Tibet | టిబెట్‌లో భారీ భూకంపం.. 18 మంది మృతి, కూలిన 300కుపైగా ఇండ్లు
Tibet | టిబెట్‌లో (Tibet) భారీ భూకంపం సంభవించింది. గురువారం రాత్రి 10.30 గంటలకు 7.0 తీవ్రతతో ప్రకంపణలు (Earthquake) వచ్చాయి. భూమికి 10కి.మీటర్ల లోతున.. నగ్‌చూ (Nagqu)కు 190 కి.మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది.
International | Published On Oct 23, 2026, 7.52 am IST
Tibet | త్రినేత్ర న్యూస్: టిబెట్‌లో (Tibet) భారీ భూకంపం సంభవించింది. గురువారం రాత్రి 10.30 గంటలకు 7.0 తీవ్రతతో ప్రకంపణలు (Earthquake) వచ్చాయి. భూమికి 10కి.మీటర్ల లోతున.. నగ్‌చూ (Nagqu)కు 190 కి.మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. భూకంపం ధాటికి 18 మంది మృతిచెందారు. మరో 54 మంది గాయపడ్డారు. వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, భూప్రకంపణల వల్ల 339 ఇండ్లు కూలిపోయాయి. పలు భవనాలు దెబ్బతిన్నాయి. విద్యుత్, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు బయటకు పరుగుతు తీస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. భూకంప తీవ్రత దృష్ట్యా లెవల్-2 అత్యవసరస్థితిని చైనా ప్రకటించింది.

చైనా విపత్తు నిర్వహణ సంస్థ పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టింది. 300 మందికిపైగా సిబ్బంది సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. గత ఆగస్టులో నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో (Nepal-Tibet border) భారీ వరద బీభత్సం (Flash Floods) సృష్టించిన విషయం తెలిసిందే. ఇందులో 1400 మందికిపైగా మరణించారు. వరదల ధాటికి నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో వందలాది ఇండ్లు, భవనాలు తుడిచిపెట్టుకుపోయాయి. కాగా, 2025 జనవరిలో టిబెట్‌లోని టింగ్రీ కౌంటీలో వచ్చిన భూకంపంలో 126 మంది మృతిచెందారు.
UPDATE: Footage captures shaking from a reported M7.0 earthquake in Baqing County, Nagqu, Tibet.
China - Sismo - Terremoto - Temblor https://t.co/tyNYJmUjwx
— GeoTechWar (@geotechwar) October 22, 2026
JUST IN: At least 16 dead, 32 injured and hundreds of homes collapsed after a magnitude 7.0 earthquake struck Tibet, China, officials say. https://t.co/2nTZ5BL4CU
— Scope Report (@ScopeReport_) October 22, 2026
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●ICICI Bank | ఖాతాదారులకు ఐసీఐసీఐ బ్యాంక్ షాక్.. డిసెంబర్ 1 నుంచి డిపాజిట్, ఉపసంహరణ చార్జీల పెంపు
- ●LIC HFL Apprentice | ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో 232 అప్రెంటిస్‌లు
- ●Horoscope | అక్టోబర్ 23 రాశిఫలాలు.. ఈ రాశివారు విందు వినోదాల కోసం ఖర్చులు చేస్తారు!
- ●Telugu OTT | సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన రాజు వెడ్స్ రాంబాయి హీరో సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ
- ●ACB Raids | భూపాలపల్లి డీఆర్డీఏలో ఏసీబీ దాడులు.. ప్రాజెక్టు అధికారి సతీష్ రెడ్డి అరెస్ట్
- ●Yedula Reservoir | ఏదుల నుంచి డిండికి నీళ్లు ఎత్తిపోయకండి

ICICI Bank | ఖాతాదారులకు ఐసీఐసీఐ బ్యాంక్ షాక్.. డిసెంబర్ 1 నుంచి డిపాజిట్, ఉపసంహరణ చార్జీల పెంపు

LIC HFL Apprentice | ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో 232 అప్రెంటిస్‌లు

Horoscope | అక్టోబర్ 23 రాశిఫలాలు.. ఈ రాశివారు విందు వినోదాల కోసం ఖర్చులు చేస్తారు!

Telugu OTT | సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన రాజు వెడ్స్ రాంబాయి హీరో సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ






