YouTube | యూట్యూబ్‌లో భారీ మార్పులు.. ఏఐతో వీడియో ఎడిటింగ్, లైవ్ డబ్బింగ్..
YouTube | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లో పలు భారీ మార్పులు తీసుకొచ్చింది. క్రియేటర్లకు అందుబాటులో ఉండేలా పలు ఏఐ ఫీచర్లను కూడా అందిస్తోంది. ఈ మేరకు మేడ్ ఆన్ యూట్యూబ్ 2026 అనే కార్యక్రమంలో భాగంగా ఈ అప్‌డేట్స్‌ను ప్రకటించింది.
Technology | Published On Sep 25, 2026, 12.03 pm IST
YouTube | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లో పలు భారీ మార్పులు తీసుకొచ్చింది. క్రియేటర్లకు అందుబాటులో ఉండేలా పలు ఏఐ ఫీచర్లను కూడా అందిస్తోంది. ఈ మేరకు మేడ్ ఆన్ యూట్యూబ్ 2026 అనే కార్యక్రమంలో భాగంగా ఈ అప్‌డేట్స్‌ను ప్రకటించింది. లైవ్ స్ట్రీమింగ్, యూట్యూబ్ మ్యూజిక్, యూట్యూబ్ స్టూడియో తదితర ప్లాట్‌ఫామ్‌లలో ఏఐ ఆధారిత ఆడియో, వీడియో ఎడిటింగ్, కామెంట్ మోడరేషన్, క్రియేటర్ల రూపం, గొంతు ప్రొటెక్షన్‌కు సంబంధించి కొత్త ఫీచర్లను ప్రకటించింది. యూట్యూబ్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది ఆగస్టులో ప్రతి రోజు సగటున 60 కోట్లకు పైగా లాగిన్ అయిన వీక్షకులు లైవ్ కంటెంట్‌ను వీక్షించారని తేలింది. అలాగే ఆర్కైవ్ చేసిన లైవ్ కంటెంట్‌ను కూడా వీక్షకులు ఎక్కువగానే చూస్తున్నారని స్పష్టమైంది.
వాచ్ విత్ ఫీచర్..
యూట్యూబ్ తన వాచ్ విత్ ఫీచర్‌ను లైవ్ స్ట్రీమ్స్‌కే పరిమితం చేయకుండా, అర్హత కలిగిన అన్ని లాంగ్‌ఫార్మ్ వీడియోలకు విస్తరిస్తోంది. ఈ ఫీచర్‌ను తొలుత ప్రముఖ ప్రసారాల కోసం ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురాగా, క్రియేటర్ల లైవ్ స్ట్రీమ్స్ మధ్య లైవ్ రియాక్షన్స్‌ను కూడా ఈ ఏడాది ప్రారంభంలో పరీక్షించింది. ఇకపై అర్హత కలిగిన లాంగ్‌ఫార్మ్ వీడియో లేదా లైవ్ స్ట్రీమ్‌లో క్రియేటర్లు రియాక్ట్ లైవ్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఇందులో అసలు వీడియో రూపొందించిన క్రియేటర్, దానికి రియాక్ట్ అవుతున్న క్రియేటర్‌కు వేర్వేరు ఆదాయం, క్రెడిట్, నియంత్రణ వ్యవస్థలు ఉంటాయి. రియాక్ట్ చేస్తున్న క్రియేటర్లు తమ లైవ్ ప్రకటనల ఆదాయం, అభిమానుల నుంచి వచ్చే ఫండింగ్‌ను పొందుతారు. అసలు క్రియేటర్లకు స్పష్టమైన అట్రిబ్యూషన్‌తోపాటు యూట్యూబ్ స్టూడియోలో అదనపు వ్యూ క్రెడిట్ లభిస్తుంది. అలాగే తమ వీడియోలకు రియాక్షన్ ఇవ్వడానికి అనుమతించాలా లేదా అన్నదాన్ని అసలు క్రియేటర్లు నియంత్రించవచ్చు.
గో లైవ్ టుగెదర్..
గో లైవ్ టుగెదర్ ఫీచర్‌లో లైవ్ క్రియేటర్ మ్యాచింగ్‌ను కూడా యూట్యూబ్ జోడిస్తోంది. గతంలో క్రియేటర్లు ఆఫ్‌లైన్‌లో ఉన్న అతిథులను లింక్ ద్వారా ఆహ్వానించాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రస్తుతం లైవ్‌లో ఉన్న క్రియేటర్లను బ్రౌజ్ చేసి సహక్రియేటర్‌ను ఎంచుకోవచ్చు. అలాగే క్విక్ మ్యాచింగ్ ద్వారా తమకు సారూప్యమైన, ఇంతకుముందు పరిచయం లేని క్రియేటర్లతో యూట్యూబ్ ఆటోమేటిక్‌గా జత చేస్తుంది. కో-హోస్ట్‌లతో లైవ్ స్ట్రీమ్ ప్రారంభమైన తర్వాత లైవ్ షోడౌన్ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇందులో అభిమానుల ఫండింగ్‌ను టీమ్ ఛాలెంజ్‌గా మార్చవచ్చు. ఇద్దరు క్రియేటర్లు ముఖాముఖి పోటీ నిర్వహించగా, వీక్షకులు చాట్‌లు, గిఫ్ట్‌లు, సూపర్ చాట్‌ల ద్వారా తమకు నచ్చిన క్రియేటర్ స్కోర్‌ను రియల్‌టైమ్‌లో పెంచవచ్చు. క్రియేటర్ సొంత దేశం వెలుపల నుంచి వచ్చే వీక్షణల వాటా లైవ్ వాచ్‌టైమ్‌లో 40 శాతానికి పైగా ఉంటుందని యూట్యూబ్ తెలిపింది. దీంతో లైవ్ ఆటో డబ్బింగ్ ఫీచర్‌ను కూడా తీసుకురానుంది. ఇది క్రియేటర్ మాట్లాడే మాటలను రియల్‌టైమ్‌లో అనువదించి, వీక్షకులు తమకు నచ్చిన భాషలో వినేలా చేస్తుంది.

యూట్యూబ్ స్టూడియోలో..
వీడియో క్రియేషన్ ప్రక్రియలోని వివిధ దశలకు అనుగుణంగా యూట్యూబ్ స్టూడియో వెబ్, మొబైల్ వెర్షన్లలో కొత్త సాధనాలను జోడిస్తోంది. కొత్త ఇన్‌సైట్స్, రిసెర్చ్ విభాగాల ద్వారా క్రియేటర్లు గత వీడియోల పనితీరును విశ్లేషించడంతోపాటు అసాధారణంగా మంచి లేదా భిన్నమైన ఫలితాలు సాధించిన వీడియోలను గుర్తించవచ్చు. కొత్త స్టూడియో ఫీడ్‌బ్యాక్ ఫీచర్ వీడియో డ్రాఫ్ట్‌లను పరిశీలించి వ్యక్తిగతీకరించిన సూచనలు ఇస్తుంది. వీడియో వేగం, నిర్మాణం, కథన విధానం తదితర అంశాల్లో మార్పులను సూచిస్తుంది. క్రియేటర్లు తమ ఛానల్‌కు సరిపోయే థంబ్‌నెయిల్స్‌ను కూడా రూపొందించుకోవచ్చు. డైనమిక్ థంబ్‌నెయిల్స్ ద్వారా మూడు థంబ్‌నెయిల్ ఆప్షన్లలో ప్రేక్షకుల విభిన్న వర్గాలకు ఏది మెరుగ్గా పనిచేస్తుందో యూట్యూబ్ సిఫార్సు చేస్తుంది.
ఏఐ ద్వారా ఎడిటింగ్..
యూట్యూబ్ గతంలోనే జెమిని ఓమ్నీని షార్ట్స్, యూట్యూబ్ క్రియేట్ యాప్‌లలోకి తీసుకొచ్చింది. ఈ ఏడాది ఆగస్టులో ప్రతిరోజూ లక్షలాది ఛానళ్లు దీనిని ఉపయోగించాయని కంపెనీ తెలిపింది. మొదటి జనరేటివ్ ఏఐ ట్రెండ్స్ నివేదిక ప్రకారం అమెరికాలో 14 నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న వీడియో పోస్టర్లలో 72 శాతం మంది గతేడాది వీడియోలను రూపొందించడానికి లేదా ఎడిట్ చేయడానికి ఏఐని ఉపయోగించారని తేలింది. కొత్త సంభాషణాత్మక ఎడిటింగ్ అసిస్టెంట్ ద్వారా జెమినిని షార్ట్స్, యూట్యూబ్ క్రియేట్ యాప్‌లలోకి అనుసంధానిస్తోంది. క్రియేటర్లు యూట్యూబ్ సూచించే ప్రాంప్ట్‌లను లేదా తమ సొంత ప్రాంప్ట్‌లను ఉపయోగించి వీడియో మొదటి డ్రాఫ్ట్‌ను రూపొందించుకోవచ్చు. ఆ తర్వాత అసిస్టెంట్‌తో సంభాషిస్తూ వీడియోలో మార్పులు చేయవచ్చు.
లభ్యత ఎప్పటి నుంచి..
అర్హత కలిగిన లాంగ్‌ఫార్మ్ వీడియోలకు వాచ్ విత్ ఫీచర్ ఈ ఏడాది చివర్లో అందుబాటులోకి రానుంది. లైవ్ క్రియేటర్ మ్యాచింగ్ 2027 ప్రారంభంలో, లైవ్ షోడౌన్ 2027లో విడుదల కానున్నాయి. లైవ్ ఆటో డబ్బింగ్ పైలట్ 2027 ప్రారంభంలో మొదలవుతుంది. ఆస్క్ మ్యూజిక్ మార్పులు, యువర్ పాడ్‌కాస్ట్ లైనప్ త్వరలో ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ మ్యూజిక్, ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు అందుబాటులోకి వస్తాయి. మూడు వీడియో కట్స్ వరకు పరీక్షించే వీడియో ఏబీ టెస్టింగ్ ఫీచర్ కూడా త్వరలో రానుంది. స్పీకింగ్ వాయిస్ డిటెక్షన్, ఫేషియల్ డిటెక్షన్ సమీకరణ ఈ ఏడాది చివర్లో అందుబాటులోకి రానుంది. యూట్యూబ్ మొబైల్ యాప్‌లో లైకెనెస్ డిటెక్షన్ కూడా ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.
సంబంధిత వార్తలు

Madhuri Rathod | మాధురి రాథోడ్ ఈశ్వర్ సాయి ‘రాయే లచ్చిమి’ సాంగ్ ట్రెండింగ్ – వీరిద్దరు కలిసి చేసిన ఫోక్ సాంగ్స్ ఇవే
ఆగస్టు 20, 2026

YouTube | యూట్యూబ్‌లో భారీ అప్డేట్.. ఇక తొలి ఫ్రేమ్ నుంచే వ్యూస్ లెక్కింపు..
ఆగస్టు 18, 2026

Hyderabad | యూట్యూబ్ నేర్పిన మద్యం తయారీ.. 502 బాటిళ్లతో పోలీసులకు చిక్కిన ఆంటోనీ
జులై 8, 2026
తాజావార్తలు
- ●Kedarnath Dham | కేదార్‌నాథ్‌లో భారీగా పెరిగిపోయిన చెత్తాచెదారం.. 5 నెలల్లోనే 50 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు
- ●Balapur Laddu | రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేశ్ లడ్డూ.. రూ.39 లక్షలకు దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి
- ●PB Fintech | పాలసీబజార్ షేర్లలో మళ్లీ ఊగిసలాట.. బ్రోకరేజీల రేటింగ్ ఎటువైపు..?
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి.. ఈక్విటీ మార్కెట్లలో పాజిటివ్ సంకేతాలు..
- ●Danam Nagender | ఖైరతాబాద్ మహాగణపతి ఎదుట దానం నాగేందర్ డ్యాన్స్..
- ●Stock Markets | షార్ప్ పతనం తర్వాత మార్కెట్లకు ఊరట.. సెన్సెక్స్ 173 పాయింట్లు అప్..

Kedarnath Dham | కేదార్‌నాథ్‌లో భారీగా పెరిగిపోయిన చెత్తాచెదారం.. 5 నెలల్లోనే 50 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు

Balapur Laddu | రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేశ్ లడ్డూ.. రూ.39 లక్షలకు దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి

PB Fintech | పాలసీబజార్ షేర్లలో మళ్లీ ఊగిసలాట.. బ్రోకరేజీల రేటింగ్ ఎటువైపు..?

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి.. ఈక్విటీ మార్కెట్లలో పాజిటివ్ సంకేతాలు..



