త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

iOS 27 | ఐఫోన్లకు భారీ అప్‌డేట్.. సెప్టెంబర్ 14 నుంచే ఐఓఎస్ 27..

iOS 27 | యాపిల్ తాజాగా నిర్వహించిన ఐఫోన్ 18 ప్రొ ఈవెంట్‌లో ఐఓఎస్ 27ను సెప్టెంబర్ 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. యాపిల్ తొలిసారిగా ఐఓఎస్ 27, ఐప్యాడ్‌ఓఎస్ 27ను గ‌త‌ జూన్‌లో జరిగిన డబ్ల్యూడబ్ల్యూడీసీ సందర్భంగా ప్రివ్యూ చేసింది. అప్పటి నుంచి కొన్ని నెలల పాటు ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌లపై బీటా టెస్టింగ్ నిర్వహించింది.

S

Technology | Published On Sep 10, 2026, 1.53 pm IST

iOS 27 | ఐఫోన్లకు భారీ అప్‌డేట్.. సెప్టెంబర్ 14 నుంచే ఐఓఎస్ 27..
Advertisement

iOS 27 | యాపిల్ తాజాగా నిర్వహించిన ఐఫోన్ 18 ప్రొ ఈవెంట్‌లో ఐఓఎస్ 27ను సెప్టెంబర్ 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. యాపిల్ తొలిసారిగా ఐఓఎస్ 27, ఐప్యాడ్‌ఓఎస్ 27ను గ‌త‌ జూన్‌లో జరిగిన డబ్ల్యూడబ్ల్యూడీసీ సందర్భంగా ప్రివ్యూ చేసింది. అప్పటి నుంచి కొన్ని నెలల పాటు ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌లపై బీటా టెస్టింగ్ నిర్వహించింది. ఐఓఎస్ 27లో అత్యంత కీలకమైన కొత్త ఫీచర్ సిరి ఏఐ. ఇది యాపిల్ కొత్తగా రూపొందించిన డిజిటల్ అసిస్టెంట్‌కు పబ్లిక్‌గా అందుబాటులోకి వస్తున్న ప్రధాన మార్పుగా నిల‌వ‌నుంది. సిరి ఏఐకు అవసరమైన అల్గారిథమ్‌ల శిక్షణ కోసం జెమిని మోడళ్లను ఉపయోగించేందుకు యాపిల్ గూగుల్‌తో భాగస్వామ్యం చేసుకుంది. ప్రారంభ పరీక్షల్లో సిరి ఏఐ క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంతో పాటు, అనేక దశలతో కూడిన ఆదేశాలను కూడా అమలు చేయగలిగినట్లు ఎంగాడ్జెట్ వెల్లడించింది.

సిరి ఏఐ ఏయే ఐఫోన్ల‌కు..

సిరి ఏఐ ఫీచర్ ఐఫోన్ 15 ప్రొ, ఐఫోన్ 15 ప్రొ మ్యాక్స్ మోడళ్లకు అందుబాటులో ఉంటుంది. అలాగే ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్, ఐఫోన్ ఎయిర్ మోడళ్లలో మరింత శక్తివంతమైన ఆన్-డివైస్ మోడల్‌ను ఉపయోగించనున్నారు. తాజా ఐప్యాడ్ మినీ, ఎం1 చిప్ లేదా అంతకంటే కొత్త చిప్ కలిగిన ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రొ మోడళ్లకు కూడా సిరి ఏఐ సపోర్ట్ లభిస్తుంది. ముఖ్యంగా ఐఫోన్ 17 సిరీస్, ఐఫోన్ ఎయిర్ నుంచి ప్రారంభమయ్యే కొత్త ఐఫోన్ మోడళ్లలో మరింత శక్తివంతమైన ఆన్-డివైస్ మోడల్ ఉండడంతో స్పీచ్ రికగ్నిషన్, డిక్టేషన్ వంటి ఫీచర్లు మరింత క‌చ్చితంగా పనిచేయనున్నాయి. సిరి ఏఐతోపాటు ఐఓఎస్ 27, ఐప్యాడ్‌ఓఎస్ 27లో యాపిల్ లిక్విడ్ గ్లాస్ డిజైన్‌లో పలు మార్పులు చేసింది. కొత్త చైల్డ్ సేఫ్టీ ఫీచర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్‌ల పనితీరును మెరుగుపరిచే అనేక మార్పులను కూడా యాపిల్ తీసుకొచ్చింది.

స‌పోర్ట్ చేసే ఐఫోన్లు ఇవే..

మ్యాక్ కంప్యూటర్ల కోసం రూపొందించిన మ్యాక్‌ఓఎస్ 27 గోల్డెన్ గేట్‌లోనూ సిరి ఏఐ కీలకంగా ఉండనుంది. సిరి అసిస్టెంట్‌ను స్పాట్‌లైట్‌లోనే నేరుగా యాపిల్ ఇంటిగ్రేట్ చేసింది. దీంతో మ్యాక్‌లో సిరి ఏఐను మరింత సులభంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. మ్యాక్‌ఓఎస్ 27లో లిక్విడ్ గ్లాస్ డిజైన్‌కు అనుగుణంగా మ్యాక్‌కు ప్రత్యేకమైన మార్పులు చేశారు. టూల్‌బార్లను ఒకే తరహాలోకి తీసుకురావడం, స్క్రీన్ అంచుల వరకు విస్తరించే సైడ్‌బార్లు, మరింత మెరుగైన విండో ఆకృతులు, అప్‌డేట్ చేసిన మెనూ బార్ ఐకాన్లు ఇందులో ఉన్నాయి. ఐఓఎస్ 27, ఐప్యాడ్‌ఓఎస్ 27, వాచ్‌ఓఎస్ 27, మ్యాక్‌ఓఎస్ 27 గోల్డెన్ గేట్ సెప్టెంబర్ 14 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇక ఐఫోన్ 18 ప్రొ, ఐఫోన్ 18 ప్రొ మ్యాక్స్ మోడళ్లకు సెప్టెంబర్ 12 నుంచి ప్రీ-ఆర్డర్లు ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 18 నుంచి ఈ రెండు మోడళ్లు విక్రయాలకు రానున్నాయి. ఈ కొత్త ఐఫోన్లు ఐఓఎస్ 27తోనే అందుబాటులోకి రానున్నాయి. కాగా ఐఓఎస్ 27కు గాను ఐఫోన్ ఎస్ఈ (2వ జ‌న‌రేష‌న్‌), ఐఫోన్ 11 నుంచి ఆ త‌రువాత వ‌చ్చిన ఐఫోన్ సిరీస్ మోడ‌ల్స్ స‌పోర్ట్ ఇవ్వ‌నున్నాయి. ఆయా డివైస్‌ల‌లో సెప్టెంబ‌ర్ 14 నుంచి వినియోగ‌దారులు కొత్త ఓఎస్ అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవ‌చ్చు.

Advertisement
Advertisement