Pooja Hegde | శ్రీలంకలో పూజా హెగ్డే సందడి.. ‘అరబిక్ కుత్తు’ పాటకు అదిరిపోయే స్టెప్పులు!
Pooja Hegde | టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే మరోసారి తన డ్యాన్స్‌తో అభిమానులను అలరించింది. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న ఈ అందాల భామ కొలంబోలో జరిగిన ఓ షోరూమ్ ప్రారంభోత్సవంలో సందడి చేసింది. వెలవత్తే ప్రాంతంలో శ్రీయాని డ్రస్ పాయింట్ ఏర్పాటు చేసిన తొలి భారీ షోరూమ్‌ను ఆమె ప్రారంభించింది.
Entertainment | Published On Nov 11, 2026, 5.16 pm IST
Pooja Hegde | టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే మరోసారి తన డ్యాన్స్‌తో అభిమానులను అలరించింది. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న ఈ అందాల భామ కొలంబోలో జరిగిన ఓ షోరూమ్ ప్రారంభోత్సవంలో సందడి చేసింది. వెలవత్తే ప్రాంతంలో శ్రీయాని డ్రస్ పాయింట్ ఏర్పాటు చేసిన తొలి భారీ షోరూమ్‌ను ఆమె ప్రారంభించింది. పూజా వస్తున్నారన్న సమాచారం తెలియడంతో పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఆమెను చూసేందుకు అభిమానులు పోటీపడటంతో ఈ కార్యక్రమం సందడిగా సాగింది.
సాంగ్‌కు మంచి రెస్పాన్స్..
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పూజా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజయ్ హీరోగా నటించిన ‘బీస్ట్’ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ‘అరబిక్ కుత్తు’కు ఆమె మరోసారి స్టెప్పులు వేసింది. గతంలో ఈ పాటలో పూజా వేసిన డ్యాన్స్‌కు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు అదే పాటకు శ్రీలంక వేదికగా ఆమె డ్యాన్స్ చేయడంతో అభిమానులు ఫిదా అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పూజా ఎనర్జీ, డ్యాన్స్ చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
వరుస సినిమాలతో బిజీగా బుట్టబొమ్మ
సినిమాల విషయానికి వస్తే.. పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నది. ఇటీవల విజయ్ నటించిన ‘జన నాయగన్’ చిత్రంలో కనిపించింది. తెలుగులో దుల్కర్ సల్మాన్‌కు జోడీగా ‘శ్రీశ్రీ’ సినిమాలో నటిస్తోంది. రవి నేలకుడిటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, దీక్షిత్ శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. రొమాంటిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. మరోవైపు రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ చిత్రం ‘కాంచన 4’లోనూ కనిపించనుంది. ఈ సినిమాతో పాటు మరికొన్ని ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి. ఒకవైపు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే.. మరోవైపు బ్రాండ్ ప్రమోషన్లు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటూ అభిమానులకు దగ్గరవుతున్నది బుట్టబొమ్మ.
#PoojaHegde fever!🔥 The actress brings her energy and charm as she dances to Arabic Kuthu.
#FilmfareSouth #Celebs https://t.co/rowXdbwOpe
— Filmfare (@filmfare) November 11, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Siddhu Jonnalagadda | సిద్ధూ జొన్నలగడ్డకు జోడీగా నయన్ సారిక.. సుకుమార్ బ్యానర్లో కొత్త ప్రేమకథ!
నవంబర్ 11, 2026

Kiara Advani | ‘అబ్ బస్ హో గయా’.. రెండో బేబీ తర్వాత ఇక పిల్లలు వద్దంటున్న కియారా!
నవంబర్ 11, 2026

Karthika Masam | హరిహరులకు ప్రీతికరమైన పవిత్ర మాసం.. ఒక్క దీపంతోనే అనంత పుణ్యఫలం!
నవంబర్ 11, 2026
తాజావార్తలు
- ●Airtel Broadband | బ్రాడ్‌బ్యాండ్‌లో ఎయిర్టెల్ జోరు.. వేగం, నాణ్యతలో జియోపై భారీ ఆధిక్యం..
- ●Professor Tejasri Complaint | రాజేంద్రనగర్ పీఎస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత: వీసీపై ఫిర్యాదు చేసిన మహిళా ప్రొఫెసర్‌కు పోలీసుల వేధింపులు
- ●Priya Bhavani Shankar | ప్రియ భవానీ శంకర్ జీవితంలో కొత్త అధ్యాయం.. ప్రియుడు రాజ్వెల్తో ఏడడుగులు వేసిన ఇరుముడి భామ!
- ●MBBS | ఐదు విడతల నీట్ కౌన్సెలింగ్ తర్వాత కూడా 411 మెడికల్ సీట్లు ఖాళీగానే.. అధిక ఫీజుల భారమే కారణమా..?
- ●PepsiCo Layoffs | వేయి ఉద్యోగాలకు పెప్సికో కోత.. కారణాలివే..
- ●Siddhu Jonnalagadda | సిద్ధూ జొన్నలగడ్డకు జోడీగా నయన్ సారిక.. సుకుమార్ బ్యానర్లో కొత్త ప్రేమకథ!

Airtel Broadband | బ్రాడ్‌బ్యాండ్‌లో ఎయిర్టెల్ జోరు.. వేగం, నాణ్యతలో జియోపై భారీ ఆధిక్యం..

Professor Tejasri Complaint | రాజేంద్రనగర్ పీఎస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత: వీసీపై ఫిర్యాదు చేసిన మహిళా ప్రొఫెసర్‌కు పోలీసుల వేధింపులు

Priya Bhavani Shankar | ప్రియ భవానీ శంకర్ జీవితంలో కొత్త అధ్యాయం.. ప్రియుడు రాజ్వెల్తో ఏడడుగులు వేసిన ఇరుముడి భామ!

MBBS | ఐదు విడతల నీట్ కౌన్సెలింగ్ తర్వాత కూడా 411 మెడికల్ సీట్లు ఖాళీగానే.. అధిక ఫీజుల భారమే కారణమా..?



