త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kerala Rains | కేర‌ళ‌లో వ‌ర్ష బీభ‌త్సం.. ఐదుగురు మృతి.. ఐఎండీ హెచ్చ‌రిక‌లు

Kerala Rains | కేర‌ళ‌ను భారీ వ‌ర్షాలు (Kerala Rains) ముంచెత్తుతున్నాయి. మ‌ల‌ప్పురం (Malappuram) జిల్లా నిలంబూర్ (Nilambur) ప‌రిధిలోని టీకే కాల‌నీ ప్రాంతంలో గ‌ల కొట్టాపుజ న‌ది (Kottapuzha River)కి వ‌ర‌ద పోటెత్తింది.

D

National | Published On Sep 21, 2026, 11.56 am IST

Kerala Rains | కేర‌ళ‌లో వ‌ర్ష బీభ‌త్సం.. ఐదుగురు మృతి.. ఐఎండీ హెచ్చ‌రిక‌లు
Advertisement

Kerala Rains | త్రినేత్ర‌.న్యూస్ : ద‌క్షిణాది రాష్ట్రం కేర‌ళ‌ను భారీ వ‌ర్షాలు (Kerala Rains) ముంచెత్తుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఎల్‌నినో ప్ర‌భావం కొన‌సాగుతున్నా కేర‌ళ‌లో మాత్రం వ‌ర్ష బీభ‌త్సం సృష్టించింది. ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల‌కు ప‌లు ప్రాంతాల్లో కొండ‌చ‌రియ‌లు (flash floods) విరిగిప‌డుతున్నాయి. ప‌లు చోట్ల ఆక‌స్మిక వ‌ర‌ద‌లు ముంచెత్తుతున్నాయి. తాజాగా మ‌ల‌ప్పురం (Malappuram) జిల్లా నిలంబూర్ (Nilambur) ప‌రిధిలోని టీకే కాల‌నీ ప్రాంతంలో గ‌ల కొట్టాపుజ న‌ది (Kottapuzha River)కి వ‌ర‌ద పోటెత్తింది.

ఆదివారం సాయంత్రం స‌మ‌యంలో టీకే కాల‌నీ ఎకో టూరిజం కేంద్రం స‌మీపంలో న‌ది ఒక్క‌సారిగా ఉప్పొంగ‌డంతో వ‌ర‌ద ప్ర‌వాహానికి ఆరుగురు గ‌ల్లంత‌య్యారు. స‌మాచారం అందుకున్న అధికారులు అక్క‌డ స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఆదివారం రాత్రి రెండు మృతదేహాలను వెలికితీయగా.. సోమవారం ఉదయం మరో మూడు మృతదేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతులు తిరూర్‌, ఎడారికోడ్‌, క‌రువుర‌కుండు, వండోర్‌, చెట్టియార‌మ్మాళ్ ప్రాంతాల‌కు చెందిన టూరిస్ట్‌లుగా గుర్తించారు. గ‌ల్లంతైన‌వారి కోసం గాలింపు చేప‌డుతున్నారు.

ఆరెంజ్ అల‌ర్ట్‌

మ‌రోవైపు కేర‌ళ‌లోని ఆరు జిల్లాల‌కు భార‌త వాతావ‌ర‌ణ శాఖ (IMD) వ‌ర్ష హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ప‌త‌నం తిట్ట‌, అల‌ప్పుజ‌, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకుళం, త్రిసూర్ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు, ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేసింది.

ఆయా ప్రాంతాల్లో 24 గంట‌ల్లో 115.6 మి.మీ నుంచి 204.4 మి.మీ వ‌ర‌కు వ‌ర్ష‌పాతం న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో గంట‌కు 40 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. అదేవిధంగా కొల్లం, పాలక్కాడ్, కన్నూరు జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. మిగిలిన ఎనిమిది జిల్లాలను ఎల్లో హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఐఎండీ హెచ్చ‌రిక‌ల‌తో స్థానిక అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించింది. కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డే ప్రాంతాల‌కు, చెరువులు, న‌దుల వ‌ద్ద‌కు వెళ్లొద్ద‌ని సూచించింది. అన‌వ‌స‌ర ప్ర‌యాణాల‌కు దూరంగా ఉండాల‌ని హెచ్చ‌రించింది.

Also Read..

షూటింగ్ అంటేనే వ‌ణికిపోయా - మైసాపై ర‌ష్మిక మంద‌న్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

సీఎం గారూ అపాయింట్‌మెంట్ ఇవ్వండి ప్లీజ్.. ట్రోల్స్‌పై కే శోభారెడ్డి ఆవేద‌న‌

ఖైర‌తాబాద్ గ‌ణేశ్‌.. నిన్న ఒక్క‌రోజే 4 ల‌క్ష‌ల మంది ద‌ర్శ‌నం

Advertisement
Advertisement