Airtel Broadband | బ్రాడ్‌బ్యాండ్‌లో ఎయిర్‌టెల్ జోరు.. వేగం, నాణ్యతలో జియోపై భారీ ఆధిక్యం..
Airtel Broadband | భారత బ్రాడ్‌బ్యాండ్ సేవల విభాగంలో ఎయిర్‌టెల్ సత్తా చాటింది. ఓపెన్‌సిగ్నల్ నవంబర్ 2026 నివేదిక ప్రకారం.. ఇంటర్నెట్ వేగం, విశ్వసనీయత, స్థిరమైన నాణ్యత వంటి ఐదు కీలక విభాగాల్లోనూ ఎయిర్‌టెల్ అగ్రస్థానంలో నిలిచింది. ముఖ్యంగా విశ్వసనీయతలో జియో కంటే 15 శాతం, డౌన్‌లోడ్, అప్‌లోడ్ వేగాల్లో 26 నుంచి 27 శాతం మెరుగైన ఫలితాలను సాధించింది.
Airtel Broadband | భారత బ్రాడ్‌బ్యాండ్ సేవల విభాగంలో ఎయిర్‌టెల్ సత్తా చాటింది. ఓపెన్‌సిగ్నల్ నవంబర్ 2026 నివేదిక ప్రకారం.. ఇంటర్నెట్ వేగం, విశ్వసనీయత, స్థిరమైన నాణ్యత వంటి ఐదు కీలక విభాగాల్లోనూ ఎయిర్‌టెల్ అగ్రస్థానంలో నిలిచింది. ముఖ్యంగా విశ్వసనీయతలో జియో కంటే 15 శాతం, డౌన్‌లోడ్, అప్‌లోడ్ వేగాల్లో 26 నుంచి 27 శాతం మెరుగైన ఫలితాలను సాధించింది.
హోం ఇంటర్నెట్‌లో ఎయిర్‌టెల్ టాప్..
ప్రముఖ నెట్‌వర్క్ విశ్లేషణ సంస్థ ఓపెన్‌సిగ్నల్ విడుదల చేసిన నవంబర్ 2026 ఇండియా ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ ఎక్స్‌పీరియన్స్ నివేదికలో ఎయిర్‌టెల్ దేశంలో అత్యుత్తమ హోమ్ ఇంటర్నెట్ ప్రొవైడర్‌గా గుర్తింపు పొందింది. జియో, బీఎస్ఎన్ఎల్ సేవలతో పోల్చిన ఈ నివేదికలో ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ విభాగానికి సంబంధించి విశ్వసనీయత, స్థిరమైన నాణ్యత, డౌన్‌లోడ్ వేగం, అప్‌లోడ్ వేగం, వీడియో అనుభవం వంటి ఐదు విభాగాల్లోనూ ఎయిర్‌టెల్ అవార్డులు గెలుచుకుంది. ఓపెన్‌సిగ్నల్ 100 నుంచి 1వేయి పాయింట్ల స్కేల్‌పై నిర్వహించిన పరీక్షల్లో ఎయిర్‌టెల్ 486 పాయింట్ల విశ్వసనీయత స్కోరు సాధించగా, జియో 423 పాయింట్లకే పరిమితమైంది. అంటే ఎయిర్‌టెల్‌కు 15 శాతం ఆధిక్యం లభించింది. జియో డౌన్‌లోడ్ వేగం 30.5 ఎంబీపీఎస్, అప్‌లోడ్ వేగం 21 ఎంబీపీఎస్‌గా నమోదయ్యాయి. ఈ రెండు విభాగాల్లోనూ ఎయిర్‌టెల్ 26 నుంచి 27 శాతం మెరుగైన వేగాన్ని నమోదు చేసింది. అయితే బీఎస్ఎన్ఎల్ కూడా ఈ విభాగాల్లో ఎయిర్‌టెల్‌కు దగ్గరగా నిలిచింది. డౌన్‌లోడ్‌లో కేవలం 0.5 ఎంబీపీఎస్, అప్‌లోడ్‌లో 0.8 ఎంబీపీఎస్ మాత్రమే వెనుకబడింది.
అన్నింటికన్నా అత్యధిక వేగం..
ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (ఎఫ్‌డబ్ల్యూఏ) విభాగంలోనూ ఎయిర్‌టెల్ ఐదు అవార్డులను కైవసం చేసుకుంది. డౌన్‌లోడ్ వేగంలో 32.4 ఎంబీపీఎస్ సాధించగా, జియో 25.7 ఎంబీపీఎస్ నమోదు చేసింది. అప్‌లోడ్ వేగంలో ఎయిర్‌టెల్ 20.7 ఎంబీపీఎస్, జియో 17.1 ఎంబీపీఎస్ సాధించాయి. స్థిరమైన నాణ్యత విషయంలో ఎయిర్‌టెల్ 66.2 శాతం స్కోరు సాధించగా, జియో 55 శాతానికే పరిమితమైంది. విశ్వసనీయతలో ఎయిర్‌టెల్ 450 పాయింట్లు, జియో 382 పాయింట్లు సాధించాయి. వీడియో అనుభవంలోనూ ఎయిర్‌టెల్ అవార్డు దక్కించుకుంది. జాప్యం, సిగ్నల్ హెచ్చుతగ్గులు, డేటా ప్యాకెట్ల నష్టం, డౌన్‌లోడ్, అప్‌లోడ్ వేగం వంటి అంశాల ఆధారంగా స్థిరమైన నాణ్యతను అంచనా వేశారు.
ఇక భారత ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) గణాంకాల ప్రకారం 2026 ఆగస్టు చివరి నాటికి దేశంలో 4.86 కోట్ల వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు, 1.93 కోట్ల ఎఫ్‌డబ్ల్యూఏ కనెక్షన్లు నమోదయ్యాయి. మొత్తం కనెక్షన్లు సుమారు 6.8 కోట్లకు చేరాయి. వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లో జియో 1.48 కోట్ల మంది వినియోగదారులతో మొదటి స్థానంలో ఉండగా, ఎయిర్‌టెల్ 1.14 కోట్లు, బీఎస్ఎన్ఎల్ 45.6 లక్షల మంది వినియోగదారులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
తాజావార్తలు
- ●Professor Tejasri Complaint | రాజేంద్రనగర్ పీఎస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత: వీసీపై ఫిర్యాదు చేసిన మహిళా ప్రొఫెసర్‌కు పోలీసుల వేధింపులు
- ●Priya Bhavani Shankar | ప్రియ భవానీ శంకర్ జీవితంలో కొత్త అధ్యాయం.. ప్రియుడు రాజ్వెల్తో ఏడడుగులు వేసిన ఇరుముడి భామ!
- ●MBBS | ఐదు విడతల నీట్ కౌన్సెలింగ్ తర్వాత కూడా 411 మెడికల్ సీట్లు ఖాళీగానే.. అధిక ఫీజుల భారమే కారణమా..?
- ●PepsiCo Layoffs | వేయి ఉద్యోగాలకు పెప్సికో కోత.. కారణాలివే..
- ●Siddhu Jonnalagadda | సిద్ధూ జొన్నలగడ్డకు జోడీగా నయన్ సారిక.. సుకుమార్ బ్యానర్లో కొత్త ప్రేమకథ!
- ●CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి బర్త్‌డే ఫ్లెక్సీ దగ్ధం.. రగిలిన వర్గ విభేదాలు

Professor Tejasri Complaint | రాజేంద్రనగర్ పీఎస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత: వీసీపై ఫిర్యాదు చేసిన మహిళా ప్రొఫెసర్‌కు పోలీసుల వేధింపులు

Priya Bhavani Shankar | ప్రియ భవానీ శంకర్ జీవితంలో కొత్త అధ్యాయం.. ప్రియుడు రాజ్వెల్తో ఏడడుగులు వేసిన ఇరుముడి భామ!

MBBS | ఐదు విడతల నీట్ కౌన్సెలింగ్ తర్వాత కూడా 411 మెడికల్ సీట్లు ఖాళీగానే.. అధిక ఫీజుల భారమే కారణమా..?

PepsiCo Layoffs | వేయి ఉద్యోగాలకు పెప్సికో కోత.. కారణాలివే..



