Supreme Court | ఢిల్లీలో ప్రజా రవాణాకు అనుమతించండి.. మెట్రో స్టేషన్లు మూసివేయాలన్న నిర్ణయంపై సుప్రీం అభ్యంతరం
Supreme Court | సీజేపీ నిరసనల (CJP protest) నేపథ్యంలో ఢిల్లీలో 57 మెట్రో స్టేషన్లు (Delhi Metro) మూసివేయాలన్న ఢిల్లీ పోలీసుల నిర్ణయంపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నిరసనల పేరుతో ప్రజా రవాణాను నిలిపివేయడమేంటి..? అని నిలదీసింది. ఢిల్లీలో రవాణాను పూర్తిగా నిలిపివేయవద్దంటూ కేంద్రాన్ని ఆదేశించింది.
Supreme Court | త్రినేత్ర న్యూస్ : ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar) రాజీనామాకు డిమాండ్ చేస్తూ శనివారం ఢిల్లీలో సీజేపీ తలపెట్టిన ఆందోళన (CJP protest) నేపథ్యంలో నగరంలో 57 మెట్రో స్టేషన్లను (Delhi Metro) మూసివేయాలన్న ఢిల్లీ పోలీసులు నిర్ణయంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మెట్రో సేవలను ఉపయోగించుకునే హక్కు పౌరులకు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వారి హక్కులను ప్రభావితం చేస్తుందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.
ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు విధించిన ఆంక్షలను సవాల్ చేస్తూ పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (CJI Surya Kant), జస్టిస్ జాయ్‌మల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. నిరసనల పేరుతో ప్రజా రవాణా సేవలను పూర్తిగా నిలిపివేయడం సరికాదని పేర్కొంది. ప్రజలకు అసౌకర్యం కలగకుండా, నియంత్రిత పద్ధతిలో సర్వీసులను అనుమతించాలని కేంద్రాన్ని ఆదేశించింది.
అందరికీ సొంత కార్లు ఉండవు..
విచారణ సందర్భంగా సీజేఐ సూర్య కాంత్ స్పందిస్తూ.. "గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్, తూర్పు ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ నుంచి వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు మెట్రోపైనే అధారపడతారు. వారిని దృష్టిలో ఉంచుకోవాలి. నగరంలో ప్రతీ ఒక్కరికీ సొంతకార్లు ఉండవు. వేలాది మంది సామాన్య ప్రజలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌పైనే ఆధారపడతారు. నిరసనల పేరుతో ఇలా సాధారణ ప్రజల సౌకర్యాలను పూర్తిగా నిలిపివేయడం సరికాదు" అని పేర్కొన్నారు.
ట్రాఫిక్ అడ్వైజరీ ఇవ్వండి..
అదేవిధంగా రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేయాల్సి వస్తే.. ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రజలకు పోలీసులు ముందే ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేయాలని తెలిపింది. దీన్ని వార్తాపత్రికలు, వెబ్‌సైట్లలో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించింది. నిరసన తెలిపే పౌరుల హక్కులను, సామాన్య ప్రజల రవాణా అవసరాలను సమతుల్యం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఈ సందర్భంగా సీజేఐ ధర్మాసనం గుర్తు చేసింది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా మెట్రో రైళ్లు, ఇతర రైల్వే సేవలను తగిన నిబంధనలతో క్రమబద్ధీకరించాలని ఆదేశించింది.
కేంద్రం స్పందన..
ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. జులై 20న జరిగిన పార్లమెంట్ మార్చ్ సందర్భంగా జరిగిన హింసను దృష్టిలో ఉంచుకునే భద్రతా చర్యలు చేపట్టినట్లు కోర్టుకు వివరించారు. కొన్ని సున్నితమైన ప్రాంతాల్లోనే ఇంటర్నెట్ సేవలు నిలిపివేత ఉందని.. దాన్ని సమీక్షిస్తామని తెలిపారు. రవాణా సేవలను సైతం క్రమబద్ధమైన పద్ధతిలో అనుమతించేలా అధికారులతో చర్చిస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు.
Also Read..
జగిత్యాల మెడికోలు పాడిన 'జిమ్ జిమ్ తార'.. ఒరిజినల్ ట్యూన్/సాంగ్ ఎక్కడిదో తెలుసా?
బతుకమ్మ విశిష్టతను విశ్వవ్యాప్తం చేస్తాం : మంత్రి జూపల్లి కృష్ణారావు
స్టాక్ మార్కెట్‌లలో జోష్.. 879 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

INDIA bloc | రాష్ట్రపతిని కలవనున్న ఇండీ కూటమి ఎంపీలు
అక్టోబర్ 9, 2026

Supreme Court | వాళ్లంతా యువ విద్యార్థులు.. ఢిల్లీ పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
అక్టోబర్ 9, 2026

Supreme Court | నా దేశానికి ఏమవుతోంది..? ఢిల్లీ షట్డౌన్పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సీనియర్ న్యాయవాదులు
అక్టోబర్ 9, 2026
తాజావార్తలు
- ●Jim Jim Tara | జగిత్యాల మెడికోలు పాడిన 'జిమ్ జిమ్ తార'.. ఒరిజినల్ ట్యూన్/సాంగ్ ఎక్కడిదో తెలుసా?
- ●Bathukamma | బతుకమ్మ విశిష్టతను విశ్వవ్యాప్తం చేస్తాం
- ●Balmoor Venkat | వీక్లీ సీరియల్లా కేటీఆర్ బాగోతాలు బయటేస్తా
- ●Stock Markets | స్టాక్ మార్కెట్‌లలో జోష్.. 879 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..
- ●AICWA | నానా పటేకర్ మృతిపై తనుశ్రీ దత్తా వ్యాఖ్యలు.. తీవ్రంగా ఖండించిన సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్
- ●GO 59 | జీవో 59 దరఖాస్తుదారులకు శుభవార్త

Jim Jim Tara | జగిత్యాల మెడికోలు పాడిన 'జిమ్ జిమ్ తార'.. ఒరిజినల్ ట్యూన్/సాంగ్ ఎక్కడిదో తెలుసా?

Bathukamma | బతుకమ్మ విశిష్టతను విశ్వవ్యాప్తం చేస్తాం

Balmoor Venkat | వీక్లీ సీరియల్లా కేటీఆర్ బాగోతాలు బయటేస్తా

Stock Markets | స్టాక్ మార్కెట్‌లలో జోష్.. 879 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..



