త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Om Prakash Rajbhar | అఖిలేష్ అధికారంలోకి వ‌స్తే రామ‌మందిరంలో న‌మాజ్ చేయిస్తారు : యూపీ మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Om Prakash Rajbhar | సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) అధినేత అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav)పై ఉత్తరప్రదేశ్ మంత్రి ఓం ప్రకాష్ రాజ్‌భర్ (Om Prakash Rajbhar) తీవ్రస్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్రంలో సమాజ్‌వాదీ పార్టీ మ‌ళ్లీ అధికారంలోకి వస్తే.. అఖిలేష్ యాదవ్ అయోధ్యలోని రామమందిరంలో (Ayodhya Ram Mandir) నమాజ్ (namaz) చేయిస్తారని విమ‌ర్శించారు.

D

National | Published On Nov 11, 2026, 5.30 pm IST

Om Prakash Rajbhar | అఖిలేష్ అధికారంలోకి వ‌స్తే రామ‌మందిరంలో న‌మాజ్ చేయిస్తారు : యూపీ మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement

Om Prakash Rajbhar | త్రినేత్ర న్యూస్ : ఉత్తరప్రదేశ్‌లో వ‌చ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌లు (2027 UP Assembly Elections) జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో అధికార, విప‌క్ష పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం మొద‌లైంది. ఒక‌రిపై ఒక‌రు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) అధినేత అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav)పై ఉత్తరప్రదేశ్ మంత్రి ఓం ప్రకాష్ రాజ్‌భర్ (Om Prakash Rajbhar) తీవ్రస్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్రంలో సమాజ్‌వాదీ పార్టీ మ‌ళ్లీ అధికారంలోకి వస్తే.. అఖిలేష్ యాదవ్ అయోధ్యలోని రామమందిరంలో (Ayodhya Ram Mandir) నమాజ్ (namaz) చేయిస్తారని విమ‌ర్శించారు.

రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే అయోధ్యను 'సనాతన తీర్థయాత్రల ప్రపంచ రాజధాని'గా మారుస్తామంటూ అఖిలేష్ యాదవ్ ఇటీవలే సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న ట్వీట్‌కు స్పందించిన‌ రాజ్‌భ‌ర్.. అఖిలేష్ యాదవ్ ఐదేళ్ల ముఖ్యమంత్రి పదవీకాలంపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. 2012 నుంచి 2017 మధ్య ఐదేళ్ల పాటూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న అఖిలేష్ యాద‌వ్ అయోధ్య కోసం ఏం చేశారంటూ ప్ర‌శ్నించారు. హనుమాన్ గర్హీ (Hanuman Garhi) ఆల‌యంలో నమాజ్ చేయించ‌డంలో విజ‌యం సాధించార‌ని ఎద్దేవా చేశారు. ఒకవేళ ఆయన మళ్లీ అధికారంలోకి వస్తే గుడి లోపల కూడా నమాజ్ చేయిస్తారంటూ ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. యూపీ ఎన్నిక‌ల‌కు ముందు అఖిలేష్ డిసెంబర్ 12న తన కుటుంబంతో కలిసి అయోధ్యను సందర్శించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.

మ‌రోవైపు యూపీలో త‌మ పార్టీ అధికారంలోకి వ‌స్తే రామమందిరానికి పారదర్శక నిర్వహణను అందిస్తామని, అయోధ్యలో ప్రపంచ స్థాయి మౌలిక వసతులను కల్పిస్తామని అఖిలేష్ హామీ ఇచ్చారు. బయటి కాంట్రాక్టర్లకు బదులుగా స్థానిక కాంట్రాక్టర్లకు ప్రాధాన్యత ఇస్తామని, స్థానికుల‌కు ఉపాధి, పేదలకు రేషన్ వంటి అంశాల ద్వారా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా టెంపుల్ సిటీలో భూముల కొనుగోళ్ల‌లో జ‌రిగిన అక్ర‌మాల‌పై విచార‌ణ జ‌రిపిస్తామ‌ని హామీ ఇచ్చారు.

Also Read..

ఐదు విడతల నీట్ కౌన్సెలింగ్ తర్వాత కూడా 411 మెడికల్ సీట్లు ఖాళీగానే.. అధిక ఫీజుల భార‌మే కార‌ణ‌మా..?

సీఎం రేవంత్ రెడ్డి బర్త్‌డే ఫ్లెక్సీ దగ్ధం.. రగిలిన వర్గ విభేదాలు

ఇస్తాంబుల్‌లో టీవీఎస్ కాలిస్టో 110.. టర్కీలోకి టీవీఎస్ అడుగు..

Advertisement
Advertisement