Supreme Court | బీసీసీఐని జాతీయ క్రీడా చట్టం పరిధిలోకి ఎందుకు తీసుకురాకూడదు..? : సుప్రీంకోర్టు
Supreme Court | భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సహా అన్ని రాష్ట్ర క్రికెట్ సంఘాలను నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్-2025 పరిధిలోకి ఎందుకు తీసుకురాకూడదని సుప్రీంకోర్టు (Supreme Court) ప్రశ్నించింది.
Supreme Court | త్రినేత్ర.న్యూస్ : భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సహా అన్ని రాష్ట్ర క్రికెట్ సంఘాలను నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్-2025 (National Sports Governance Act, 2025) పరిధిలోకి ఎందుకు తీసుకురాకూడదని సుప్రీంకోర్టు (Supreme Court) ప్రశ్నించింది. అదేవిధంగా ఆయా సంస్థల పదవుల్లో ఉన్న ఆఫీస్ బేరర్ల (office-bearers )సేవా నిబంధనలను ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ చట్టం కిందకు ఎందుకు చేర్చకూడదని నిలదీసింది. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సమర్పించాలని బీసీసీఐ, రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లను న్యాయస్థానం ఆదేశించింది. బీసీసీఐ వ్యవహారానికి సంబంధించి 2014 నుంచి పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కీలక ప్రశ్నలు సంధించింది.
భారతీయ క్రీడా రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం, క్రీడాకారుల సంక్షేమాన్ని పెంపొందించడం కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్-2025ను తీసుకొచ్చింది. అయితే, ప్రస్తుత నిబంధనల ప్రకారం బీసీసీఐ (BCCI) ఈ చట్టం పరిధిలోకి రాదు. ప్రస్తుతం బీసీసీఐ వ్యవహారాలు, వివాదాలకు సంబంధించి సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఒకవేళ బీసీసీఐ కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తే.. వీటికి సంబంధించిన అన్ని వివాదాలు, పెండింగ్ కేసులు సుప్రీంకోర్టు నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ ట్రిబ్యునల్‌కి బదిలీ అవుతాయి. దీనివల్ల సుప్రీంకోర్టుపై ఉన్న కేసుల భారం తగ్గుతుంది.
Also Read..
పేరులో ఎక్స్‌ట్రా 'F'.. భారతరత్న సీఎన్ఆర్ రావుకు ఈసీ నోటీసులు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Supreme Court | ఆ మెజిస్ట్రేట్‌కు ఎంత ధైర్యం..? లా విద్యార్థికి నోటీసులు ఇవ్వడంపై సుప్రీం ఆగ్రహం
సెప్టెంబర్ 9, 2026

Supreme Court | అర్హత లేనివారిని ఉపాధ్యాయులుగా నియమించొద్దు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
సెప్టెంబర్ 8, 2026

Aravalli Range | నా రిటైర్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారా..? ఆరావళిపై హైపవర్ కమిటీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
సెప్టెంబర్ 7, 2026
తాజావార్తలు
- ●Fauzi Movie | ‘ఫౌజీ’కి బ్రేక్.. సంక్రాంతి రేసులో నిలిచే ఛాన్స్..!
- ●KCR | కేసీఆర్‌పై జీరో ఎఫ్ఐఆర్..!
- ●TTD | వైభవోపేతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
- ●Sudden Sweating | వ్యాయామం చేయకున్నా చెమటలు అతిగా పడుతున్నాయా.. జాగ్రత్త, అది గుండె పోటుకు సంకేతం కావచ్చు..
- ●Singireddy Niranjan Reddy | ప్రశ్నిస్తారనే భయంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్
- ●Stock Markets | పశ్చిమ ఆసియాలో పెరిగిన యుద్ధ తీవ్రత.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

Fauzi Movie | ‘ఫౌజీ’కి బ్రేక్.. సంక్రాంతి రేసులో నిలిచే ఛాన్స్..!

KCR | కేసీఆర్‌పై జీరో ఎఫ్ఐఆర్..!

TTD | వైభవోపేతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Sudden Sweating | వ్యాయామం చేయకున్నా చెమటలు అతిగా పడుతున్నాయా.. జాగ్రత్త, అది గుండె పోటుకు సంకేతం కావచ్చు..



