త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jim Jim Tara | జ‌గిత్యాల‌ మెడికోలు పాడిన ‘జిమ్‌ జిమ్ తార’.. ఒరిజినల్ ట్యూన్/సాంగ్ ఎక్కడిదో తెలుసా?

Jim Jim Tara | జిమ్ జిమ్ తార‌( Jim Jim Tara ).. జిమ్ తార తార.. అనే పాట కేవ‌లం సినీ ప్రేక్ష‌కుల వ‌ర‌కే ప‌రిమితం కాలేదు.. సంగీత ప్రియులు మాత్ర‌మే ఎంజాయ్ చేయ‌లేదు.. ఈ పాట మెడిక‌ల్ విద్యార్థుల( Medical Students ) ఉద్య‌మానికి గొంతుకైంది.

S

Telangana | Published On Oct 9, 2026, 4.09 pm IST

Jim Jim Tara | జ‌గిత్యాల‌ మెడికోలు పాడిన ‘జిమ్‌ జిమ్ తార’.. ఒరిజినల్ ట్యూన్/సాంగ్ ఎక్కడిదో తెలుసా?
Advertisement

Jim Jim Tara | త్రినేత్ర న్యూస్ : జిమ్ జిమ్ తార‌( Jim Jim Tara ).. జిమ్ తార తార.. అనే పాట కేవ‌లం సినీ ప్రేక్ష‌కుల వ‌ర‌కే ప‌రిమితం కాలేదు.. సంగీత ప్రియులు మాత్ర‌మే ఎంజాయ్ చేయ‌లేదు.. ఈ పాట మెడిక‌ల్ విద్యార్థుల( Medical Students ) ఉద్య‌మానికి గొంతుకైంది. త‌మ మెడిక‌ల్ కాలేజీ భ‌వ‌నంతో పాటు ఇత‌ర మౌలిక స‌దుపాయాలు క‌ల్పించాల‌ని చేప‌ట్టిన నిర‌స‌న‌కు జిమ్ జిమ్ తార తోడైంది. జిమ్ జిమ్ తార.. జిమ్ జిమ్ తార.. కాలేజ్ ఎక్కడ చిన్నోడా..! అంటూ మెడికోలు నినదించ‌గా.. ఎట్ట‌కేల‌కు కాంగ్రెస్ స‌ర్కార్( Congress Govt ) దిగొచ్చింది. చివ‌ర‌కు స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కారిస్తామ‌ని మెడిక‌ల్ కాలేజీ భ‌వ‌నంతో పాటు హాస్టల్‌ భవనాలు, ప్లేగ్రౌండ్‌, మెస్‌ తదితర మౌలిక వసతుల నిర్మాణ పనులను డిసెంబ‌ర్ 15 లోగా పూర్తి చేస్తామ‌ని ప్ర‌భుత్వం హామీ ఇచ్చింది. దీంతో మెడికోలు త‌మ నిర‌స‌న‌ను విర‌మించారు.

అస‌లు జిమ్ జిమ్ తార పాట ఎక్క‌డిది..? ( Jim Jim Tara )

గ‌త కొన్ని రోజుల నుంచి ఇన్‌స్టా గ్రామ్ రీల్స్‌తో పాటు యూట్యూబ్ షాట్స్‌లో జిమ్ జిమ్ తార పాట ఊపేస్తోంది. అమ్మాయిలు ఈ లిరిక్స్‌కు అనుగుణంగా వీడియోలు చేస్తూ పోస్టు చేస్తున్నారు. ఇంకేముంది.. ఆ వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతున్నాయి. అయితే ప‌ర్ణ‌శాల మూవీ( Parnashala Movie ) కోసం రాయ‌ల‌సీమ‌కు చెందిన గాయ‌ని గోకుల ల‌క్ష్మీదేవీ( Gokula Lakshmi Devi )(ల‌క్ష్మీ ఆంటీ)తో జిమ్ జిమ్ తార‌.. జిమ్ జిమ్ తార‌.. జిలేబీ తెరా చిన్నోడా( Jim Jim Tara Jilebi Tera Chinnoda ) అనే పాట‌ను పాడించారు. ఈ ట్రెండింగ్ ట్యూన్ సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అయ్యింది.

రెండు నెల‌ల క్రిత‌మే ప‌ర్ణ‌శాల సినిమా కోసం జిమ్ జిమ్ తార పాట ఆల‌పించిన‌ట్లు ల‌క్ష్మీదేవి పేర్కొన్నారు. అయితే ఆ త‌ర్వాత మ‌రోసారి ఈ పాట‌ను ఆమె పాడ‌గా.. ఆ వెర్ష‌న్ ఇంట‌ర్నెట్‌లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఇంకేముంది.. ఆ పాట ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షాట్స్‌లో ఒక ఊపు ఊపేసింది. డ్యాన్సులు, మీమ్స్‌తో ఆ ట్రెండింగ్ ట్యూన్ బాగా వాడేశారు.

మొత్తానికి ఈ ట్రెండింగ్ ట్యూన్‌ను జ‌గిత్యాల మెడిక‌ల్ కాలేజీ విద్యార్థులు త‌మ నిర‌స‌న‌కు ఉప‌యోగించుకున్నారు. త‌మ స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వానికి తెలియ‌జేసే క్ర‌మంలో ప‌లు నినాదాలు చేశారు. అయితే జిమ్ జిమ్ తార.. జిలేబీ తెరా చిన్నోడా అనే పాట‌ను కాస్త త‌మ నినాదంగా మార్చుకున్నారు. జిమ్ జిమ్ తార‌.. జిమ్ జిమ్ తార‌.. కాలేజ్ ఎక్క‌డ చిన్నోడా అని నిన‌దించారు. ఈ నినాదం సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అయింది. చివ‌ర‌కు ప్ర‌భుత్వం కూడా దిగొచ్చేలా చేసింది జిమ్ జిమ్ తార‌.. కాలేజ్ ఎక్క‌డా చిన్నోడా అనే నినాదం.

Advertisement
Advertisement