80s Vibes | సోషల్ మీడియాని షేక్ చేస్తున్న 80s ట్రెండ్.. వింటేజ్ లుక్‌లో ప్రధాని మోదీ, రాహుల్..
80s Vibes | కొత్తగా 80s ట్రెండ్ (80s Vibes) ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులకు సంబంధించిన రెట్రో ఫొటోలు సోషల్ మీడియాలో తెగ ఆకట్టుకుంటున్నాయి.
80s Vibes | త్రినేత్ర.న్యూస్ : సాంకేతికంగా ఏదైనా కొత్తది వచ్చిందంటే చాలు నెటిజన్లు దాన్ని అంత ఈజీగా వదలరు. ఏదైనా ఒక ట్రెండ్ మొదలైందంటే దాన్ని కచ్చితంగా ట్రై చేసి తీరుతారు. మొన్నటి వరకూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సరికొత్త ఫొటోలను సృష్టించి వైరల్ చేశారు. ఆ తర్వాత జిబ్లీ (Ghibli) స్టైల్ ఇమేజ్‌లతో నెట్టింట హల్‌చల్ చేశారు. ఇప్పుడు కొత్తగా 80s ట్రెండ్ (80s Vibes) ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది.
ఏ సోషల్ మీడియా ఖాతా, వాట్సాప్ స్టేటస్‌లు చూసినా 80s ట్రెండ్ రెట్రో ఫొటోలే దర్శనమిస్తున్నాయి. సినీ ప్రముఖులు మొదలు, సామాన్య ప్రజలతోపాటూ చివరికి పొలిటీషియన్స్ కూడా ఈ రెట్రో ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ఏఐ సాయంతో 80s ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, కిరణ్ రిజుజు, జితేంద్ర సింగ్, చిరాగ్ పాశ్వాన్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు పొలిటీషియన్స్ 80s లుక్ ఫొటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రెట్రో ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు తెగ ఆకట్టుకుంటున్నాయి.
పొలిటీషియన్సే కాదు, పలువురు సినీ సెలబ్రిటీలు సైతం ఈ కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా, అమీషా పటేల్, పవన్ కల్యాణ్ వంటి ప్రముఖులకు సంబంధించిన వింటేజ్ లుక్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. సాధారణ ఫోటోలను ఏఐ సాయంతో 1980ల నాటి రెట్రో స్టైల్ ఫోటోలుగా మార్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. పాతకాలపు బైక్‌లు, కార్లు, హెయిర్ స్టైల్, దుస్తులు, రేడియో బ్యాక్‌డ్రాప్‌తో వింటేజ్ లుక్‌లను క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ 80s ట్రెండే దర్శనమిస్తోంది. ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి మరి.

ప్రధాని మోదీ

రాహుల్ గాంధీ

సీఎం రేవంత్ రెడ్డి

కిరణ్ రిజుజు

పియూష్ గోయల్

చిరాగ్ పాశ్వాన్

జితేంద్ర సింగ్

హిమంత బిశ్వ శర్మ
Also Read..
30 మందితో వచ్చి.. ప్రిన్సిపాల్ ముందే విద్యార్థిని చితకబాదారు..
కరెంటే లేని పల్లె.. కొండారెడ్డి పల్లె
ఐఫోన్ 18 ప్రొ సిరీస్ వచ్చేసింది.. ధర రూ.1.64 లక్షల నుంచి..
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●KTR | ఫ్యూచర్ సిటీ అనేది మాయ.. రేపటి రోజున నిలవదు, చెల్లదు
- ●SBI | కస్టమర్లకు ఎస్బీఐ అలర్ట్.. వరుస సెలవులు, ఏటీఎంలు పనిచేస్తాయా..?
- ●Power problem in Konda Reddy Pally | కరెంటే లేని పల్లె.. కొండారెడ్డి పల్లె
- ●Apple iPhone 18 Pro | ఐఫోన్ 18 ప్రొ సిరీస్ వచ్చేసింది.. ధర రూ.1.64 లక్షల నుంచి..
- ●Students Attack | 30 మందితో వచ్చి.. ప్రిన్సిపాల్ ముందే విద్యార్థిని చితకబాదారు..
- ●MK Stalin | తమ్ముడు విజయ్.. మీరు చెప్పింది నిజమే.. పోలీసుల దాష్టీకానికి నా దవడ పగిలింది : ఎంకే స్టాలిన్

KTR | ఫ్యూచర్ సిటీ అనేది మాయ.. రేపటి రోజున నిలవదు, చెల్లదు

SBI | కస్టమర్లకు ఎస్బీఐ అలర్ట్.. వరుస సెలవులు, ఏటీఎంలు పనిచేస్తాయా..?

Power problem in Konda Reddy Pally | కరెంటే లేని పల్లె.. కొండారెడ్డి పల్లె

Apple iPhone 18 Pro | ఐఫోన్ 18 ప్రొ సిరీస్ వచ్చేసింది.. ధర రూ.1.64 లక్షల నుంచి..






