త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ఫ్యూచర్ సిటీ అనేది మాయ.. రేపటి రోజున నిలవదు, చెల్లదు

KTR | ఫ్యూచ‌ర్ సిటీ అనేది మాయ అని.. అది రేప‌టి రోజున నిల‌వ‌దు, చెల్ల‌దని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఫ్యూచరే లేని సీఎం తన అన్నదమ్ముల కోసం ఆడుతున్న నాటకంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వారు బలిపశువులు కావొద్ద‌న్నారు.

S

Telangana | Published On Sep 10, 2026, 1.30 pm IST

KTR | ఫ్యూచర్ సిటీ అనేది మాయ.. రేపటి రోజున నిలవదు, చెల్లదు
Advertisement
  • రంగారెడ్డి జిల్లాలో ఊరూరా సదస్సులు పెట్టి ఈ మాయ గురించి చెప్తాం
  • పెట్టుబడిదారులారా.. బలిపశువులు కాకండి
  • రాఘవ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పై ప్ర‌శ్నిస్తామ‌నే మమ్మ‌ల్ని స‌స్పెండ్ చేశారు
  • బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్య‌లు

KTR | త్రినేత్ర‌.న్యూస్‌: ఫ్యూచ‌ర్ సిటీ అనేది మాయ అని.. అది రేప‌టి రోజున నిల‌వ‌దు, చెల్ల‌దని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఫ్యూచరే లేని సీఎం తన అన్నదమ్ముల కోసం ఆడుతున్న నాటకంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వారు బలిపశువులు కావొద్ద‌న్నారు. అనుముల అన్నదమ్ముల దోపిడీ గురించి బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదని ప్ర‌శ్నించారు. రంగారెడ్డి జిల్లాలో ఊరూరా సదస్సులు నిర్వ‌హించి ఫ్యూచర్ సిటీ మాయ గురించి వివ‌రిస్తామ‌ని పేర్కొన్నారు. ఫోర్త్ సిటీలో రేవంత్ రెడ్డి తన తమ్ముడు కొండల్ రెడ్డికి కట్టబెట్టిన ప్రభుత్వ భూమిని గురువారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందంతో క‌లిసి ఆయ‌న ప‌రిశీలించిన సంద‌ర్భంగా మాట్లాడారు.

గతంలో ఫార్మా సిటీ పేరు మీద షరతులతో భూసేకరణ జరిగింది. ఆ భూముల్లో వేరే సిటీలు పెడితే అవి రద్దవ‌వుతాయి. ఫ్యూచర్ సిటీ అనేది భవిష్యత్తులో ఉండదు. పెట్టుబడులు పెట్టడానికి వచ్చినవారు ఇక్కడ జరుగుతున్న రియల్ ఎస్టేట్ మాఫియాలో ఇరుక్కుంటే, మేం ప్రభుత్వంలోకి వచ్చాక మొట్టమొదట నష్టపోయేది మీరే.

అమెరికా పర్యటనలో సొంత సోదరులతోనే ఒప్పందాలు చేసుకొని రేవంత్ రెడ్డి పెట్టుబడులు తెస్తున్నాడు. ది గ్రేట్ అనుముల రేవంత్ రెడ్డితో ది గ్రేట్ పారిశ్రామికవేత్త అనుముల జగదీశ్వర్ రెడ్డితో రూ.1000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాడు. ఇలా అనుముల జగదీశ్వర్ రెడ్డికి రూ.1000 కోట్లు, అనుముల కొండల్ రెడ్డికి రూ.250 కోట్లు ఇవ్వడమేనా ప్రజాపాలన? ఈ దోపిడీ గురించి బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదు?

కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంగా మారిందని బీజేపీ వాళ్ళు అంటారు.. మరి దొంగని పట్టుకోవాల్సిన హోమ్ మంత్రి ఎక్కడ ఉన్నాడు? ఇజ్రాయెల్‌తో ఒప్పందం చేసుకుంటే రాహుల్ గాంధీ మోదీని ప్రశ్నించాడు. అదే రేవంత్ రెడ్డి ఇజ్రాయెల్‌తో ఒప్పందం చేసుకుంటే నువ్వు ఎందుకు ప్రశ్నించడం లేదు, ఎందుకు ఈడీ విచారణకు, సీబీఐ విచారణకు ఆదేశించడం లేదు?

ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూసి పొంగులేటి కూడా రాఘవ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అని స్టార్ట్ చేశాడు. శాసనసభలో ఇది అడుగుతామనే మమ్మల్ని సస్పెండ్ చేశారు. 100 రోజుల్లోనే హామీలు అమలు చేస్తామని గద్దెనెక్కి.. 1000 రోజులైనా కాంగ్రెస్ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు, ఒక్క కుటుంబమూ బాగుపడలేదు. ఈ కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో రాష్ట్ర సంపదను నిలువునా దోచుకొని బాగుపడిన కుటుంబం ఏదైనా ఉందంటే.. అది కేవలం అనుముల కుటుంబం మాత్రమే అని కేటీఆర్‌ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

Advertisement
Advertisement