Bathukamma | బతుకమ్మ విశిష్టతను విశ్వవ్యాప్తం చేస్తాం
Bathukamma | తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ఔన్నత్యానికి, ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను ప్రపంచవ్యాప్తంగా చాటేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ నెల 10 నుంచి 18 వరకు తొమ్మిది రోజులపాటు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో బతుకమ్మ ఉత్సవాల పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు.
- ఈ నెల 10 నుంచి 18 వరకు తొమ్మిది రోజులపాటు సంబరాలు
- మంత్రి జూపల్లి కృష్ణారావు
- బతుకమ్మ ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
Bathukamma | తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ఔన్నత్యానికి, ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను ప్రపంచవ్యాప్తంగా చాటేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ నెల 10 నుంచి 18 వరకు తొమ్మిది రోజులపాటు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో బతుకమ్మ ఉత్సవాల పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు.
ప్రకృతి ఆరాధనకు ప్రతీక
బతుకమ్మ తెలంగాణకు ప్రత్యేకమైన పండుగ అని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. బతుకునే తల్లిగా భావించే తెలంగాణ ప్రజల జీవన సంస్కృతికి బతుకమ్మ నిలువుటద్దమని అన్నారు. ప్రకృతి ప్రసాదించిన రంగురంగుల పూలను బతుకమ్మగా పేర్చి, దేవతగా భావించి పూజించడం ఈ పండుగ ప్రత్యేకత అని వివరించారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయత, సంప్రదాయాలు, ప్రకృతి ఆరాధనను ప్రతిబింబించేలా ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పే పండుగలను విస్తృతంగా నిర్వహించడం ద్వారా రాష్ట్ర సంప్రదాయాలను భావితరాలకు అందించవచ్చని పేర్కొన్నారు. అంతేకాకుండా తెలంగాణ ప్రత్యేకతను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఆడపడుచులకు శుభాకాంక్షలు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలందరూ కలిసికట్టుగా, సంతోషంగా జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ క్రాంతి వల్లూరి, డైరెక్టర్ ఆఫ్ టూరిజం లక్ష్మణ్ రంజిత్ నాయక్, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి
- ●KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్
- ●Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!
- ●OU Degree Exam Fee | ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ
- ●Song Lyrics | సద్ది గట్టి...సెలకల తొవ్వ బట్టి - తెలంగాణ పల్లె పదాలతో చంద్రబోస్ మ్యాజిక్ - ‘ఏగిలివారంగ’ సాంగ్ లిరిక్స్ ఇవిగో...
- ●K Kavitha | చిత్రపురి అక్రమాలపై సీబీఐ, ఈడీ విచారణ జరిపించాలి : కల్వకుంట్ల కవిత

CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి

KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్

Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!

OU Degree Exam Fee | ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ