ సంపాద‌కుడు, తెలంగాణ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు అల్లం నారాయణ మాతృమూర్తి అల్లం బుచ్చవ్వ (Allam Buchavva) మరణంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు.

S

Telangana | Published On Nov 7, 2026, 5.02 pm IST

KCR | అల్లం బుచ్చవ్వ మరణంపై కేసీఆర్ సంతాపం
Advertisement

KCR | త్రినేత్ర న్యూస్: ప్రెస్ అకాడ‌మీ మాజీ చైర్మ‌న్‌, సీనియ‌ర్ సంపాద‌కుడు, తెలంగాణ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు అల్లం నారాయణ మాతృమూర్తి అల్లం బుచ్చవ్వ (Allam Buchavva) మరణంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. మాతృ వియోగంతో శోకంలో ఉన్న అల్లం నారాయణ సోదరులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియ‌జేశారు.

తెలంగాణ సాహిత్యం, జర్నలిజం రంగాల్లో ప్రముఖులైన అల్లం రాజయ్య, అల్లం వీరయ్య, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణల మాతృమూర్తి మ‌ర‌ణించ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. సాహిత్య, జర్నలిజం రంగాల్లో తమదైన ముద్ర వేసి, రాష్ట్ర సాధన ఉద్యమంలో తమవంతు పాత్ర పోషించిన ముగ్గురు కుమారులను తెలంగాణకు అందించిన మాతృమూర్తి అల్లం బుచ్చవ్వ అని కేసీఆర్ కొనియాడారు.

Advertisement
Advertisement