Airtel Insider | ఎయిర్‌టెల్ కస్టమర్లకు రూ.30 వేలకుపైగా ప్రయోజనాలు.. కొత్త రివార్డ్స్ ప్రోగ్రామ్..
Airtel Insider | ఎయిర్‌టెల్ తన కస్టమర్ల కోసం ఎయిర్‌టెల్ ఇన్‌సైడర్ రివార్డ్స్ ప్రోగ్రామ్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా డ్యుయోలింగో, క్రోమా, పాకెట్ ఎఫ్ఎం, సినీపోలిస్, అపోలో 24 వంటి ప్రముఖ బ్రాండ్ల నుంచి రూ.30వేలకు పైగా విలువైన ప్రయోజనాలను పొందవచ్చు.
Airtel Insider | ఎయిర్‌టెల్ తన కస్టమర్ల కోసం ఎయిర్‌టెల్ ఇన్‌సైడర్ రివార్డ్స్ ప్రోగ్రామ్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా డ్యుయోలింగో, క్రోమా, పాకెట్ ఎఫ్ఎం, సినీపోలిస్, అపోలో 24 వంటి ప్రముఖ బ్రాండ్ల నుంచి రూ.30వేలకు పైగా విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా అర్హులైన మొబైల్, హోమ్ సర్వీస్ కస్టమర్లు ఈ ఆఫర్లను వినియోగించుకోవచ్చు.
ఏమేం ఆఫర్లను ఇస్తున్నారు..?
టెలికాం సేవలకు అదనంగా వినియోగదారులకు మరిన్ని ప్రయోజనాలను అందించాలనే లక్ష్యంతో ఎయిర్‌టెల్ ఈ రివార్డ్స్ ప్రోగ్రామ్‌ను రూపొందించింది. ఇందులో విద్య, షాపింగ్, వినోదం, ఆరోగ్యం వంటి విభాగాలకు చెందిన ఆఫర్లను ఒకే వేదికపై అందిస్తోంది. ఇందులో భాగంగా డ్యుయోలింగో సూపర్ సబ్‌స్క్రిప్షన్‌ను 12 నెలల పాటు ఉచితంగా అందిస్తోంది. దీని విలువ రూ.3,120గా ఉంది. క్రోమా ద్వారా ఎంపిక చేసిన ఐఫోన్ 15, 16, 17 మోడళ్లపై రూ.23వేల వరకు ఆదా చేసుకునే అవకాశం కల్పిస్తోంది. అయితే ఈ ఆఫర్ అర్హత కలిగిన ఐఫోన్ మోడళ్లకు మాత్రమే వర్తిస్తుంది. పాకెట్ ఎఫ్ఎం ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను మూడు నెలల పాటు అందిస్తుండగా, సినీపోలిస్‌లో రెండు సినిమా టికెట్లు కొనుగోలు చేస్తే ఒక టికెట్ ఉచితంగా పొందవచ్చు. ఈ ఆఫర్ కింద గరిష్ఠంగా రూ.150 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే రూ.1,500 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆహారం, పానీయాల ఆర్డర్లపై రూ.300 తగ్గింపు కూడా అందిస్తోంది. ఈ ప్రత్యేక ఆహార ఆఫర్ ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఆరోగ్య విభాగంలో అపోలో 24 ద్వారా ఆరు నెలల అపోలో సర్కిల్ మెంబర్‌షిప్‌ను అందిస్తోంది.
ఎలా పొందాలి..?
ఈ ప్రయోజనాలను పొందాలనుకునే అర్హులైన ఎయిర్‌టెల్ మొబైల్, ఎయిర్‌టెల్ హోమ్ కస్టమర్లు తమ ఎయిర్‌టెల్ యాప్‌ను తెరిచి అందులోని ఎయిర్‌టెల్ ఇన్‌సైడర్ విభాగానికి వెళ్లాలి. అక్కడ అందుబాటులో ఉన్న ఆఫర్లను పరిశీలించి తమకు నచ్చిన ఆఫర్‌ను ఎంపిక చేసుకోవాలి. అనంతరం సంబంధిత బ్రాండ్ సూచించిన నిబంధనలు, రిడెంప్షన్ విధానాన్ని అనుసరించి ప్రయోజనాలను పొందవచ్చు. గతంలో లింక్డ్‌ఇన్ ప్రీమియం, ఈజీడైనర్, మేక్‌మైట్రిప్ వంటి సంస్థలతో కూడా ఎయిర్‌టెల్ భాగస్వామ్యాలు కుదుర్చుకుంది. వివిధ రంగాలకు చెందిన బ్రాండ్లతో భాగస్వామ్యాలను ఎప్పటికప్పుడు మార్చుతూ, కొత్త ఆఫర్లను జోడించే రివార్డ్స్ వేదికగా ఎయిర్‌టెల్ ఇన్‌సైడర్ కొనసాగుతోంది. అయితే ప్రతి ఆఫర్‌కు సంబంధించిన అర్హతలు, వినియోగ నిబంధనలు, గడువు ఆయా బ్రాండ్ల షరతులకు లోబడి ఉంటాయి.
తాజావార్తలు
- ●Governor's Awards for Excellence-2026 | గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డ్స్‌కు దరఖాస్తు చేసుకోండి.. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన లోక్‌భవన్
- ●Sabarimala Temple | మకరవిళక్కు పూజల కోసం తెరుచుకున్న శబరిమల ఆలయం
- ●Sreeleela | నైట్ షూటింగ్ - పగలు ప్రమోషన్స్ - శ్రీలీల డెడికేషన్‌కు ఫ్యాన్స్ ఫిదా
- ●Stock Markets | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారులపై అమ్మకాల ఒత్తిడి..
- ●MLA Anirudh Reddy | వైఎస్సార్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊకోను: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వార్నింగ్
- ●Green India Challenge | కార్తీకమాసంలో హరిత సంకల్పం: ప్రతి ఇంటా ఉసిరి – ప్రతి గుడిలో బిల్వం

Governor's Awards for Excellence-2026 | గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డ్స్‌కు దరఖాస్తు చేసుకోండి.. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన లోక్‌భవన్

Sabarimala Temple | మకరవిళక్కు పూజల కోసం తెరుచుకున్న శబరిమల ఆలయం

Sreeleela | నైట్ షూటింగ్ - పగలు ప్రమోషన్స్ - శ్రీలీల డెడికేషన్‌కు ఫ్యాన్స్ ఫిదా

Stock Markets | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారులపై అమ్మకాల ఒత్తిడి..



